BJP Fire On Devi Sri Prasad : దేవిశ్రీప్రసాద్ వీడియో సాంగ్‌పై బీజేపీ ఫైర్ - తక్షణం డిలీట్ చేయాలని డిమాండ్ ! ఆ సాంగ్‌లో అంత ఏముందంటే ?
దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసిన ఓ వీడియో సాంగ్‌పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
BJP Fire On Devi Sri Prasad : మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ పై భారతీయ జనతా పార్టీ ఆగ్రహంగా ఉంది. ఆయన రూపొందించిన ఓ పాట కర్ణ కఠోరంగా ఉందని తక్షణం ఆ పాటను అన్ని చోట్లా డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. పాట అంత బాగోలేకపోతే వినకుండా ఉంటే సరిపోతుంది కానీ అన్ని చోట్లా తీసేయమని డిమాండ్ చేయడం ఏమిటని అనిపించవచ్చు. అయితే కర్ణ కఠోరంగా ఆ పాట ఉండటానికి కారణం దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కాదు. లిరిక్స్. అందులో బీజేపీ చాలా పవిత్రంగా భావించే దేవుడి పాటను పేరడిచేసి అసభ్యంగా పెట్టారట. అందుకే ఆ పాటను డిలీట్ చేయాలంటున్నారు. కోట్లాదిమంది జపించే హరే రామ హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని ఒక ఐటెం సాంగ్ కి పాడుతూ, బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాదిమంది హిందువుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా పాటను చిత్రీకరించారనేది ప్రధాన ఆరోపణ. బీజేపీ జాతీయ బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పార్థసారధి ఈ డిమాండ్‌ను వినిపించారు.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది జపించే హరే రామ హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని ఒక ఐటెం సాంగ్ కి పాడుతూ, బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాదిమంది హిందువుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా పాటను చిత్రీకరించిన @ThisIsDSP బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తక్షణమే ఆ పాటను అన్ని ప్రసార (1/3) pic.twitter.com/GO3gzGEUqC
— Dr Parthasarathi / डॉ पार्थसारथी / డా పార్థసారథి (@drparthabjp) November 2, 2022
ఈ పాట సినిమాలోనిది కాదు. దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా ఈ పాటలో డాన్స్ చేశారు. ఇటీవలి కాలంలో దేవిశ్రీ ప్రసాద్ జాతీయ స్థాయిలో పాటలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ యూ ట్యూబ్ చానల్ అయిన టీ సిరీస్ కోసం దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాట రూపొందించారు. నాలుగు వారాల కిందట యూట్యూబ్‌లోఅప్ లోడ్ చేశారు. ఈ పాటలకు ఇరవై మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. హిందీలో ఉన్న సాంగ్‌లో ... అభ్యంతరకర పదాలున్నాయనేది బీజేపీ అభ్యంతరం.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప”కి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన “పుష్ప” కి ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ మంచి వర్క్ చేయడంతో చాలా మంది ఫిదా అయ్యారు.“పుష్ప” రిలీజయ్యాక బాలీవుడ్ లో అనేక అవకాశాలు పలు సినిమాలకు అందుకుంటున్నాడు. అ సల్మాన్ ఖాన్ హీరోగా “కబీ ఈద్ కబీ దివాలి” అనే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ నీ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయబోతున్నారు. అంతకంటే ముందే టీ సీరిస్ భూషణ్ కుమార్ వీడియో సాంగ్ చేయమని ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ ను వినియోగించుకున్నారు. అయితే విడుదలైన నాలుగు వారాల తర్వాత దీనిపై వివాదం ప్రారంభం కావడం అనూహ్యంగా మారింది.