అన్వేషించండి

Bigg Boss Telugu 7: వాడు మునగడు, నలుగురిని ముంచుతాడు - అమర్‌‌పై గౌతమ్ ఘాటు వ్యాఖ్యలు

Bigg Boss Telugu 7: బిగ్ బాస్‌లో అమర్‌దీప్‌కు ఫుల్‌గా వ్యతిరేకంగా మారిపోయారు కొందరు కంటెస్టెంట్స్. అంతే కాకుండా కెప్టెన్సీ పోయిందనే బాధలో తను ఉంటే తన వెనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో చివరి కెప్టెన్సీలో జరిగిందంతా కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా మర్చిపోలేకపోతున్నారు. అసలు తప్పు ఎవరిది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. గతవారం కెప్టెన్సీలో చేసిన తప్పే.. ఈవారం కెప్టెన్సీలో కూడా చేశాడు అమర్. గతవారం కెప్టెన్సీ తనకు కాకుండా ప్రియాంకకు వెళ్తుంది అని తెలుసుకున్న సమయంలో ఎమోషనల్ అయిపోయాడు. బాగా ఏడ్చాడు. అది చూసి ఏడవకుండా మాట్లాడు అని కంటెస్టెంట్స్ అంతా తనకు సలహా ఇచ్చారు. అయినా కూడా ఈవారం కూడా కెప్టెన్సీ తనకు దక్కడం లేదనే బాధతో ఏడ్చాడు. అయినా కూడా కెప్టెన్ అవ్వలేకపోయాడు. కెప్టెన్సీ టాస్క్ రద్దు అయిన తర్వాత కూడా అమర్ బాధను ఎవరూ పట్టించుకోకుండా తన వెనుక మాట్లాడడం మొదలుపెట్టారు.

కెప్టెన్ అవ్వకుండా ఆపారా?
శివాజీని నమ్మి అమర్‌దీప్ కెప్టెన్సీ టాస్క్‌లో మోసపోయాడని సోషల్ మీడియాలో బిగ్ బాస్ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అయితే శివాజీ మాత్రం తాను ఏ తప్పు చేయలేదు అనే ఆలోచనలోనే ఉన్నాడు. అందుకే ప్రశాంత్ దగ్గర అమర్‌దీప్ గేమ్ గురించి మాట్లాడాడు. అమర్‌దీప్ కూడా అర్జున్‌లాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యింటే అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు అని శివాజీ అన్నాడు. ‘‘ఏమైనా అర్థముందా? వాడిని ఎవడైనా కెప్టెన్ అవ్వకుండా ఆపారా?’’ అంటూ అమర్ ఫీలింగ్స్‌ను తీసిపారేసినట్టుగా మాట్లాడాడు. మొదటి నుండి ఆడుతున్నాడు కానీ స్ట్రాంగ్‌గా ఆడలేదని అన్నాడు.

ప్రియాంకకు అర్థం కాలేదు..
శివాజీ మాత్రమే కాకుండా అర్జున్, గౌతమ్ కూడా అమర్‌దీప్ గురించి నెగిటివ్‌గా మాట్లాడడం మొదలుపెట్టారు. ‘‘వాడికి ఉన్నట్టు బయట నాకు సపోర్ట్ చేసేవాళ్లు నాకు ఉంటే ఏదైతే అది అని ఎవరి మీదకు పడితే వాళ్ల మీదకు పోయేవాడిని’’ అంటూ అమర్‌కు బయట ఉన్న సపోర్ట్ గురించి మాట్లాడాడు అర్జున్. గౌతమ్ కూడా అమర్‌దీప్ వల్ల ప్రియాంక గేమ్ ఎఫెక్ట్ అవుతుందని ఫీల్ అయ్యాడు. ‘‘ప్రియాంకకు అర్థం కాలేదు అసలు వాడి వల్ల దాని గేమ్ మైనస్ చేసుకుంటుంది. ఫిజికల్ గేమ్ మాత్రమే కాదు. మొత్తంగా చూస్తారు కదా. ముందు టాస్క్ అప్పుడే చెప్పాను వాడు మునగడు నలుగురిని ముంచుతాడు’’ అని అమర్ గురించి ప్రియాంకతో చెప్పిన మాటలను అర్జున్ ముందు బయటపెట్టాడు గౌతమ్. 

అమర్‌కు అర్జున్ క్లారిటీ..
అసలు కెప్టెన్సీ టాస్క్ సమయానికి ఎందుకలా జరిగింది అని అర్జున్ దగ్గర కూడా క్లారిటీ తీసుకున్నాడు అమర్‌దీప్. అసలు శివాజీని ఈ వారం కెప్టెన్సీలో సపోర్ట్ చేయమని తను అడగలేదని, తన భార్య ప్రస్తావన గురించి మూడు వారాల ముందు వచ్చిందని అర్జున్ బయటపెట్టాడు. ఆయన ఆ కారణం చెప్పి స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తాడని తాను కూడా ఊహించలేదు అన్నట్టుగా అర్జున్ మాటలు అనిపించాయి. అయితే డిప్యూటీలుగా ప్రియాంక, శోభాలను తీసుకుంటా అన్నందుకే శివాజీ.. అమర్‌దీప్‌కు సపోర్ట్ చేయలేదని ప్రియాంకకు క్లారిటీ ఇచ్చాడు గౌతమ్. అమర్‌కు కెప్టెన్సీ దక్కలేదని తనతో పాటు కూర్చొని ఏడ్చింది శోభా. అమర్‌ను కెప్టెన్ చేయమంటూ శివాజీకి దండం పెట్టిన విషయం కూడా గుర్తుచేసుకుంది. 

Also Read: అశ్వినితో ప్రశాంత్ బూతులు - సీరియస్ అయిన నాగార్జున

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
Embed widget