అన్వేషించండి

Bigg Boss Telugu 7: నాగార్జున ముందే బ్యాలెన్స్ కోల్పోయిన శివాజీ - ప్రియాంకపై అరుపులు, ఆరోపణలు

Bigg Boss Telugu 7: బిగ్ బాస్‌లో నాగార్జున ముందే సహనం కోల్పోయాడు శివాజీ. ప్రియాంకను అబద్ధాలు చెప్తున్నావు అంటూ ఆరోపించాడు. ఇంకా మరెన్నో వ్యాఖ్యలు కూడా చేశాడు.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 మొదట్లో శివాజీకి వచ్చిన పాపులారిటీ, ఓటింగ్ చూస్తే.. ఈ సీజన్‌కు తనే విన్నర్ అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ గత కొన్నివారాలుగా శివాజీ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. కొందరు కంటెస్టెంట్స్‌ను మాత్రమే టార్గెట్ చేస్తూ.. వారి క్యారెక్టర్స్ గురించి తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టారు. అంతే కాకుండా కొందరితో అసలు కలవకుండా దూరంగా ఉంటున్నాడు. తనే కరెక్ట్ అనే మనస్థత్వం పెరిగిపోయింది. అలాంటి శివాజీకి తాజాగా హౌజ్ నుండి బయటికి వెళ్లిపోయే అవకాశం వచ్చింది. కానీ తను వెళ్లకుండా నాగార్జున ఆపారు. అంతే కాకుండా ఆ తర్వాత నాగార్జున ముందే కొందరు కంటెస్టెంట్స్‌పై గట్టిగట్టిగా అరుస్తూ వ్యాఖ్యలు చేశాడు శివాజీ.

శివాజీని వెళ్లిపోకుండా ఆపిన నాగార్జున..
కొన్నివారాల క్రితం ఒక టాస్క్‌లో శివాజీ చేతికి గాయమయ్యింది. అప్పటినుండి ఆయన పూర్తిస్థాయిలో గేమ్స్‌లో పాల్గొనలేకపోతున్నాడు. అయినా ఏదో ఒక స్ట్రాటజీతో గేమ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. తాజాగా జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ వల్ల శివాజీ చేయి నొప్పి మరింత పెరిగిపోయింది. దీంతో ఒకరు కాకుండా ఇద్దరు, మూడు డాక్టర్లను సంప్రదించి, తన చేయి పరిస్థితి గురించి అడిగామని బిగ్ బాస్.. శివాజీకి వివరించాడు. ప్రస్తుతం ఆ నొప్పి ఎక్కువ ఇబ్బంది పెట్టకపోయినా.. తర్వాత టాస్కులో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి హౌజ్‌లో కంటిన్యూ అవ్వాలనుకుంటే తన నొప్పి బాధ్యత తానే తీసుకోవాలని బిగ్ బాస్ తెలిపారు. దీంతో ఉంటానని శివాజీ ప్రకటించాడు. ఆ తర్వాత కాసేపటికే వెళ్తానని మాట మార్చుకున్నాడు. ఇక నాగార్జున వచ్చిన తర్వాత నొప్పికంటే తాను ఏమీ ఆడలేకపోతాననే ఆలోచనే ఎక్కువ ఉందని వివరించాడు. అంతే కాకుండా బ్యాలెన్స్ కోల్పోతానేమో అని భయమేస్తుందని, ఇన్నిరోజులు మంచిగా ఉండి ఇప్పుడు ఒక నెగిటివ్ అభిప్రాయంతో హౌజ్ నుండి వెళ్లిపోవడం తనకు ఇష్టం లేదని అన్నాడు. కానీ నాగార్జున మాత్రం ఆటపై ఫోకస్ చేయమని మోటివేట్ చేసి.. శివాజీ హౌజ్ నుండి వెళ్లిపోకుండా ఆపాడు.

మాటిచ్చి అనవసరం..
ఆ తర్వాత అమర్‌దీప్ కెప్టెన్సీ విషయంలో శివాజీ మాట మార్చిన విషయం గురించి తనను అందరి ముందు అడిగారు నాగార్జున. ‘‘మాటిస్తున్నాను అన్నావు. మాట కోసం చచ్చిపోతాను అన్నావు. ఎందుకు మాట మార్చావు’’ అని ప్రశ్నించారు. ‘‘మాటిచ్చాను కానీ ఆ సమయంలో నేను అమర్‌ను ఒక మాట అడిగాను. డిప్యూటీలుగా ఎవరిని పెట్టుకుంటావు అని. దానికి అమర్.. ప్రియాంక, శోభా అన్నాడు. సేఫ్ గేమ్ నడుస్తుంది అక్కడ మొత్తం. ఎప్పుడైతే డిప్యూటీలు వాళ్లే అని అన్నాడో అప్పుడే ఇంక వాడితో మాటలు అనవసరం, వాడికి మాటిచ్చి ఆలోచించడం అనవసరం’’ అని అమర్‌కు ఎందుకు సపోర్ట్ చేయలేదో బయటపెట్టాడు శివాజీ.

కరెక్ట్ కాదు..
డిప్యూటీలుగా వాళ్లని తీసుకుంటే ఏంటి సమస్య అని నాగార్జున అడిగారు. ‘‘న్యాయంగా బాలేదు. చాలా కారణాలు ఉన్నాయి. అవి చెప్పినా వాళ్లకు అర్థం కావు. నామినేషన్స్‌కు వాడుకుంటారు తప్పా ఆలోచించి మారే పరిస్థితి ఏం లేదు. వారు కూడా గేమే ఆడుతున్నారు. వాళ్లని అనే హక్కు కూడా నాకు లేదు’’ అని సమాధానమిచ్చాడు శివాజీ. తను కెప్టెన్‌గా ఉన్నప్పుడు డిప్యూటీలుగా యావర్‌ను, ప్రశాంత్‌ను తీసుకున్న విషయం గుర్తుచేయగా.. వాళ్లు బాగా హెల్ప్ అయ్యారని అన్నాడు. అమర్‌కు కూడా వాళ్లు అలాగే హెల్ప్ అవుతారేమో అని నాగార్జున చెప్పిన మాటకు శివాజీ ఒప్పుకోలేదు. ఈ ముగ్గురిని మూడు వారాల నుండి చూస్తున్నాను, కరెక్ట్ కాదు అన్నాడు. పనులు జరగడం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ మాట ప్రియాంకకు నచ్చలేదు. ఒక మాట మాట్లాడాలి అంటూ నిలబడింది.

అబద్ధాలు చెప్తున్నావు..
‘‘శోభా, అమర్ డిప్యూటీలు అయినప్పుడు కొంతమందికి బాలేకపోతే వీళ్లిద్దరూ వచ్చి పనులు చేశారు’’ అని ప్రియాంక చెప్తుంగానే.. శివాజీ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. ‘‘ఏం లేదమ్మా. నువ్వు అన్నీ అబద్ధాలు చెప్తున్నావు’’ అని అన్నాడు. ‘‘నువ్వు కాదు ఇది. సైలెంట్‌గా మాట్లాడవు. మర్యాదగా చేయించేకోవు. రావడం రావడమే సీరియస్‌గా వస్తుంది. నేను వద్దనే ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నాను. ఇంకొకరిని బాధపెట్టడం ఇష్టం లేదు. ఎప్పుడు ఎవరికైనా సీరియస్‌గానే చెప్తావు. వచ్చిన వారంలోనే చెప్పాను’’ అంటూ ప్రియాంకపై ఆరోపణలు చేశాడు శివాజీ. దీంతో ప్రియాంకను కూర్చోమన్నారు నాగార్జున. అబద్ధం చెప్తున్నానంటా అంటూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. అది కూడా పట్టించుకోకుండా ‘‘ఇలాంటివి చాలా చేస్తావు శనివారం రోజు’’ అని మరో స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ సమయంలో శివాజీని సైలెంట్ చేయకుండా ప్రియాంకను మాత్రమే కూర్చోమని మరీ మరీ చెప్పారు నాగ్. అమర్‌దీప్ కూడా నాగార్జునతో మాట్లాడుతున్నప్పుడు తనపై కూడా అదే విధంగా సీరియస్ అయ్యాడు శివాజీ. దీంతో మరోసారి తన ప్రవర్తనతో ప్రేక్షకుల పట్ల నెగిటివ్‌గా మారిపోయాడు.

Also Read: వాడు మునగడు, నలుగురిని ముంచుతాడు - అమర్‌‌పై గౌతమ్ ఘాటు వ్యాఖ్యలు

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget