Jabardasth Emmanuel: బిగ్ బాస్ హౌస్‌లోకి జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - రూ.500తో భాగ్యనగరానికి వచ్చిన ఓ యువకుడి స్టోరీ
Emmanuel Background: టీవీ స్క్రీన్‌పై ఆ యువకుడు కనిపిస్తే నవ్వులే నవ్వులు. తనదైన పంచులతో పర్ఫెక్ట్ కామెడీని పండించే ఇమ్మాన్యుయెల్ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా...

Jabardasth Emmanuel Background: పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్... ఎమోషన్స్‌తోనూ నవ్వులు పూయించే టాలెంట్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా తనదైన టాలెంట్‌తోనే తెలుగు ఆడియన్స్‌లో ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఆ యువకుడు. అందంగా లేవంటూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా తన రూపాన్నే తనకు పాజిటివ్‌గా మలుచుకుని కామెడీ షోస్ ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరైన గుంటూరు మిర్చి. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరి గురించి ఈ ఇంట్రడక్షన్ అని. అదేనండీ కమెడియన్ ఇమ్మాన్యుయెల్. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఆయన ఎలా ఇండస్ట్రీలోకి వచ్చారు అనేది ఓసారి చూస్తే...
గుంటూరు కారం
గుంటూరులో ఓ పేద కుటుంబంలో జన్మించారు ఇమ్మాన్యుయెల్. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ అప్పుడప్పుడూ తనలో టాలెంట్‌ను చూపించుకునే వారు. ఆ తర్వాత జాబ్‌కు వెళ్తున్నా అని అబద్దం చెప్పి హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం వెతికారు. అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ చక్కర్లు కొట్టారు. తన స్నేహితుడి సహకారంతో కేవలం రూ.500తో తాను సిటీకి వచ్చి ఆడిషన్స్‌లో పాల్గొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఇమ్మాన్యుయెల్ చెప్పారు.
పటాస్ To జబర్దస్త్
2018లో కొన్ని స్టాండప్ కామెడీ షోలు చేసి అలా 'పటాస్' షోలో ఛాన్స్ దక్కించుకుని ఫస్ట్ స్కిట్‌లోనే తనదైన కామెడీ పంచులతో అదరగొట్టారు. ఓవైపు స్టాండప్ కమెడియన్‌గా చేస్తూనే మరోవైపు పటాస్‌లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఫేమ్‌తోనే కామెడీ షో 'జబర్దస్త్'లోకి ఎంట్రీ ఇచ్చారు. లేడీ కమెడియన్ వర్షతో స్కిట్స్ చేస్తూ తనదైన పంచులతో ఆడియన్స్‌ను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. వీరిద్దరి కెమెస్ట్రీ బుల్లితెరపై బాగా వర్కౌట్ అయ్యింది. అలా తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. తన తోటి సెలబ్రిటీలంతా ఆయన్ను ఇమ్మూ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.
ఆ తర్వాత శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించిన 'జాతిరత్నాలు' స్టాండప్ కామెడీ షోలోనూ తనదైన కామెడీతో ఎంటర్‌టైన్ చేశారు ఇమ్మాన్యుయెల్. పటాస్, జబర్దస్త్ తర్వాత స్టార్ మా ఛానల్‌కు వచ్చిన ఇమ్మాన్యుయెల్... 'కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్' షోతో పాటు ఇతర షోస్‌లోనూ పాల్గొంటూ తనదైన కామెడీతో అలరిస్తున్నారు.
Also Read: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ To బిగ్ బాస్ హౌస్ - ముద్దుగుమ్మ రీతూ చౌదరి గురించి ఈ విషయాలు తెలుసా?
జబర్దస్త్ To మూవీస్
స్టాండప్ కమెడియన్, టీవీ షోలతో పాటే సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు ఇమ్మాన్యుయెల్. సాయి దుర్గా తేజ్ 'విరూపాక్ష' మూవీలో ఓ చిన్న పాత్రలో నటించారు. అలాగే రీసెంట్‌గా మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర'లోనూ చిన్న రోల్ చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లోకి
ప్రస్తుతం ఇమ్మాన్యుయెల్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీని కోసమే ఆయన రీసెంట్‌గా స్టైలిష్‌గా కూడా మారారు. హ్యాండ్సమ్ లుక్‌తో ఆయన ఇన్ స్టాలో ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అయ్యాయి. హౌస్‌లోకి ఆయన ఎంట్రీ ఇలానే ఉంటుందంటూ ఆయన ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి బుల్లితెరపై తనదైన కామెడీ పంచులతో అదరగొట్టే ఇమ్మాన్యుయెల్... బిగ్ బాస్ హౌస్‌లో తన గేమ్‌తో టఫ్ కాంపిటీషన్ ఇస్తారో లేదో చూడాలి.






















