BiggBoss 6 Telugu: ఓటింగ్‌లో ఫైమానే లీస్ట్, ఈ వారం ఎలిమినేట్ అయిన లేడీ కమెడియన్?
BiggBoss 6 Telugu: ఫైమా ఈ వారం ఎలిమినేట్ అయినట్టు సమాచారం తెలుస్తోంది.
BiggBoss 6 Telugu: ఫైమా గత వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా బతికిపోయింది. దీంతో ఫైమాకు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఆమె ఇంట్లోనే ఉంది. రాజ్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ వారం నామినేషన్లలో కూడా ఫైమా ఉంది. దీంతో ఫైమాకు అందరికన్నా తక్కువ ఓట్లు పడినట్టు సమాచారం. దీంతో ఈ వారం ఫైమా ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. శనివారమే ఎపిసోడ్ రికార్డు అయిపోతుంది కాబట్టి ఈపాటికే ఫైమా ఇంటికి వెళ్లిపోయినట్టు సమాచారం.
వెటకారం దెబ్బ...
నిజానికి గత వారమే ఫైమా ఇంటికెళ్లిపోవాలి. ఆమె వెటకారమే ఆమె కొంపముంచిందని చెప్పాలి. సుదీపతో మొదలుపెట్టిన ఆమె వెటకారం ఇనాయ వరకు వచ్చింది. ఇనాయను చాలా వెటకారం చేసింది ఫైమా. ముఖ్యంగా ఆమె నామినేషన్లో చేసే ఓవరాక్షన్ ప్రేక్షకులను చిరాకు పుట్టించింది. వెటకారం ఎక్కువవుతోందని నాగార్జున కూడా చాలా సార్లు హెచ్చరించారు. మిగతా కంటెస్టెంట్లు కూడా ఆమెను వెటకారం చేస్తోందంటూ ఎన్నోసార్లు చెప్పారు. అయినా కూడా పెద్దగా ఫైమా మారింది లేదు. ఇనాయ విషయంలో అయితే ఆదిరెడ్డి, శ్రీసత్యతో కలిసి ఆమెను చాలా ఇరిటేట్ చేసింది. ఇనాయ ఎంతగా ఇరిటేట్ అయిందో తెలియదు కానీ ప్రేక్షకులు మాత్రం చాలా ఇరిటేట్ అయ్యారు.
నిజానికి మొన్నటి వరకు శ్రీసత్యకు అందరికన్నా తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ చివరి నిమిషంలో ఓటింగ్ మారింది. ఫైమాకు అయిదు శాతం ఓట్లు పడితే, శ్రీసత్యకు ఎనిమిది శాతం ఓటింగ్ పడింది. అయితే మొన్నటి రేవంత్ ఎక్కువ శాతం ఓటింగ్‌తో మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ అనూహ్యంగా దూసుకొచ్చి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. రేవంత్, రోహిత్‌లలో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్సు అధికంగా ఉంది. ఇప్పటికే శ్రీహాన్ ఫైనల్లోకి వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా మారాడు. టిక్కెట్ టు ఫినాలే దక్కించుకున్నాడు. శ్రీహాన్ టాప్ 5లోకి అడుగుపెట్టేశాడు.
View this post on Instagram
Also read: ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు