Bigg Boss 6 Telugu: నీకు బిగ్‌బాస్ సెట్ కాదు, వెళ్లిపోతే బెటర్ - బాలాదిత్యపై గీతూ షాకింగ్ కామెంట్స్
Bigg Boss 6 Telugu: నామినేషన్ డే వచ్చేసింది, కంటెస్టెంట్ల మనసులో ఉన్న కోపాలు బయటికి వచ్చే రోజు ఇదే.
Bigg Boss 6 Telugu: అన్ని వారాల్లో కల్లా బిగ్‌బాస్ అభిమానులకు నచ్చేది సోమవారమే. ఆ రోజే కదా నామినేషన్లు. అసలైన ఆట జరిగేది ఇదే రోజు. కంటెస్టెంట్ల మనసులోని కోపాలు బయటపడే రోజు ఇదే. ఈనాటి తొలిప్రోమోలో అందరూ రేవంత్‌నే టార్గెట్ చేసినట్టు కనిపించారు. బిగ్ బాస్ ‘ఒకరిని ఇంటి నుంచి బయటికి పంపడానికి సమయం ఆసన్నమైంది’ అని చెప్పి నామినేట్ అయిన వారిపై బురద పోసే ఏర్పాటు చేశారు. గత సీజన్లలో కూడా ఇలా బురద నామినేషన్లు ఉన్నాయి. ఎవరు నామినేట్ అవుతారో వారికి బురద స్నానం తప్పదు.
ఇక ప్రోమోలో ఏముందంటే..శ్రీహాన్ ‘రా ఇనయా మాట్లాడుకుని చాలా రోజులు అయ్యింది’ అన్నాడు. ఇనయా వచ్చి నిల్చోగానే ‘నీ బిహేవియర్ నాకు నచ్చలేదు’ అన్నాడు. ఇనయా ‘ఏం బిహేవియర్’ అని అడిగింది. దానికి శ్రీహాన్ నటించి చూపించాడు... ‘హహహ లయర్స్ అన్నావ్ కదా’ అన్నాడు. దానికి ఇనయా ‘కావాలనే ఇలా డ్రామా చేస్తున్నావ్’ అంది. దానికి శ్రీహాన్ నిర్లక్ష్యంగా ‘కూర్చోపో’ అని విసుక్కున్నాడు. ఇంకేముంది నెక్ట్స్ సీన్లో ఇనయా బురదలో తడుస్తూ ఉంది.
రేవంతే టార్గెట్...
రేవంత్ ఈ నామినేషన్లలో టార్గెట్ అయినట్టు కనిపించాడు. గత వారం కెప్టెన్ అయిన రేవంత్ రెండు మూడు సార్లు నిద్రపోయాడు. దీంతో కుక్కలు అరిచాయి. అదే విషయాన్ని కొంత మంది ఇంటి సభ్యులు ఈ రోజు నామినేషన్లలో మాట్లాడి రేవంత్‌ను నామినేట్ చేశారు. రోహిత్, మెరీనా, బాలాదిత్య, శ్రీ సత్య రేవంత్‌ను నామినేట్ చేసినట్టు కనిపించింది. అందరూ చెప్పిన కారణం మాత్రం ‘నిద్రే’.
ఆదిరెడ్డి వెటకారం...
ఆదిరెడ్డి వాసంతిని నామినేట్ చేస్తూ ‘నామినేషన్లకు భయపడతారు’ అన్నాడు. దానికి వాసంతి ‘ఎప్పుడూ ఇదొక్కటే కారణం’ అని విసుక్కుంది. దానికి ఆదిరెడ్డి ‘మీరు సోఫా వెనుక రెండు సార్లు నిలబడ్డారు, నేను ఒక్కసారి కూడా నిలబడలేదు’ అన్నాడు. దానికి వాసంతి ‘అయినా కూడా మీరు జీరో అయ్యారుగా’ అని గాలి తీసేసింది. అలాగే ఆదిరెడ్డి - అర్జున్ కూడా వాదించుకున్నారు. అర్జున్‌తో ‘నేను ఇలా డ్యాన్సు చేశా మీరు వెయ్యలేదు’ అని నడుము తిప్పుతూ చూపించాడు. దానికి అందరూ నవ్వారు.
నీకు బిగ్‌బాస్ సెట్ కాదు...
గీతూ తీవ్రమైన ఆరోపణలే చేసింది బాలాదిత్యపై. ‘నువ్వు ఎంత మంచిగా వచ్చావో అట్టే వెళ్లిపోతే బావుంటుంది... నీకు బిగ్‌బాస్ సెట్ కాదు’ అంది. దానికి బాలాదిత్య చాలా ఫీలయ్యాడు. ‘నేను నీకు సమాధానం చెప్పదలచుకోలేదు’ అని చెప్పి వెళ్లి బురద కుర్చీలో కూర్చున్నాడు. తరువాత వచ్చాక భారమైన మనసుతో మాట్లాడాడు. ‘ఒక విషయంపై నాకు మంచి క్లారిటీ వచ్చింది ఇవాళ. ఏ హౌస్ మంచి కోసం అయితే నేను ఆలోచిస్తున్నానో, అదే హౌస్ నా గురించి ఇలా ఆలోచిస్తున్నారని నాగార్జున గారు వీడియో చూపించినప్పుడు కాదు ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది’ అన్నాడు.
ఈ వారం నామినేషన్లలో కెప్టెన్ సూర్య, గీతూ తప్ప అందరూ మిగతా అందరూ ఉన్నట్టు సమాచారం.
Also read: ప్రతి ఇంట్లో గీతూలాంటి పిల్ల ఉండాలనిపించేలా చేస్తుందట - వామ్మో వద్దే వద్దు అంటున్న ప్రేక్షకులు