BiggBoss5: వెళ్లిపో, నా నెత్తి మీద ఎక్కకు నువ్వు... సిరిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన షన్ను
బిగ్‌బాస్ 5 ప్రోమో విడుదలైంది. సన్నీ కామెడీతో, షన్నూ ఫైర్ తో ప్రోమో రసవత్తరంగా ఉంది.

బిగ్‌బాస్5 సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఫన్నీ ఫన్నీ టాస్కులతో నడిపిస్తున్నాడు బిగ్ బాస్. రోల్ ప్లే టాస్కు నవ్వులు పూయించింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సన్నీ, మానస్ గురించే. ఇద్దరూ ప్రియాంకలా ముస్తాబై నవ్వించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సన్నీ, కాజల్ పై, మానస్ చాలా సీరియస్ అయ్యాడు. తరువాత మానస్ ప్రియాంకలా మారి కాసేపు నవ్వించాడు. నేటి ఎపిసోడ్ తాలూకు ప్రోమో విడుదలైంది ఇందులో సన్నీ హమీదాలా వేషం వేసుకున్నాడు. లాంగ్ ఫ్రాక్ లో శ్రీరామ్ దగ్గరికి వెళ్లి కామెడీ చేశాడు. కాలు ఎలా ఉంది అంటూ గట్టిగా నొక్కేశాడు. ‘వామ్మో గట్టిగా నొక్కేస్తున్నాడ్రోయ్’ అని అరుస్తూ కామెడీ చేశాడు.
సిరి-షన్నూ వీళ్లు మారరు...
ఇక సిరి, షన్నూ మళ్లీ దేనికోసమో గొడవ పడినట్టు కనిపించారు. షన్నూ దిగాలుగా కూర్చుంటే సిరి అతని దగ్గర కూర్చుని ఉంది. షన్ను కోపంగా ‘నువ్వు ఎవరితోనే ఎమోషనల్ కనెక్ట్ అయితే నేను నిన్ను ఆపాను, ఆపడమంటే నేను నిన్ను డిఫెండ్ చేశాను. మీ మదర్ వచ్చి హగ్ గురించి మాట్లాడారు. నేను నెగిటివ్ అవ్వట్లేదిక్కడ, నేను నెగిటివ్ గా ఆలోచిస్తున్నాను...’ అంటూ సిరికి క్లాసు పీకాడు. ఆ వెంటనే ‘అవతలి వాడిముందు నేను తక్కువైన ఫర్వాలేదు, నీ గురించి నేను ఫైట్ చేస్తున్నాను అప్పుడు నేను నెగిటివ్ అవ్వలా... నీకు మాత్రం ప్రతిది నీకు నచ్చినట్టు అవుతుంది, వెళ్లిపో’ అంటూ కసురుకున్నాడు. ‘మిగతా హౌస్ మేట్స్ ఎంతో నువ్వు కూడా అంతే నాకు, వెళ్లిపో, నా నెత్తి మీద ఎక్కకు నువ్వు’ అంటూ తీవ్రస్థాయిలో అరిచాడు. అదంతా మౌనంగా విన్న సిరి కళ్ల నీళ్లు పెట్టుకుంది. ప్రేక్షకులు మాత్రం ఏమంది ఎంత తిట్టుకున్నా చివర్లో ఓ హగ్ ఇచ్చి మళ్లీ ఇద్దరూ కలిసిపోతారులే, ప్రోమో చూపించినంత వేసి ఎపిసోడ్ లో ఉండదు అని కామెంట్లు చేస్తున్నారు.
#Sunny as #Hamida 😂 ... #Shanmukh #Siri heated discussion #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/ECi6VPdBEw
— starmaa (@StarMaa) December 8, 2021
Read Also: ‘జబర్దస్త్’ షోకు ‘సుధీర్ టీమ్’ గుడ్‌బై.. నిజమా? ఫూల్స్ చేస్తున్నారా?
Read Also: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ
Read Also: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















