News
News
X

Bigg Boss Telugu 6: కిందా మీదా పడి, లాక్కుని పీక్కుని ఇనయా - ఫైమా ఫైట్ చూడండి, ఇంత అవసరమా

Bigg Boss Telugu 6: బిగ్‌బాస్ హౌస్లో ఇనయా- ఫైమా ఫైటింగ్ నవ్వు తెప్పించేలా ఉంది.

FOLLOW US: 

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం ఇనయా ఒంటరి పోరాటం చేస్తోంది. అయినా ఆడపులిలా ఏమాత్రం తగ్గడం లేదు. నామినేషన్లలో ఎనిమిది మంది నామినేట్ చేసి తప్పులు ఎంచినా కూడా ఏమాత్రం తగ్గకుండా పోరాడుతోంది. ఈరోజు టాస్క్‌లో కూడా ఆమె ఆడిన తీరు మామూలుగా లేదు. ఫైమాను ఈడ్చి పడేసింది. ఫైమా ఇనయాను ఫ్రెండు ఫ్రెండు అంటూనే శ్రీహాన్, శ్రీసత్య దగ్గరికి పోయి లేనిపోనివి మాట్లాడేది. ఆమె మాట్లాడింది మర్చిపోయి ఇనయాపై నిందలు వేసేది. ఇనయా నువ్వు నా ఫ్రెండ్ కాదు అని ఫైమాతో చెప్పేసింది. చెప్పడమే కాదు ఈ రోజు ఆటలో ఈడ్చి పడేసింది. అయితే బిగ్ బాస్ అనుకోకుండా ఫైమాకు ఒక పవర్ ఇవ్వడంతో ఇనయా గేమ్ నుంచి తొలగాల్సి వచ్చింది. 

ప్రోమోలో ఏముందంటే...ఇంట్లో కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మట్టిని దక్కించుకుని కొంతమంది నిచ్చెనలు, కొంతమంది పాములు నిర్మించారు. వాటిని కాపాడుకునే బాధ్యత కూడా వారిదే.పక్క వారు ఎవరైనా ఆ నిచ్చెన లేదా పాము నుంచి మట్టిని లాక్కోవచ్చు. చివరలో ఎవరి మట్టి అయితే తక్కువ ఉంటుందో వారు ఎలిమినేట్ అవుతారు. ఇనయా పక్క వాళ్ల నుంచి మట్టి తీసుకునేందుకు చాలా ప్రయత్నించింది. వాసంతి, శ్రీసత్యల బొమ్మల నుంచి ఓ పిడికెడు మట్టి సంపాదించగలిగింది. ఫైమా ఇనయా నిర్మించిన నిచ్చెన నుంచి మట్టి తీసేందుకు ప్రయత్నించడంలో బాగా అడ్డుకుంది. ఫైమాను ఈడ్చి అవతల పడేసింది. తన నిచ్చెన నుంచి మట్టి తీసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఆ ప్రయత్నంలో వారిద్దరూ బాగా పెనుగులాడారు. కింద మీదా పడి దొర్లారు. శ్రీహాన్‌ను కూడా ఇనయా తోసి పడేసింది. 

ఇదే ట్విస్టు
అయితే బిగ్ బాస్ చివర్లో ట్విస్టు ఇచ్చాడు. ఏ నిచ్చెనలో మట్టి తక్కువగా ఉందో ఆ నిచ్చెన చేసిన ఇంటి సభ్యుడిని ఆట నుంచి తొలగించాల్సిందిగా ఫైమాను అడిగారు. ఫైమా ఇనయాను ఆట నుంచి తొలగించింది. దీంతో ఇనాయ ఫీలైపోయింది. ‘వరస్ట్ గేమర్ ఇన్ ద హౌస్ ఫైమా’ అంటూ వెళ్లిపోయింది. 

News Reels

ఇక ఈ వారం నామినేషన్ల విషయానికి వస్తే తొమ్మిది మంది నామినేషన్లలో నిలిచారు. వారిలో ఈ వారం ఎవరు వెళ్లినా గట్టి కంటెస్టెంట్ బయటకు వెళ్లినట్టే. వారంతా కూడా గట్టిగా అరుస్తూ, గొడవలు పడుతూ నోటితో ఆడే వాళ్లే. ఎవరైతే ఇంట్లో కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటారో వారెవరూ నామినేట్ అవ్వలేదు. వాసంతి, మెరీనా కూడా కామ్ అండ్ కంపోజ్డ్ గానే ఉంటారు. కానీ ఈసారి నామినేట్ అయ్యారు. వీళ్లిద్దరూ కాకుండా  బాలాదిత్య, ఫైమా, కీర్తి, ఇనాయ, శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్ ఉన్నారు నామినేషన్లలో. ఈసారి ఫైమాకు గండం తప్పేలా లేదు. ఎందుకంటే ఈసారి ప్రేక్షకుల ఓటింగ్ సరళి మారింది. ఎవరైతే ఇంట్లో నోరు పారేసుకోకుండా, ఎదుటివారిని తేలికగా చేసి మాట్లాడకుండా ఉంటారో వాళ్లకే ఓట్లేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే కీర్తి, వాసంతి, మెరీనా ఆటలో అంత స్ట్రాంగ్ కాకపోయినా, వారు ఉండే పద్ధతికి ఓట్లు పడే అవకాశం ఉంది. బాలాదిత్యకు కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక రేవంత్, ఇనాయ ఓటు బ్యాంకు గట్టిది. కాబట్టి వాళ్లు కూడా ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లరు. శ్రీహాన్, ఆదిరెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది వారిని తీసేంత ధైర్యం చేయరు బిగ్ బాస్. ఇక మిగిలింది ఫైమా. కాబట్టే ఈసారి ఫైమాకే తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

  Also read: నామినేషన్లలో మళ్లీ ఇనయానే టార్గెట్ చేసిన హౌస్, నామినేట్ అయింది వీళ్లే

Published at : 08 Nov 2022 04:41 PM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana

సంబంధిత కథనాలు

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Bigg Boss 6 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ కోసం కిందా మీద పడి కొట్టుకున్న అమ్మాయిలు

Bigg Boss 6 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ కోసం కిందా మీద పడి కొట్టుకున్న అమ్మాయిలు

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

టాప్ స్టోరీస్

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై