Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్
ఎప్పుడూ కూల్ గా కనిపించే బిగ్ బాస్ మిల్కీ బాయ్ అర్జున్ కళ్యాణ్‌కు కోపమొచ్చింది. ఎందుకో తెలుసా?
శ్రీసత్య విషయంలో బిగ్ బాస్ సీజన్ 6 మిల్క్ బాయ్ అర్జున్ కళ్యాణ్, మెహబూబ్ కొట్టుకున్నారు. సత్యని ఎందుకు పదే పదే కామెంట్ చేస్తున్నావ్ అంటూ మెహబూబ్ అర్జున్ మీదకి ఫైటింగ్ కి దిగాడు. కళ్యాణ్ కామెంట్ చేస్తూనే ఉన్న కూడా పట్టించుకోకుండా తిరిగి తననే మాటలు అన్నందుకు మెహబూబ్ శ్రీ సత్య మీద ఫైర్ అయిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు కూల్ గా ఉండే కళ్యాణ్, మెహబూబ్ చొక్కా పట్టుకుని మరీ కొట్టేదాక ఎందుకు వెళ్లాడో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
స్టార్ మాలో ప్రసారమవుతోన్న ‘బీబీ జోడీ’ డాన్స్ ప్రోగ్రామ్ లో మెహబూబ్, శ్రీసత్య జంటగా డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాక్టీస్ సెషన్ కోసం స్టూడియోకి వెళ్తే అప్పటికే అక్కడ కళ్యాణ్ ఉన్నాడు. డాన్స్ ప్రాక్టీస్ కి వచ్చిన సత్య కాసేపు కళ్యాణ్ తో ముచ్చట పెట్టింది. తర్వాత సత్య, మెహబూబ్ కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే కళ్యాణ్ ‘వెరీ క్యూట్ స్టెప్స్’ అని కామెంట్ చేశాడు. ఆ మాటకి మెహబూబ్ కోపంగా ‘‘నీ ప్రాక్టీస్ చేసుకోవడం అయిపోయింది కదా వెళ్లిపో’’ అని అర్జున్ కి చెప్పాడు. ‘‘ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా.. వస్తుంది. అప్పటి దాకా ఇక్కడే ఉంటా’’ అని కళ్యాణ్ సీరియస్ గా చెప్పేసరికి తను వెళ్తేనే ప్రాక్టీస్ చేస్తానని మెహబూబ్ అన్నాడు.
‘‘తను అలా కామెంట్స్ చేస్తే నువ్వు చేస్తావేమో కానీ నేను డాన్స్ చేయను’’ అని మెహబూబ్ అంటే ‘‘మీరు బీబీ జోడీ రియల్ జోడీ ఏం కాదు’’ అని కళ్యాణ్ మళ్ళీ మెహబూబ్ ని రెచ్చగొట్టాడు. అక్కడి వాళ్ళు మెహబూబ్ ని కూల్ చేయడానికి చూస్తున్నా కూడా వినకుండా కళ్యాణ్ ని బయటకి వెళ్లిపొమ్మని పక్కకి నెట్టేశాడు. శ్రీసత్య మాత్రం ఏం అర్థం కాక గొడవలు ఎందుకని అంటుంది. ‘‘అంతా నీ వల్లే నువ్వు లేట్ గా రాకుండా ముందు వస్తే ఇలా జరిగేది కాదు కదా’’ అని మెహబూబ్ శ్రీసత్య మీద ఫైర్ అయిపోయాడు. కళ్యాణ్ ని వెళ్లిపొమ్మని మెహబూబ్ తనని బయటకి తోసేయబోతుంటే సత్య అడ్డుపడింది. ‘‘నిన్ను కామెంట్ చేస్తుంటే కంఫర్ట్ గా లేదని చెప్పకుండా నవ్వుతావ్’’ ఏంటని మెహబూబ్.. సత్య మీద ఫైర్ అయ్యాడు. దీంతో సత్య కోపంగా నేను ప్రాక్టీస్ చెయ్యను ఛానెల్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తానని వెళ్లబోతుంటే మెహబూబ్ నవ్వుతూ.. ‘‘నమ్మేశావా.. ఇదంతా ప్రాంక్’’ అనేసరికి సత్య బిత్తరపోతుంది. కళ్యాణ్ తో గొడవపడితే సత్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని మెహబూబ్ ఇలా ప్రాంక్ వీడియో చేశాడు. అలా సత్య రియాక్షన్ కోసం వీళ్ళు కొట్టేసుకున్నారన్నమాట.
View this post on Instagram