వెంకటేష్ ఏం పొడిచారో చూస్తా, ఆ పాత్ర మిస్సయినందుకు బ్రహ్మానందం హర్ట్!
‘రానా నాయుడు’ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఆడిషన్ కు సంబంధించి మరో వీడియోను విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్. ఈ వీడియోలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం నటించారు.
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. మార్చ్ 10 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కరణ్ అన్షుమాన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ పై ఓ వైపు విమర్శలు వస్తున్నా మరోవైపు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఏదేమైనా ‘రానా నాయుడు’ ఓ సన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ గురించే టాక్. ఇదిలా ఉంటే తాజాగా ‘రానా నాయుడు’ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఆడిషన్ కు సంబంధించి మరో వీడియోను విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్. ఈ వీడియోలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం నటించారు. మొదట్నుంచీ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ ను వినూత్నంగా చేసుకుంటూ వస్తున్నారు నిర్వాహకులు. వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత చేసే ప్రమోషన్స్ ను కూడా అలాగే ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ ప్రమోషన్స్ వీడియోలో బ్రహ్మానందం ఆస్కార్ నాయుడి పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ‘రానా నాయుడు’ లో విలన్ పాత్ర కోసం ఆడిషన్స్ చేసే వ్యక్తులుగా కిరీటి దామరాజు, జబర్దస్త్ అవినాష్ లు కనిపించారు. ఇక వీడియోలో ‘రానా నాయుడు’ లో విలన్ పాత్ర కోసం వీరు ఆడిషన్ నిర్వహిస్తారు. అయితే అందులో బ్రహ్మానందం ఎంట్రీ ఇస్తాడు. ఈ సందర్భంలో అవినాష్ బ్రహ్మానందం మధ్య జరిగే సంభాషణ నవ్విస్తుంది. తర్వాత బ్రహ్మానందాన్ని యాక్టింగ్ చేయమని చెప్తే.. రానా సినిమాలలోని కొన్ని డైలాగ్ లను తన స్టైల్ లో చెప్పి ఆడిషన్ చేసే వాళ్లకి చిరాకు తెప్పిస్తారు. ఈ వ్యవహారం మొత్తం నవ్వులు పూయిస్తుంది. ఫైనల్ గా ఇందంతా చూసిన వెంకటేష్ ఆ విలన్ క్యారెక్టర్ ఏదో నేేనే చేస్తా అని ఓకే చేస్తారు. ‘రానా నాయుడు’కు విలన్ గా వెంకటేష్ ఓకే అవుతారు. దీంతో బ్రహ్మానందానికి కోపం వచ్చి ‘‘నన్ను తీసుకోకుండా వెంకటేష్ ను విలన్ గా తీసుకుంటారా, వాళ్లు ఏం పొడిచారో నేనూ చూస్తా. మీరు చూడండి ‘రానా నాయుడు’ నెట్ ఫ్లిక్స్ లో’’ అనే డైలాగ్ తో వీడియో ముగుస్తుంది. మొత్తంగా నాలుగు నిమిషాల వ్యవధి గల ఈ వీడియోతో మరోసారి సిరీస్ టీమ్ వినూత్నంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. ఈ వెబ్ సిరీస్ లో బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సన్నివేశాలు ఉంటాయని అందుకే ఫ్యామిలీతో కలసి చూడొద్దని ఒంటరిగా చూడాలని ఇప్పటికే ప్రకటించారు. వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత దీనిపై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరోతో ఇలాంటి వెబ్ సిరీస్ చేయించారు ఏంటి అని విమర్శలు వస్తున్నాయి. తెలుగు ఆడియన్స్ ఇలాంటి వెబ్ సిరీస్ లు ఎలా చూడగలుగుతారు అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, డ్రామా సన్నివేశాలతో భారీగానే తెరకెక్కించినా మరీ అంతలా బ్యాడ్ లాంగ్వేజ్ వాడాల్సిన అవసరం లేదని కొంతమంది అంటున్నారు. వెబ్ సిరీస్ లలోనే కాదు సోషల్ మీడియాలో కూడా దీనిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఏదేమైనా ఇదంతా ‘రానా నాయుడు’ పబ్లిసిటీ కి బాగానే ఉపయోగపడటంతో దీనిపై మరింత ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో టాప్ లో నడుస్తోంది.