Bigg Boss 9 Telugu Live Updates: 9 మంది సెలబ్రిటీస్... ఆరుగురు కామనర్స్ - బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ కంటెస్టెంట్స్
Bigg Boss 9: కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈసారి సరికొత్తగా డబుల్ డోస్ డబుల్ జోష్‌తో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది.
LIVE

Background
Nagarjuna's Bigg Boss Telugu Season 9 Live Updates: కింగ్ నాగార్జున హోస్ట్‌గా ది ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9కు సర్వం సిద్ధమైంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా డబుల్ హౌస్ డబుల్ డోస్ అంటూ హైప్ క్రియేట్ అవుతుండగా... అందుకు తగ్గట్లుగానే ఫుల్ జోష్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది. గత 8 సీజన్లలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు మాత్రమే హౌస్‌లోకి ఎంటర్ కాగా... ఈసారి డిఫరెంట్‌గా సామాన్యులు సైతం ఎంటర్ అవుతున్నారు.
కంటెస్టెంట్స్ వీళ్లేనా
ఈ సారి హౌస్‌లోకి వెళ్లేది ఎవరు అనే దానిపై అందరిలోనూ సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కొందరు పేర్లు హల్చల్ చేయగా రాత్రి 7 గంటలకు హౌస్‌లోకి వెళ్లేది ఎవరో తేలిపోనుంది. 9వ సీజన్‌లో 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. వీరిలో 9 మంది సెలబ్రిటీలు కాగా... మిగిలిన ఐదుగురు సామాన్యులు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరి కొంతమంది హౌస్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఫస్ట్ డే మాత్రం 14 మంది మాత్రం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. సెలబ్రిటీల విషయానికొస్తే... టీవీ నటి రీతూ చౌదరి, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, టీవీ నటుడు భరణి శంకర్, 'రాను ముంబయికి రాను' ఫేం, ఫోక్ డ్యాన్సర్ రాము రాథోడ్, బుజ్జిగాడు మూవీ ఫేం సంజనా గల్రానీ, ఆషా షైనీ, యాక్టర్ సుమన్ శెట్టి, కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
సామాన్యుల విషయానికొస్తే... దాదాపు 45 మంది సామాన్యుల నుంచి టాప్ 15 కామనర్స్‌ను ఎంపిక చేసి వారికి అగ్నిపరీక్ష నిర్వహించారు. వీరిలో బెస్ట్ ఫెర్మారెన్స్‌తో పాటు ఆడియన్స్ ఓటింగ్ బేసిస్ చేసుకుని ఐదుగురు సామాన్యులను హౌస్‌లోకి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, పవన్ కల్యాణ్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది.
బిగ్ సర్ ప్రైజ్ - 15వ కంటెస్టెంట్‌గా కామనర్ మర్యాద మనీష్
బిగ్ బాస్ హౌస్‌లోకి బిగ్ సర్ ప్రైజ్ ఇస్తూ 15వ కంటెస్టెంట్‌గా కామనర్ మర్యాద మనీష్‌ను యాంకర్ శ్రీముఖి ఎంపిక చేశారు. తొలుత 14 మందినే అనుకున్నా... హోస్ట్ నాగార్జునను రిక్వెస్ట్ చేయగా 15వ కంటెస్టెంట్‌కు అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దీంతో యాంకర్ శ్రీముఖి, జ్యూరీ అభిజిత్ మనీష్‌ను సెలక్ట్ చేశారు. దీంతో మొత్తం 15 మందితో బిగ్ బాస్ హౌస్ సీజన్ 9 సాగనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో ఐదుగురు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.
14వ కంటెస్టెంట్‌గా కామనర్ ప్రియా శెట్టి
బిగ్ బాస్ హోస్‌లోకి చివరి కంటెస్టెంట్ లాస్ట్ కామనర్‌గా ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చారు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఆమె ఛాన్స్ దక్కించుకున్నారు. తనను హౌస్‌లోకి పంపించిన ఆడియన్స్, జ్యూరీకి థాంక్స్ చెప్పారు. తనను హౌస్‌లో కూడా ఇలానే ఎంకరేజ్ చేయాలని కోరారు. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫైనల్‌గా 5 మంది కామనర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.





















