అన్వేషించండి
Amitabh - Prabhas: ప్రభాస్ అతిథి మర్యాదలకు అమితాబ్ ఫిదా
రీసెంట్ గానే ప్రభాస్-అమితాబ్ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు పొగిడేసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ ని పొగుడుతూ మరో ట్వీట్ పెట్టారు అమితాబ్.

ప్రభాస్ అతిథి మర్యాదలకు అమితాబ్ ఫిదా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి పని చేసే కోస్టార్స్ అతడి అతిథి మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయో చెబుతుంటారు. ఇప్పటికే దీపికా పదుకోన్, శృతిహాసన్, శ్రద్ధా కపూర్ లాంటి స్టార్లు ప్రభాస్ అతిథి మర్యాదల గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాజాగా అమితాబ్ బచ్చన్ కూడా ప్రభాస్ ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. రీసెంట్ గానే ప్రభాస్-అమితాబ్ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు పొగిడేసుకున్నారు.
ఇప్పుడు ప్రభాస్ ని పొగుడుతూ మరో ట్వీట్ పెట్టారు అమితాబ్. 'బాహుబలి ప్రభాస్.. మీ ఔదార్యాన్ని లెక్కించలేం.. మీరు పంపించే ఇంటి ఫుడ్ చాలా రుచికరంగా ఉంటుంది. ఎంత క్వాంటిటీ పంపిస్తారంటే.. దాంతో మొత్తం ఆర్మీకి ఫుడ్ పెట్టొచ్చు. ఆ స్పెషల్ కుకీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరిచ్చే కాంప్లిమెంట్స్ కూడా జీర్ణించుకోలేని విధంగా ఉంటాయి' అంటూ రాసుకొచ్చారు.
ఈ ట్వీట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అమితాబ్ ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర భాషల నుంచి చాలా మంది నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ 'సలార్','ఆదిపురుష్', 'స్పిరిట్' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా కథలే.
T 4198 - 'Bahubali' Prabhas .. your generosity is beyond measure .. you bring me home cooked food, beyond delicious .. you send me quantity beyond measure .. could have fed an Army ..
— Amitabh Bachchan (@SrBachchan) February 20, 2022
the special cookies .. beyond scrumptious ..
And your compliments beyond digestible 🤣
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
పాలిటిక్స్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion