Bigg Boss 6 Telugu: వయస్సొచ్చిన చిరుతలా ఉన్నావ్, గీతూకు చుక్కలు చూపించిన నాగార్జున, దెబ్బకు బద్దకం వదిలిపోయింది!
Bigg Boss 6 Telugu: ఆదివారం సందర్భంగా ఇంటి సభ్యులతో ఆటలు ఆడించారు నాగార్జున.
Bigg Boss 6 Telugu: ఆదివారం వచ్చిందంటే బిగ్ బాస్ ఇంట్లో ఆటలు, పాటల పోటీలే. ఈసారి కూడా నాగార్జున పాటల పోటీలతో ముందుకొచ్చారు. ఇంటి సభ్యుల చేత రకరకాల ఆటలు ఆడించారు. డ్యాన్సు చేయించారు. పాటలు పాడించారు. నాగార్జున వేదిక మీదకి రాగానే నాటు నాటు సాంగ్ కు స్టెప్పులేశారు. ఈ రోజు గీతూని గార్డెన్ నుంచి స్టోర్ రూమ్‌కి చాలా సార్లు తిప్పుతూ విసిగించారు నాగార్జున. ఇంటి సభ్యులు మాత్రం ప్రతివారం ఇలాగే చేయమని జోకులు పేల్చారు.
పాటల పోటీ..
ప్రతి ఆదివారం పాటల పోటీ బిగ్ బాస్ ఇంట్లో కామన్ అయిపోయింది. బొమ్మలు చూపించి, ఆ బొమ్మల ద్వారా పాటేంటో చెప్పమని అడిగారు. పాట కరెక్టుగా చెప్పాక అదే పాట వేసి ఇంటి సభ్యుల చేత చిందులు వేయించారు. అందరి కన్నా ఆదిరెడ్డి, గీతూ వేసిన డ్యాన్సు చాలా నవ్వు తెప్పించింది. ఇనయా సూర్యల మీద పంచ్ లు వేశారు నాగార్జున. సూర్య దగ్గరగాఉన్నాడు, ఇనయాకు కాదు, బజర్ కు అని పంచ్ లేశారు. కానీ పంచ్లో చాలా అర్థాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య జరుగుతున్న దానిపై ఇప్పటికే బయట చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇనయా ఆట మానేసి మరీ సూర్య చుట్టూ తిరగడం చూడటానికే విసుగ్గా. టాప్ 5 కంటెస్టెంట్ అనుకుంటే మధ్యలోనే వెళ్లిపోయే స్థితికి దిగజారిపోయింది.
కాగా ఈసారి ఎలిమినేషన్లో తొమ్మిది మంది ఉన్నారు.
1. ఆదిత్య
2. గీతూ
3. రాజ్
4. కీర్తి
5. సుదీప
6. ఆదిరెడ్డి
7. ఇనయా
8. శ్రీహాన్
9. అర్జున్
View this post on Instagram
కాగా వీరిలో ఈ వారం సుదీప బయటికి వెళ్లినట్టు సమాచారం. ఆమె ఇంట్లో వంటలక్కగా మారింది కానీ ఆట ఆడింది లేదు. దీంతో ఒకవేళ ఆమె వెళ్లిపోయిన బిగ్ బాస్ ఆటపై పెద్ద ఎఫెక్టు పడదని బిగ్ బాస్‌కు అర్ధమైపోయుంటుంది. అందుకే ఈమెనే ఈసారి ఎలిమినేట్ చేసినట్టు పక్కా సమాచారం.
Also read: ఇనయా - సూర్యల మధ్య ఏం జరుగుతోంది? ప్రశ్నించిన నాగార్జున, ఇనయాకు క్లాస్?