అన్వేషించండి

Bigg Boss 7 Telugu: అమర్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడు - నాగార్జున ముందే నిజాన్ని బయటపెట్టిన ప్రియాంక

Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్రా టాస్కుల సమయంలో అమర్‌దీప్ వల్ల అందరికంటే ఎక్కువగా ప్రియాంకనే ఇబ్బందిపడింది. ఇక శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ముందు తన ఇబ్బందులు అన్నీ బయటపెట్టింది.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫినాలే అస్త్రాను సంపాదించుకున్నాడు అర్జున్. ఇక ఈ ఫినాలే అస్త్రా  కోసమే కంటెస్టెంట్స్ అంతా ఈ వారమంతా పోటాపోటీగా తలపడ్డారు. ఇక ఫినాలే అస్త్రా రేసులో కంటెస్టెంట్స్ అంతా ఎలా పర్ఫార్మ్ చేశారో చెప్పడానికి నాగార్జున వచ్చేశారు. ఈ రేసులో అందరికీ తన దృష్టిలో ఎన్ని పాయింట్స్ ఇస్తారో బయటపెట్టారు. అయితే ఫినాలే అస్త్రా టాస్కులు జరుగుతున్న సమయంలో ఇతర కంటెస్టెంట్స్‌తో చెప్పుకోలేని విషయాలను నాగార్జునతో చెప్పుకొచ్చింది ప్రియాంక. ఇక మెజారిటీ కంటెస్టెంట్స్ అమర్‌దీప్‌కే పాయింట్స్ ఇవ్వడం గురించి నాగార్జున ప్రస్తావించారు.

అర్జున్‌కు ప్రశంసలు..
‘‘ఫినాలే వీక్‌కు ఎంటర్ అవుతున్నవారిలో అర్జునే మొదటి కంటెస్టెంట్’’ అంటూ ప్రోమోలో ముందుగా అర్జున్‌ను ప్రశంసించారు నాగార్జున. ఇక ఫినాలే అస్త్రా రేసు నుండి ముందుగా తప్పుకున్న శివాజీ, శోభాలతో ముందుగా మాట్లాడారు. ‘‘శివాజీ, శోభా.. టికెట్ టు ఫినాలే లాంటి అతి ముఖ్యమైన సమయంలోనే మీ పర్ఫార్మెన్స్ ఇలా అయిపోయింది’’ అని అన్నారు. ఆ తర్వాత ‘‘100 శాతం ఇచ్చావా’’ అని శోభాను అడిగారు. ‘‘200 శాతం ఇచ్చాను’’ అని సమాధానమిచ్చింది శోభా. ‘‘200 శాతం అంటే 90 మాత్రమే వచ్చాయి మరీ’’ అని కౌంటర్ ఇచ్చారు నాగ్.

అమర్ అలుగుతాడనే భయంతో..
ఆ తర్వాత ఫినాలే అస్త్రా రేసులో తాను ఎందుకు బాగా ఆడలేకపోయాడో శివాజీ చెప్పుకొచ్చాడు. ‘‘వీరిందరినీ పట్టుకోవడానికి కూడా చేయి నాకు ఇబ్బంది అయ్యింది’’ అని కారణం చెప్పాడు. ‘‘రాడ్ గేమ్‌లో చేయి కాదు కదా కావాల్సింది. కాలే కదా’’ అని గుర్తుచేశాడు. దానికి శివాజీ సమాధానం లేక సైలెంట్‌గా ఉండిపోయాడు. ఆ తర్వాత ‘‘మీరిద్దరూ అమర్‌కు పాయింట్స్ ఇచ్చారు. కారణం ఏంటి?’’ అని అడిగారు నాగార్జున. ‘‘అమర్‌కు ఇంతకు ముందు కూడా ఇస్తానని చెప్పాను కదా అని ఇద్దరం కలిపి డిస్కషన్ చేసుకొని ఇచ్చేశాం’’ అని శివాజీ తెలిపాడు. ‘‘అంతేనా లేక అమర్ అలుగుతాడనా?’’ అని సూటిగా అడిగారు నాగ్. అలగడు అని శోభా చెప్పగానే నాగార్జున షాక్ అయ్యారు. ‘‘నాతో అలగడు’’ అని క్లియర్‌గా చెప్పింది శోభా. అమర్ అలుగుతాడా లేదా అని ప్రియాంకను అడిగారు నాగార్జున. ‘‘చాలా తలనొప్పిగా ఉంది దాని గురించి ఆలోచిస్తుంటే’’ అని అమర్ ప్రవర్తన గురించి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది. ‘‘పదేపదే అదే లూప్ కదా’’ అని నాగార్జున మరింత స్పష్టంగా చెప్పారు. 

ఎమోషనల్ బ్లాక్‌మెయిల్..
ఆ తర్వాత ప్రియాంక ఆట గురించి కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. ‘‘బాస్కెట్‌లో బాల్ వేసే టాస్క్‌లో ఎందుకు ఓడిపోయాను అనుకుంటున్నావు?’’ అని అడిగారు. ‘‘సంచాలకులు పెట్టిన రూల్ వల్ల’’ అని నవ్వుతూ నిజాన్ని బయటపెట్టింది ప్రియాంక. ‘‘ఆ బాధతోనేనా పాయింట్స్ అన్నీ గౌతమ్‌కు ఇచ్చావు?’’ అని అడగగా.. ‘‘ఆ బాధతో అని కాదు కృతజ్ఞతతోనే ఇచ్చాను’’ అని సమాధానమిచ్చింది. ‘‘కృతజ్ఞతతో గౌతమ్‌కు ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఆ పాయింట్స్ మళ్లీ అమర్‌కు ఇమ్మన్నావు?’’ అని ప్రశ్నించారు నాగ్. ‘‘అప్పుడు నా మైండ్‌లో ఇద్దరు ఉన్నారు’’ అని ప్రియాంక చెప్పబోతుండగా.. ‘‘అమర్ నిన్ను బ్లాక్‌మెయిల్ చేశాడా, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’’ అని సూటిగా అడిగేశారు నాగార్జున. అవును చేశాడని ప్రియాంక కూడా ఒప్పుకుంది. ‘‘నువ్వు పాయింట్స్ ఎందుకు ఇచ్చావో శోభాకు అసలు అర్థమే కాలేదు’’ అని శోభా చెప్పిన మాటలను గుర్తుచేశారు. ‘‘అర్థమవ్వాల్సిన వాళ్లకి అర్థమయ్యి ఉంటుంది’’ అని ప్రియాంక సూటిగా చెప్పేసింది.

Also Read: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Uniform Civil Code: నేటి నుంచిఉత్తరాఖండ్‌లో అమల్లోకి యూనిఫాం సివిల్ కోడ్  - ఈ చట్టంతో వివాహాలపై సైతం ప్రభావం
నేటి నుంచిఉత్తరాఖండ్ అమల్లోకి యూనిఫాం సివిల్ కోడ్ - ఈ చట్టంతో వివాహాలపై సైతం ప్రభావం
Rythu Bharosa Amount: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
Pawan Kalyan: జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uniform Civil Code: నేటి నుంచిఉత్తరాఖండ్‌లో అమల్లోకి యూనిఫాం సివిల్ కోడ్  - ఈ చట్టంతో వివాహాలపై సైతం ప్రభావం
నేటి నుంచిఉత్తరాఖండ్ అమల్లోకి యూనిఫాం సివిల్ కోడ్ - ఈ చట్టంతో వివాహాలపై సైతం ప్రభావం
Rythu Bharosa Amount: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
Pawan Kalyan: జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
Balakrishna Padma Bhushan Award: పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
Janhvi Kapoor : పెళ్లి తర్వాత తిరుమలలో సెటిల్ అవ్వాలనుకుంటున్న జాన్వీ కపూర్.. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి..
పెళ్లి తర్వాత తిరుమలలో సెటిల్ అవ్వాలనుకుంటున్న జాన్వీ కపూర్.. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి..
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Viral News: ఇంద్రవెల్లిలో తిరుగుతున్న వింత జంతువును పట్టుకున్న స్థానికులు, వీడిన సస్పెన్స్
ఇంద్రవెల్లిలో తిరుగుతున్న వింత జంతువును పట్టుకున్న స్థానికులు, వీడిన సస్పెన్స్
Embed widget