అన్వేషించండి

Bigg Boss Telugu 7: ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెడుతున్న చివరి కెప్టెన్సీ టాస్క్ - ప్రియాంక మౌనం!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో చివరి కెప్టెన్సీ టాస్క్ కోసం హౌజ్‌మేట్స్ అంతా సిద్ధమయ్యారు.

Telugu Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్‌కు సమయం దగ్గరపడుతోంది. దీంతో కెప్టెన్సీ టాస్కులకు కూడా ఎండ్ పడనుంది. నేడు జరిగే ఎపిసోడ్‌లో జరిగే కెప్టెన్సీ టాస్కే చివరి కెప్టెన్సీ టాస్క్ అని గతవారం నాగార్జున ప్రకటించారు. ఈ చివరి కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించి విడుదలయిన ప్రోమోలో కూడా బిగ్ బాస్.. అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక చివరి కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఏకంగా ఫ్రెండ్స్ మధ్యే చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు బిగ్ బాస్. శోభా - ప్రియాంక, యావర్ - పల్లవి ప్రశాంత్.. ఇలా అందరి మధ్య కెప్టెన్సీ కోసం సీరియస్ చర్చలే జరిగాయి. దీంతో ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది.

బిగ్ బాస్‌లో జరిగే చివరి కెప్టెన్సీ అని చెప్తూ కెప్టెన్సీ టాస్క్ గురించి వివరించారు బిగ్ బాస్. ‘‘గన్ షూటింగ్ సౌండ్ వినిపించగానే.. గార్డెన్ ఏరియాలో ఉన్న మెషీన్ గన్ దగ్గర ఏ ఇద్దరైతే ముందుగా నిలబడతారో.. వారు కిల్లింగ్ జోన్‌లో ఫోటోలు ఉన్న ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీ రేసులో ఉండారో, ఎవరు కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాలో షూట్ చేసి నిర్ణయించాల్సి ఉంటుంది’’ అని టాస్క్ గురించి స్పష్టం చేశారు బిగ్ బాస్. ముందుగా ప్రియాంక, గౌతమ్.. గన్ దగ్గర నిలబడ్డారు. శోభా, అర్జున్‌లలో ఒకరిని కెప్టెన్సీ రేసులో ఉంచి, మరొకరిని తప్పించే అవకాశం వారి చేతికి వచ్చింది.

అర్జున్ గేమ్ ఫెయిర్..
‘‘ఇద్దరు చాలా కోపంగా చూస్తున్నారు మన ఇద్దరిని’’ అంటూ గౌతమ్ కామెడీ చేశాడు. ‘‘ఒక పాయింట్ మీద రావాలి మనం’’ అని ప్రియాంక చెప్పగా.. ‘‘వచ్చేసేయ్. నీకు కూడా కారణం ఉంది శోభాకు’’ అని తనను ఒప్పించే ప్రయత్నం చేశాడు గౌతమ్. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ‘‘ఇద్దరితో పోల్చుకుంటే నాకు అర్జున్ గేమ్ ఫెయిర్‌గా అనిపించింది’’ అని రేసు నుంచి శోభాను తప్పించడానికి కారణం చెప్పాడు గౌతమ్. ఫెయిర్ గేమ్ అంటే ఏంటని శోభా ప్రశ్నించింది. ‘‘నువ్వు అమర్‌దీప్‌ను గెలిపించుకోవాలి అన్నప్పుడు పక్కన వాళ్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేశావు’’ అని గౌతమ్ చెప్పగా.. శోభా దానికి ఒప్పుకోలేదు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రియాంక మాత్రం ఏమీ మాట్లాడకుండా నిలబడినట్టు ప్రోమోలో కనిపించింది.

ఓపెన్‌గా చెప్తున్నా..
ఆ తర్వాత శోభా, పల్లవి ప్రశాంత్ కలిసి అమర్‌దీప్, అశ్వినిలలో ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించడానికి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ‘‘నన్ను కెప్టెన్ చేసినప్పుడు నేను నా ఫ్రెండ్‌కే సపోర్ట్ చేస్తాను’’ అని శోభా.. అమర్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు స్ట్రాంగ్‌గా చెప్పేసింది. ‘‘నాలో ఏం లేదు? వాడిలో ఏం ఉంది’’ అని అశ్విని ప్రశ్నించింది. ‘‘ఓపెన్‌గా చెప్తున్నా ఆ ప్లేస్‌లో ఎవరు ఉన్నా కూడా నేను అమర్‌కే సపోర్ట్ చేస్తా’’ అని గట్టిగా చెప్పింది శోభా. ప్రశాంత్ కూడా అమర్‌కే సపోర్ట్ అన్నట్టుగా మాట్లాడాడు. ‘‘ఇంకెవరు అయినా తీసేస్తా అంటే నేను పట్టించుకోకపోయేదాన్ని కానీ నువ్వు చేస్తున్నావు చూడు’’ అని ప్రశాంత్‌తో చెప్తూ ఫీల్ అయ్యింది అశ్విని.

ఎవరి మైండ్ వారి ఇష్టం..
ఆ తర్వాత వచ్చిన యావర్, రతిక.. పల్లవి ప్రశాంత్, శివాజీలలో ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాల్సి ఉంటుంది. ‘‘నేను శివాజీ అన్నను ఫైర్ చేయాలని అనుకుంటున్నావా చెప్పు’’ అంటూ సూటిగా ప్రశాంత్‌ను ప్రశ్నించాడు యావర్. ‘‘నీది కొట్టొద్దు అంటే అర్థం అదే కదా’’ అని ప్రియాంక మధ్యలో జోక్యం చేసుకుంది. ‘‘నువ్వు ఆగు అక్క’’ అంటూ వారిని సైలెంట్‌గా కూర్చోమన్నాడు ప్రశాంత్. రతిక కూడా ప్రశాంత్‌ను తీసేయడానికి కారణాలు చెప్తూ ‘‘ఆల్రెడీ మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయ్యావు’’ అని చెప్తుండగా.. ‘‘నా మైండ్ నా ఇష్టం. నీ మైండ్ నీ ఇష్టం’’ అని కౌంటర్ ఇచ్చాడు ప్రశాంత్. అలా శోభా, అశ్విని, ప్రశాంత్.. చివరి కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నట్టు ప్రోమోలో చూపించారు.

Also Read: రణబీర్, ప్రభాస్‌లతో సందీప్ వంగా సినిమాటిక్ యూనివర్స్!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget