అన్వేషించండి

Puri Jagannadh: పూరి జగన్నాథ్ 'జనగణమన'లో బాలీవుడ్ హీరో?

పూరి దృష్టి బాలీవుడ్ హీరోలపై పడినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోలు రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ లతో టచ్ లోకి వెళ్లారట పూరి జగన్నాథ్.

ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్(Puri Jagannadh) కెరీర్ లో సరైన హిట్టు పడలేదు. గత దశాబ్ద కాలంలో ఆయన నుంచి చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా వచ్చిందంటే అది 'ఇస్మార్ట్ శంకర్' అనే చెప్పాలి. ఈ సినిమా చూసే విజయ్ దేవరకొండ.. పూరికి ఛాన్స్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో విడుదలైన 'లైగర్' సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా దెబ్బకి పూరి జగన్నాధ్ సైలెంట్ అయిపోయారు. ఎంతగానో నమ్మి చేసిన ఈ సినిమా నిరాశ పరిచింది. కనీసం సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినా.. విజయ్ తన పెర్ఫార్మన్స్ నెట్టుకొచ్చేవాడు.

కానీ సినిమాలో కథ, కథనాలు పేలవంగా ఉండడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఈ సినిమా ఎఫెక్ట్ తో పూరి పరిస్థి దారుణంగా తయారైంది. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.. మిడ్ రేంజ్ హీరోలు కూడా పూరికి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పూరి తన కొడుకు ఆకాష్ పూరితో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు పూరి దృష్టి బాలీవుడ్ హీరోలపై పడినట్లు తెలుస్తోంది. 

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోలు రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ లతో టచ్ లోకి వెళ్లారట పూరి జగన్నాథ్. ఆగిపోయిందనుకుంటున్న 'జనగణమన' సినిమాను వీరిద్దరిలో ఎవరో ఒకరితో చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. 'లైగర్' సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత విజయ్ దేవరకొండతో 'జనగణమన' అనే సినిమాను మొదలుపెట్టారు పూరి జగన్నాథ్. 

'లైగర్' సినిమా డిజాస్టర్ కావడంతో ఇక విజయ్ దేవరకొండ.. పూరితో సినిమా చేయడం లేదని వార్తలొచ్చాయి. మొన్నామధ్య 'సైమా' వేడుకల్లో విజయ్ ని ఈ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. విజయ్ చేయకపోయినా.. బాలీవుడ్ హీరోలతో ఈ సబ్జెక్ట్ తీయాలనుకుంటున్నారట పూరి జగన్నాథ్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. 

మరోపక్క పూరి ఫైనాన్షియల్ గా వీక్ అయ్యారని వార్తలొస్తున్నాయి. అందులో నిజం లేదని తెలుస్తోంది. పూరి ఓకే అంటే పెట్టుబడి పెట్టేవారు చాలా మంది ఆయన దగ్గర ఉన్నారట. అలానే ముంబైలో తీసిన ఆఫీస్ ను 'లైగర్' తరువాత క్లోజ్ చేశారని ప్రచారం జరిగింది. అందులో కూడా నిజం లేదని తెలుస్తోంది. ముంబైలో పూరి ఆఫీస్ అలానే ఉందట . 'జనగణమన' సినిమా పనులు ఆ ఆఫీస్ నుంచే మొదలుపెట్టారు. 

రామ్ తో సినిమా ఉంటుందా..?

'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్ వస్తుందని చెప్పారు. కానీ తరువాత రామ్, పూరి వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడంతో కుదరలేదు. ఇప్పుడు రామ్ ను కలిసి తనతో సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు పూరి. ఇటీవల రామ్ నటించిన 'ది వారియర్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రామ్. ఈ సినిమా పూర్తయిన తరువాత పూరికి రామ్ డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్

టాప్ హెడ్ లైన్స్

RS 20000 Subsidy For BCs: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
Jagadhatri Serial Today JULY 9th:చిలకమ్మను కిడ్నాపర్ల నుంచి కాపాడిన కౌషికి...శ్రీవల్లి కోసం మీనన్ మనుషులు ఎందుకు వెతుకుతున్నారు..?
జగద్ధాత్రి సీరియల్:చిలకమ్మను కిడ్నాపర్ల నుంచి కాపాడిన కౌషికి...శ్రీవల్లి కోసం మీనన్ మనుషులు ఎందుకు వెతుకుతున్నారు..?
Lenin OTT : అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Gurthukosthunnayi Series OTT : మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget