అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bigg Boss Telugu 7: అశ్వినితో ప్రశాంత్ బూతులు - సీరియస్ అయిన నాగార్జున

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. అందులో ముందుగా ప్రశాంత్‌పై సీరియస్ అయ్యారు నాగార్జున.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్.. గతవారం చేసిన తప్పులను గుర్తుచేసి వారిని మందలించడానికి నాగార్జున మళ్లీ సిద్ధమయ్యారు. వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన మొదటి ప్రోమో తాజాగా విడుదలయ్యింది. గతవారమంతా కంటెస్టెంట్స్ ఎక్కువగా మర్డర్ టాస్క్‌లోనే బిజీగా ఉన్నారు. ఈ టాస్క్‌లో ఎవరికి కుదిరినంత ఫన్‌ను వారు క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. ఇక ఈ టాస్క్ అయిపోయిన వెంటనే కెప్టెన్సీ టాస్క్ మొదలయ్యింది. కెప్టెన్సీ టాస్క్ గురించి, అమర్‌దీప్‌కు జరిగిన అన్యాయం గురించి నాగార్జున మాట్లాడతారేమో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మొదటి ప్రోమోలో దాని గురించి ప్రస్తావన తీసుకురాలేదు నాగ్.

మాట్లాడు ప్రశాంత్..
ముందుగా ఈ ప్రోమోలో పల్లవి ప్రశాంత్‌తో మాట్లాడడం మొదలుపెట్టారు నాగార్జున. ‘‘మర్డర్ అయిపోయావు. దెయ్యం అయిపోయావు. దెయ్యం అయిపోయాక ఈ బూతులు ఎంటి?’’ అని ప్రశాంత్‌ను అడిగారు. దానికి ప్రశాంత్‌కు ఏమీ అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోయాడు. ‘‘మాట్లాడు ప్రశాంత్. నామినేషన్స్‌లో మాట్లాడతావు ఇలా’’ అని ప్రశాంత్ మ్యానరిజంను ఇమిటేట్ చేసి చూపించారు నాగ్. అప్పటికీ ప్రశాంత్‌కు ఏమీ అర్థం కాకపోవడంతో అశ్విని, గౌతమ్‌లను లేపారు. అప్పుడు ప్రశాంత్‌కు తను చేసిన తప్పేంటో అర్థమయ్యింది. ‘‘నేను కావాలని అనలేదు సార్. తప్పైతే సారీ కూడా చెప్పాను’’ అని ప్రశాంత్ చెప్తుండగానే.. ‘‘ఎవరూ కావాలని అనరు. ఫన్నీగా అంటే అన్నీ చెల్లుతాయి. కానీ అశ్వినికి ప్రాబ్లమ్ వచ్చింది. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది’’ అని హెచ్చరించారు నాగ్.

శివాజీ బాటలో ప్రశాంత్..
అసలు ప్రశాంత్ ఏం చేశాడు, నాగార్జున ఎందుకు అన్నారు అని ప్రోమో చూసిన కొందరు ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు. మర్డర్ టాస్క్ జరుగుతున్న సమయంలో ముందుగా పల్లవి ప్రశాంత్ చనిపోయి దెయ్యంగా మారాడు. ఆ తర్వాత అశ్విని చనిపోయింది. అశ్విని తర్వాత గౌతమ్ చనిపోయి దెయ్యాలుగా మారారు. వారికి ఇంక టాస్క్‌లో ఆడే అవకాశం లేదు కాబట్టి గౌతమ్, అశ్విని కూడా ఫన్నీగా దెయ్యాలుగా యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో అశ్విని.. గౌతమ్‌ను టచ్ చేసింది. అది చూసిన ప్రశాంత్.. అశ్వినిని కామపిశాచి అన్నాడు. అది అశ్వినికి నచ్చలేదు. గౌతమ్ కూడా అలా అనకుండా ఉండాల్సిందని ప్రశాంత్‌కు నచ్చజెప్పాడు. దీంతో ప్రశాంత్ అప్పుడే సారీ చెప్పినా.. తను అన్న మాటకు మాత్రం అశ్విని హర్ట్ అయ్యింది. ఇక బూతుల విషయంలో నాగార్జున సైతం వచ్చి చర్చించారు కాబట్టి తన గురువు శివాజీలాగానే ప్రశాంత్ కూడా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడా అని కొందరు ప్రేక్షకులు అనుకుంటున్నారు.

అప్పుడే బలయిపోతాం..
పల్లవి ప్రశాంత్‌తో మాట్లాడడం పూర్తయిన తర్వాత అశ్వినితో మాట్లాడారు నాగార్జున. ముందుగా ‘‘ఈవారం సింగిల్ ఎలిమినేషనా? డబుల్ ఎలిమినేషనా?’’ అని అడిగారు. డబుల్ అని సమాధానమిచ్చింది అశ్విని. ‘‘డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా నువ్వు సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటావా?’’ అని ప్రశ్నించగా అశ్వినికి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా నిలబడింది. ‘‘కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?’’ అని నాగ్ అడిగినప్పుడు కూడా సైలెంట్‌గానే నిలబడింది. ‘‘మనం చేసే పొరపాట్ల వల్లే మనం బలయిపోతాం’’ అనగానే అశ్విని ఏడుపు మొహం పెట్టింది.

Also Read: రంగులు మారుస్తున్న శివాజీ, అమర్‌ ఎమోషన్స్‌తో ఆటలు - ఇప్పుడు ఆ కంటెస్టెంటే నెంబర్ వన్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Embed widget