అన్వేషించండి

Bigg Boss Telugu 7: ఇదేనా ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాద? యావర్ మాటలకు హర్ట్ అయిన అశ్విని

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 10 స్థానాల కోసం కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. అదే సమయంలో యావర్ అన్న మాటలకు హర్ట్ అయిన అశ్విని సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu 7)లో 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. అందుకే వీరిలో టాప్ 10 కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారో నిర్ణయించుకోమని బిగ్ బాస్.. ఒక టాస్క్‌ను ఇచ్చారు. అయితే ఈ టాస్కులో ఒకరు తీసుకునే నిర్ణయం మరొకరికి నచ్చకపోవచ్చు. అందుకే కంటెస్టెంట్స్ మధ్య తీవ్రమైన వాగ్వాదాలే జరిగాయి. నవంబర్ 15న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌‌కు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఎవరు ఏ స్థానానికి అర్హులో చెప్పుకునే అవకాశాన్ని బిగ్ బాస్ వారికి కల్పించారు. దీంతో కంటెస్టెంట్స్ మధ్య చర్చలు మొదలయ్యాయి. అదే సమయంలో పల్లవి ప్రశాంత్, రతిక మధ్య మరోసారి చిచ్చురేగింది.

పల్లవి ప్రశాంత్ కోసం శివాజీ త్యాగం..
శివాజీ.. ఎప్పటిలాగానే పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్ చేస్తూ ‘‘వాడికి నెంబర్ 1 స్థానం ఇస్తున్నాను’’ అని చెప్పడంతో ఈ ప్రోమో మొదలయ్యింది. శివాజీ అలా చెప్పడంతో పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ‘‘నా బ్రతుకులో ఎవరూ చేయలేదు. అన్న చేశాడు. సీజన్ 7లో ఫస్ట్ కెప్టెన్ పల్లవి ప్రశాంత్. ఒక రైతు బిడ్డ’’ అని గర్వంగా చెప్పాడు. కానీ ప్రశాంత్ అన్న ఈ మాటలను రతిక ఒప్పుకోలేదు. ‘‘మొదటి నాలుగు వారాల్లో నీ గేమ్ ఏమీ లేదు. నీకు ఒకరు సాయం చేస్తుంది కనిపించట్లేదు. నువ్వు సొంతంగా గేమ్ ఆడుతున్నావో, గ్రూప్‌లో ఆడుతున్నావో కనిపించట్లేదు’’ అని ప్రశాంత్ ఆట గురించి తన అభిప్రాయన్ని బయటపెట్టింది రతిక.

ఇదేనా అమ్మాయికి ఇచ్చే మర్యాద..
రతిక అన్న మాటలకు పల్లవి ప్రశాంత్ సీరియస్ అయ్యాడు. ‘‘అక్క ఇటు చూడు. మా అమ్మను తిట్టావు. మా బాపును తిట్టావు. గడ్డం గీకేస్తా అన్నావు’’ అని రతిక ఒక టాస్కులో అన్న మాటలను గుర్తుచేశాడు. ప్రశాంత్ చెప్తున్న మాటలను పట్టించుకోకుండా ‘‘నేనేం పట్టించుకోను’’ అంటూ తేలికగా సమాధానం ఇచ్చింది రతిక. వీరిద్దరి తర్వాత అశ్విని, యావర్ మధ్య గొడవ మొదలయ్యింది. ‘‘ఇదేనా ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాద?’’ అని యావర్‌పై ఉమెన్ కార్డ్ ఉపయోగించే ప్రయత్నం చేసింది అశ్విని. దీంతో తను అన్న మాటలకు యావర్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. ‘‘అశ్విని అలా చెప్పొద్దు. నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలుసు. నువ్వేం నేర్పించకు. ఎప్పటికీ అలా చేయవద్దు’’ అని అశ్వినికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు యావర్. ‘‘అశ్విని నాకు డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వకు అన్నావు’’ అంటూ యావర్‌పై అరవడం మొదలుపెట్టింది అశ్విని. 

చివరి అయిదుగురికే అవకాశం..
ఆ తర్వాత శోభా కూడా యావర్‌తో చర్చ మొదలుపెట్టింది. ‘‘నా దృష్టిలో నువ్వు 7 అంతే’’ అని ప్రకటించింది. ఇక ఎన్నో వాగ్వాదాల తర్వాత కంటెస్టెంట్స్ అంతా నిర్ణయం తీసుకొని ఒక్కొక్క స్థానం దగ్గర నిలబడ్డారు. అప్పుడే బిగ్ బాస్ ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ‘‘ఇది మీరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే సమయం. కానీ ఈ పోటీలో మీరు వీక్ అని భావించిన చివరి అయిదుగురు మాత్రమే పోటీపడతారు’’ అంటూ ఇది ఉల్టా పుల్టా సీజన్ అని మరోసారి గుర్తుచేశారు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే అవకాశం లభించింది కాబట్టి టాప్ 6 నుండి టాప్ 10 స్థానాల్లో నిలబడిన అమర్‌దీప్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక సంతోషంలో మునిగిపోయారు. ఈ అయిదుగురు బిగ్ బాస్ ఇచ్చిన పజిల్ టాస్క్‌లో పాల్గొన్నట్టు ఈ ప్రోమోలో చూపించారు.

Also Read: ఫస్ట్ ప్లేస్​ ఎప్పటికైనా నాదే అంటున్న అమర్.. నేను టాప్ ​5లో ఉంటానంటున్న రతిక

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget