Sonam Kapoor: ట్రెండీగా బాలీవుడ్ నటి సోనమ్ సీమంతం, అమ్మాయిల డ్రెస్ వేసుకున్న అతడు ఎవరు?
సోనమ్ కపూర్ సీమంతం చాలా స్టైలిష్ గా జరిగింది.
త్వరలోనే తల్లి కాబోతోంది బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. తరచూ ఆమె తన బేబీ బంప్ ఫోటోలను ఇన్ స్టా షేర్ చేస్తుంటుంది. తన బిడ్డ కోసం ఎంతో ఎదురుచూస్తున్నట్టు ఆమె ఎన్నో సందర్భాల్లో తెలిపింది. గర్భం ధరించాక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సోనమ్ కపూర్. కాగా త్వరలోనే ప్రసవానికి రెడీ అవుతున్న సోనమ్ కు లండన్లో సింపుల్ గా సీమంతం జరిగింది. వెస్ట్రన్ స్టైల్ లో బేబీషవర్ నిర్వహించారు. సోనమల్ వెస్ట్రన్ డ్రెస్సులో అందంగా ఉంది. లియో కళ్యాణ్ అనే సింగర్ ఆ కార్యక్రమంలో పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరిచాడు. అతనే సోనమ్ ఫోటోలను షేర్ చేశారు. అయితే, అతడి డ్రెస్ చూసి నెటిజనులు షాకవ్వుతున్నారు.
ఈ వేడుకకు పలువురు విదేశీ స్నేహితులను ఆహ్వానించింది సోనమ్. వేడుకలో లియో తన పాటలతో ఉర్రూతలూగించాడు. సోనమ్ ఆయన పాటలను బాగా ఎంజాయ్ చేసినట్టు ఉంది వీడియోలో చూస్తుంటే. విదేశీ, స్వదేశీ స్నేహితులు, చాలా కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.
సోనమ్ కపూర్ బాలీవుడ్ అలనాటి హీరో అనిల్ కపూర్ గారాల పట్టి. 1985లో జన్మించింది. బాలీవుడ్లో అధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తాను ప్రేమించి ఆనంద్ ఆహుజాను పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి 2018లో జరిగింది. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించింది సోనమ్. సోనమ్ - ఆనంద్ ప్రస్తుతం తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. అతిత్వరలో ఆమె ప్రసవించనుంది. ఇండియాలో డెలివరీ చేయించుకుంటుందో, లేక విదేశాల్లో ప్రసవిస్తుందో చూడాలి.
View this post on Instagram
Also read: ఒక్క ట్వీట్‌తో జీహెచ్ఎంసీ అధికారులను ఇరికించేసిన అనుపమా