Pallavi Prashanth: రతికను అక్క అని పిలవడంపై ప్రశాంత్ క్లారిటీ, శివాజీ చేసిన సాయం గురించి చెప్తూ ఎమోషనల్
Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ అయిన ప్రశాంత్ ఆ తర్వాత బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో రతికను అక్క అని పిలవడంపై క్లారిటీ ఇచ్చాడు.
Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7లోకి కామన్ మ్యాన్‌గా వచ్చి ‘రైతుబిడ్డ’ అనే ట్యాగ్‌తో టైటిల్ విన్నర్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్. దీంతో తనకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అంతే కాకుండా హౌజ్‌లో తన ఆట గురించి తన మాటల్లో ఏం చెప్తాడా అని ఎదురుచూస్తున్నారు. అన్నింటికంటే ముందుగా బిగ్ బాస్ బజ్‌లో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ప్రశాంత్. దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. అందులో ముందుగా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యినందుకు తన తల్లిదండ్రులతో కలిసి కేక్ కట్ చేశాడు. ‘జై జవాన్, జై కిసాన్’ అని చెప్పి తన ఇంటర్వ్యూను మొదలుపెట్టాడు.
నామినేట్ చేసిన రతిక..
‘‘నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు. ఆ ట్రోఫీ నీ చేతిలో ఉంది. అసలు నాగార్జున నీ చేయి ఎత్తినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి?’’ అని మొదటి ప్రశ్నకు తన విజయంపై స్పందించమని అడిగింది గీతూ. ‘‘నాకు అర్థం కాలేదు అసలు. నేనేనా, నేనేనా అనుకున్నా, మాటలు రాలేదు అసలు. ఈ ట్రోఫీ నాది కాదు.. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతీ ఒక్కరి విజయం ఇది’’ అని తన సంతోషాన్ని మాటల్లో చెప్తూ మురిసిపోయాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లో తన ఆట గురించి ప్రశ్నలు మొదలుపెట్టింది. ‘‘నీతో క్లోజ్‌గా ఉండే రతిక కూడా నిన్ను నామినేట్ చేసింది’’ అని అనగానే.. ‘‘బయట విషయం తీసుకొచ్చి నామినేషన్ పాయింట్‌లాగా చేసింది’’ అని చెప్తూ డల్ అయిపోయాడు ప్రశాంత్.
ఒక్కసారి అక్క అంటే ఎప్పటికీ అక్కే..
‘‘రతిక అని పిలిచే దగ్గర నుండి అక్క అని పిలవడం ఎందుకు మొదలుపెట్టావు? మరి తను అక్క అని పిలవద్దు అన్నది కదా వచ్చిన తర్వాత’’ అంటూ రతిక గురించి బ్యాక్ టు బ్యాక్ ప్రశ్నలు అడిగింది గీతూ. ‘‘ముందు ఆమెనే పిలవమని చెప్పింది. సరే అని పిలిచాను. తర్వాత పిలవద్దు అంటే ఎలా ఉంటుంది. నేను ఒక్కసారి మనస్ఫూర్తిగా అక్క అంటే అక్కనే ఇంకా’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు ప్రశాంత్. రతిక గురించి అయిపోగానే ‘స్పై’ బ్యాచ్ గురించి ప్రశ్నలు మొదలయ్యాయి.
ఎమోషనల్ అయిన ప్రశాంత్..
‘‘ఒకవేళ ఆ ప్లేస్‌లో శివాజీ, యావర్ ఉండుంటే ఎవరికి ఇచ్చేవాడివి ఎవిక్షన్ ఫ్రీ పాస్? నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు?’’ అని ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి అడిగింది గీతూ. ఆ ప్రశ్న విని.. ‘‘ఇరికించారు. ఇలా ఇరికించారేంటి’’ అంటూ నవ్వాడు పల్లవి ప్రశాంత్. ‘‘ఒకవేళ శివాజీ సపోర్ట్ లేకపోయింటే నువ్వు గెలిచేవాడివి కాదా?’’ అని సూటిగా అడిగేసింది. ‘‘అన్న మాటలు నాకు ధైర్యం ఇచ్చాయి’’ అని చెప్పాడు ప్రశాంత్. ‘‘అయితే ఆయన భుజం తట్టాడు. నువ్వు కప్ కొట్టావు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘‘లెటర్ దగ్గరకు వచ్చేవరకు వదిన లెటర్ పక్కన పెట్టి.. కామన్ మ్యాన్‌గా వచ్చావు. నువ్వు గెలవాలి. నా జీవితంలో మొట్టమొదటిసారి నాకోసం ఒకరు త్యాగం చేశారంటే శివన్న’’ అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ‘‘కామన్ మ్యాన్ పవర్ చూపించావు అన్న ప్రతీసారి నాకు ధైర్యంగా ఉండేది’’ అంటూ తన విజయంలో శివాజీ పాత్ర ఎంత ఉందో చెప్పాడు రైతుబిడ్డ.
Also Read: రైతుబిడ్డకు ఇచ్చే విలువ ఇంతేనా? పోలీసులపై బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ సీరియస్