Bigg Boss 6 Telugu Episode 39: బాలాదిత్యతో చెత్త గేమ్ ఆడిన గీతూ, ఇంటి సభ్యులతో మాట్లాడిన శ్రీసత్య
Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎమోషనల్ టాస్కు ఇంకా కొనసాగింది.
Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు తమ కుటుంబాలతో కలిపే టాస్కును కొనసాగించాడు బిగ్‌బాస్. అయితే ఈ రోజు ఎపిసోడ్ మొదలవ్వగానే బ్యాటరీ అయిదు శాతమే ఉంది. గీతూని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్ బాస్. బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవాలంటే ఇంటి సభ్యులంతా చక్కెర తినకూడదని, లేదా బాలాదిత్య స్మోకింగ్ మానేస్తే ఇంటి బ్యాటరీ 90 శాతం పెరుగుతుందని చెప్పాడు. గీతూ బయటికి వచ్చి బిగ్‌బాస్ చెప్పినట్టు కాకుండా వేరేగా చెప్పింది. బ్యాటరీ రీ ఛార్జ్ కావాలంటే ఇంటి సభ్యులంతా ఫుడ్ త్యాగం చేయాలని, లేదా బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలని చెప్పింది. దీంతో బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేశాడు. బిగ్‌బాస్ చెప్పింది గీతూ మార్చి చెప్పడం, అయినా బిగ్‌బాస్ కల్పించుకోకపోవడం బాగోలేదు. బాలాదిత్య స్మోక్ మానేయడంతో బ్యాటరీ 90 శాతం పెరిగింది.
పిల్లిబొచ్చు కోసం...
గీతూని పిలిచి పిల్లి బొచ్చు, పిల్లి వీడియో, ఆడియోకాల్ ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ పిల్లి బొచ్చు కోసం చాలా ఆలోచించింది. ఎవరైనా వెంటనే తల్లిదండ్రులతో లేదా భర్తతో మాట్లాడేందుకు ఆలోచిస్తారు. కానీ పిల్లి బొచ్చు కోసం ఆమె బాగా బాధపడింది. చివరికి ఆడియో కాల్ ఎంచుకుంది. తరువాత అర్జున్ కళ్యాణ్‌ను పిలిచారు. ఈయన తనకోసం మాట్లాడుకుండా తనకొచ్చిన అవకాశాన్ని సత్యాకు ఇవ్వచ్చా అని అడిగాడు. బిగ్ బాస్ ఆ విషయంపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో చివరికి వీడియో కాల్ ఎంచుకున్నాడు. సత్యాతో తాను కోరిన త్యాగం గురించి చెప్పాడు.
గీతూ తండ్రితో ఫోన్ మాట్లాడింది. ఆయన గీతూకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. టాప్ 5లో కచ్చితంగా ఉంటావని చెప్పారు. కాకపోతే యాటిట్యూడ్ మార్చుకోవాలని చెప్పారు. అర్జున్ వాళ్ల తండ్రి నుంచి కూడా వీడియో మెసేజ్ వచ్చింది. ఇనయాను పిలిచాడు బిగ్ బాస్. అయితే అప్పటికి బ్యాటరీ రీఛార్జ్ 30 శాతమే ఉండడంతో ఇనయా ఏదైనా 25 శాతం ఉన్నదే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె ఫోటో ఫ్రేమ్ ఎంచుకుంది.
ఫైమా ఇంగ్లిష్
బ్యాటరీని 5 శాతానికి పడిపోవడంతో తిరిగి రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆమె ఇంగ్లిష్ లో కొన్ని తెలుగు సినిమా పేర్లను చెప్పాలి. ఆమె సక్సెస్ గా చెప్పడంతో 80 శాతం బ్యాటరీ వచ్చింది. తరువాత శ్రీసత్యకు అవకాశం వచ్చింది. ఆమె వీడియో కాల్ ఎంచుకుంది. తల్లితో వీడియో కాల్ మాట్లాడింది. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసి చాలా ఆనందపడింది శ్రీసత్య.
ఇక శ్రీహాన్ చాలా బాధపడుతూ కనిపించాడు. బ్యాటరీ రీఛార్జ్ అవకాశం ఉన్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు బిగ్ బాస్ అంటూ కనిపించాడు. తరువాత బాలాదిత్యను పిలిచారు. ఆయన ఆడియోకాల్ అవకాశాన్ని ఎంచుకున్నాడు. అతను తన కూతురితో ఫోన్ మాట్లాడాడు. అయితే ఈ ఆడియో కాల్ కోసం 50 శాతం బ్యాటరీని వాడాడు బాలాదిత్య.
Also read: అమ్మతో వీడియోకాల్ మాట్లాడిన శ్రీసత్య, కూతురితో మాట్లాడిన బాలాదిత్య, ఇనయాకు నాన్న ఫోటో