Vijayakanth Death: తమిళ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి
తమిళ చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. కథానాయకుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ మృతి చెందారు.
తమిళనాట విషాదం చోటు చేసుకుంది. ఇటు చిత్రసీమ, అటు రాజకీయ రంగంలో కీలక వ్యక్తి ఇవాళ ఉదయం కన్ను మూశారు. తమిళ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
విజయకాంత్ ఇకలేరు!
Vijayakanth Death: విజయకాంత్ గత కొన్నేళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా ఆయన చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే... ఈ ఏడాది నవంబర్ 18న జలుబు, దగ్గు తీవ్రతరం కావడంతో చెన్నైలోని బోరూర్ ఏరియాలో గల మయత్ ఆస్పత్రిలో చేరారు. సుమారు 23 రోజుల చికిత్స అనంతరం గత డిసెంబర్ 11న డిశ్చార్జ్ అయ్యారు. ఆ మధ్య కాలంలో విజయకాంత్ ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వ్యాపించాయి.
One of my favourite Tamil actors, A superstar, a good leader & more than anything, a generous person, Sri #Vijayakanth garu passed away 💔
— Vamsi Kaka (@vamsikaka) December 28, 2023
May his soul rest in peace. He will remembered as a Great person by admirers like me forever ❤️ pic.twitter.com/Bt36VPdClF
విజయకాంత్ అభిమానులు, డీఎండీకే పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు, ప్రజలలో ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్ల కారణంగా ఏర్పడుతున్న భయాలను దూరం చేయడానికి మయట్ హాస్పిటల్, పార్టీ ప్రధాన కార్యాలయం విజయకాంత్ ఆరోగ్యం గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించాయి.
What a shocker! Captain passes away. A legendary star on screen, one of the most genuine human beings off it. The last few years of captain's life have been sad: ill health, slowly deteriorating to pass away. Feels personal. RIP #Vijayakanth. pic.twitter.com/MdrHkdYBM7
— Srini Mama (@SriniMaama16) December 28, 2023
వీడియో విడుదల చేసిన విజయకాంత్ భార్య
విజయకాంత్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో ఆయన భార్య ప్రేమలత కొన్ని రోజుల క్రితం కన్నీటి పర్యంతమైన వీడియో విడుదల చేశారు. అందులో విజయకాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. తాజాగా ఆయనకు కరోనా సోకడంతో బుధవారం విజయకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఆయన మృతదేహాన్ని మయత్ ఆసుపత్రి నుంచి విరుగంబాక్కంలోని ఆయన నివాసానికి తరలిస్తున్నారు.
Also Read: ‘యానిమల్’ తర్వాత ‘జమాల్ జమాలూ’ గర్ల్‌కు యమ క్రేజ్, ఇంతకీ ఈ క్యూట్ బ్యూటీ ఎవరో తెలుసా?
#BREAKING: Veteran Actor/DMDK Leader Thiru. #Vijayakanth passed away in Chennai this morning..
— Ramesh Bala (@rameshlaus) December 28, 2023
He was getting treated for Corona infection in a hospital.. He was ill for sometime..
He was 71..
Liked by everyone, he was known for his generosity..
TN will miss him.. RIP! 💔 pic.twitter.com/eA2XHG2Mnf