Bigg Boss Season 7: గౌతమ్, రతిక మధ్య రాజుకున్న నిప్పు- హీటెక్కించేస్తున్న నామినేషన్స్
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. రెండో వారంలో ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు.
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఒక్కొక్కరూ తమకి ఇతరులతో ఉన్న విభేధాల గురించి వాడీ వేడిగా గొడవ పడ్డారు. మంగళవారం జరిగిన నామినేషన్స్ లో రతిక, గౌతమ్ కృష్ణ మధ్య జరిగిన గొడవ హైలెట్ గా నిలిచింది. తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం గౌతమ్ రతిక మీద చాలా సీరియస్ అయిపోతూ తనని నామినేట్ చేశాడు.
ప్రోమోలో ఏముందంటే..
గౌతమ్ కృష్ణ రతికతో గొడవ పడుతూ కనిపించాడు. “లవ్ యాంగిల్ కనిపిస్తుందని నాకు చెప్పావా లేదా” అని గౌతమ్ తనని నిలదీశాడు. లవ్ యాంగిల్ అని చెప్పినాన అంటూ రివర్స్ మాట్లాడుతుంది. ఆ విషయం చెప్పినప్పుడు అక్కడ ఇంకొక ఇద్దరు కూడ కూర్చుని ఉన్నారని గౌతమ్ అంటే రతిక సీరియస్ అయిపోయింది. పాయింట్ మాట్లాడు అంటూ గట్టిగా అరిచింది. అరవడం నీకే కాదు నాకు వచ్చు అంటూ గౌతమ్ రతికని నామినేట్ చేశాడు. వాళ్ళిద్దరూ అలా అరుచుకోవడం చూసి ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. ఇక శివాజీ, శోభా శెట్టి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తనని నామినేట్ చేసినందుకు గాను శోభాని నామినేట్ చేస్తున్నానని శివాజీ కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పేశాడు. వాలిడ్ రీజన్ చెప్పడం లేదని శోభా వాదనకు దిగింది. తను కూడా ఆర్టిస్ట్ అంటూ అరిచింది. “మీరు కావాలని నా దగ్గరకి వచ్చి గెలుగుతున్నారు.. మీరు ఇంత దగ్గరగా వచ్చి అరిస్తే నేను అరుస్తాను. మీరు వెళ్ళండి వెళ్ళండి అంటే వెళ్ళడం కాదు బిగ్ బాస్ వెళ్ళమంటే వెళ్తాను” అంటూ శోభా శెట్టి గట్టిగానే శివాజీకి బదులిచ్చింది.
Also Read: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో నామినేషన్స్‌లో ఉన్నది వీరే - డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్
వాగ్వాదాలతో నిండిపోయిన నామినేషన్స్..
శోభా, రతిక, తేజ, షకీలా, ప్రిన్స్ యావర్, శివాజీ.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిలో ప్రిన్స్ యావర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం యావర్ కొద్దిలో తప్పించుకున్నాడు. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఇప్పటివరకు విడుదలయిన ప్రోమోలను బట్టి చూస్తే.. ఈసారి నామినేషన్స్‌లో డామినేషన్ అంతా అమర్‌దీప్‌దే అనిపిస్తోంది. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేస్తున్న సమయంలో అమర్‌దీప్ చెప్పిన పాయింట్స్‌కు కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ఆడియన్స్ కూడా సపోర్ట్ చేశారు. రైతు బిడ్డ అని ఊరికే చెప్పడం కరెక్ట్ కాదని అమర్‌దీప్ మాత్రమే కాదు.. గౌతమ్ కృష్ణ కూడా ప్రశాంత్‌తో వాదించారు. వారు చెప్పిన ఒక పాయింట్‌కు కూడా పల్లవి ప్రశాంత్ ఒప్పుకోలేదు. అంతమంది కలిసి నామినేట్ చేసినా కూడా పల్లవి ప్రశాంత్.. నామినేషన్‌లో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
View this post on Instagram