అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ప్రతి ఇంట్లో గీతూలాంటి పిల్ల ఉండాలనిపించేలా చేస్తుందట - వామ్మో వద్దే వద్దు అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 6 Telugu: గీతూని చూస్తే భయమేస్తుంది తప్ప, అలాంటి పిల్ల ఇంట్లో ఉండాలని ఎవరు కోరకుంటారు?

Bigg Boss 6 Telugu: ఈ రోజు విడుదల చేసిన మొదటి ప్రోమోతో పోలిస్తే రెండో ప్రోమో చాలా బెటర్ అనిపించింది. ఇందులో గీతూ పై సెటైర్లు పేల్చాడు రేవంత్. ప్రోమో మొదలవ్వగానే పాటకు డ్యాన్స్ వేస్తూ కనిపించారు ఇంటి సభ్యులు. మధ్యలో నాగార్జున ‘ఏంటి రేవంత్ ఏదో ఎంటర్టైన్ చేస్తున్నావ్ అందరిని’ అని అడిగారు. దానికి  రేవంత్ గీతూ పుష్ఫ స్టైల్లో ఎలా నడుస్తుందో నడిచి చూపించాడు. అది చూసి అందరూ నవ్వారు. దానికి గీతూ ‘నేను చాలా స్టైల్ గా నడుస్తా. వీళ్లు ఏదోలా నడుస్తున్నారు’ అంది. దానికి నాగార్జున ‘గీతూ నడిస్తే చాలా స్టైల్ గా ఉంటుంది’ అని అన్నారు. దానికి రేవంత్ ‘ఇలాగా సర్’ అని మళ్లీ నడిచి చూపించారు. దానికి అందరూ నవ్వారు. 

వామ్మో వద్దే వద్దు
ప్రతి ఇంట్లో గీతూలాంటి పిల్ల ఉంటే బావుండనిపించేలా చేస్తా సర్ అంది గీతూ నాగార్జునతో. దాంతో అక్కడున్న ఆడియెన్స్ వామ్మో వద్దే వద్దు అన్నారు. దానికి నాగార్జున ‘వద్దో అని అరుస్తున్నారు ఆడియెన్స్’ అని చెప్పారు. దానికి రేవంత్ కూడా ‘హౌస్ లో కూడా అదే అభిప్రాయం సర్’అన్నాడు. నిజంగానే ఇలాంటి పిల్ల ఉండాలని ఎవరు కోరుకుంటారు? పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వనని చెబుతుంది, తనకు పడకపోతే ఎదుటివారి గురించి చెడు ప్రచారాలు చేస్తుంది, అవసరానికి మించి ఓవర్ యాక్షన్ చేస్తుంది, తనకు మాత్రమే కావాలనే స్వార్ధంతో ఉంటుంది... ఇలాంటి వాళ్లు ఇంట్లో ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. 

డైలాగులు - ట్యాగ్లు
కొన్ని రకాల డైలాగులు ఇచ్చి వాటికి తగ్గ వారిని ఎంచుకుని మెడలో వేయమని చెప్పారు. బాలాదిత్య ‘అవసరానికి దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో’ అనే డైలాగ్ ఎంచుకుని గీతూ మెడలో వేశారు. దానికి నాగార్జున ‘నీ ఉద్దేశంలో గీతక్క అవసరాల కోసం దారులు తొక్కుతుంది’ అన్నారు. దానికి బాలాదిత్య అవునని చెప్పాడు. తరువాత ఇనయా ‘సొల్లాపు దమ్ముంటే నన్నాపు’ అనే డైలాగ్ తీసి సూర్య మెడలో వేసింది. దానికి నాగార్జున ‘ఈ మధ్య ఇనయా పొద్దు తిరుగుడు పువ్వు అయిపోయింది’ అన్నారు. దానికి అందరూ నవ్వారు. పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడి వైపే తిరుగుతుందనే ఉద్దేశంతో అన్నారు నాగ్. 

పకోడా అంటున్నాడు...
వాసంతి ‘చేయి చూశావా ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడిస్తా’ అనే డైలాగ్ తీసి రేవంత్ మెడలో వేసింది. ఎందుకు వేశావ్ అని అడిగితే ‘నన్ను పకోడా’ అని పిలుస్తున్నాడు సర్ అంది. దానికి రేవంత్ ‘పకోడా కాదు పకోడి’ అని సరిచేశాడు. దానికి అందరూ నవ్వారు. 

కాగా ఈసారి ఎలిమినేషన్లో తొమ్మిది మంది ఉన్నారు. 
1. ఆదిత్య
2. గీతూ
3. రాజ్ 
4. కీర్తి
5. సుదీప
6. ఆదిరెడ్డి
7. ఇనయా
8. శ్రీహాన్
9. అర్జున్

కవీరిలో ఈ వారం సుదీప బయటికి వెళ్లినట్టు సమాచారం. ఆమె ఇంట్లో వంటలక్కగా మారింది కానీ ఆట ఆడింది లేదు. దీంతో ఒకవేళ ఆమె వెళ్లిపోయిన బిగ్ బాస్ ఆటపై పెద్ద ఎఫెక్టు పడదని బిగ్ బాస్‌కు అర్ధమైపోయుంటుంది. అందుకే ఈమెనే ఈసారి ఎలిమినేట్ చేసినట్టు పక్కా సమాచారం.  

Also read: వయస్సొచ్చిన చిరుతలా ఉన్నావ్, గీతూకు చుక్కలు చూపించిన నాగార్జున, దెబ్బకు బద్దకం వదిలిపోయింది!

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Embed widget