Bigg Boss 7 Telugu Winner: తనపై వచ్చిన నెగిటివిటీపై స్పందించిన శోభా, విన్నర్ అవ్వకపోయినా కోరిక తీరిందన్న గౌతమ్
Bigg Boss 7 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు ఎలిమినేట్ అయిపోయిన మాజీ కంటెస్టెంట్స్ కూడా వచ్చి తమ జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి బయటపెట్టారు.
Bigg Boss 7 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 7లోకి ముందుగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. అయిదు వారాల తర్వాత మరో అయిదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చారు. ఇక ఒకరి తర్వాత ఒకరుగా అందరూ ఎలిమినేట్ అవుతూ ఫైనల్‌గా టాప్ 6 కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్‌లో మిగిలారు. ఇక ఫైనల్స్ కావడంతో పాత కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చారు. ఎవరో విన్నర్ అవుతారో చూద్దామని ప్రేక్షకులతో పాటు మాజీ కంటెస్టెంట్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ ఎలా ఉందో బయటపెట్టారు. తనపై వచ్చిన నెగిటివ్ రియాక్షన్స్‌పై శోభా రియాక్ట్ అయ్యింది. విన్నర్ అవ్వకపోయినా తల కల నేరవేరిందని గౌతమ్ సంతోషంగా షేర్ చేసుకున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 7లో ఫినాలే వీక్‌కు ఎంటర్ అవ్వకముందే ఒక్క అడుగు దూరంలో ఉండగా.. శోభా ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటికి రాలేదని శోభా చెప్పుకొచ్చింది. బయటికి రావడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. ఎలిమినేట్ అయిన తర్వాత బయట పరిస్థితి ఎలా ఉందని బజ్ చూశానని, మీమ్స్ చూశానని, సంతోషంగా ఉందని అందరితో షేర్ చేసుకుంది. అయితే అందులో పాజిటివ్ కామెంట్స్‌ను మాత్రమే తీసుకొని, నెగిటివ్ కామెంట్స్‌ను పట్టించుకోవడం లేదని చెప్పింది. బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్‌గా వచ్చినందుకు గౌతమ్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఎలిమినేట్ అయిన తర్వాత తనను చూడడానికి చాలామంది అమ్మాయిలు వస్తున్నారని బయటపెట్టాడు గౌతమ్. తన జీవితం బిగ్ బాస్ వల్ల నిజంగానే ఉల్టా పుల్టా అయిపోయిందని అన్నాడు. ఒకప్పుడు జీరో ఉండేవాడిని అని, ఇప్పుడు తన లైఫ్ అంతా మారిపోయిందని చెప్పాడు. పలు సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నానని, బిగ్ బాస్‌కు విన్నర్ అవ్వకపోయినా.. తను కల కన్నట్టుగా వచ్చే ఏడాది అమ్మకు రిటైర్మెంట్ ఇప్పించబోతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. ఒకప్పుడు తనకు బ్యాక్‌గ్రౌండ్ లేదని బాధపడేవాడిని అని, ఇప్పుడు నాగార్జున ఉన్నారని ధైర్యంగా చెప్పాడు. అది విన్న నాగార్జున బిబి అంటే బ్యాక్‌బోన్ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు.
యూట్యూబర్‌గా బిగ్ బాస్‌లోకి వచ్చిన టేస్టీ తేజ కూడా తన లైఫ్ ఎంతలా మారిపోయిందో చెప్పుకొచ్చాడు. మూవీ ప్రమోషన్స్ చేసుకునే తనకు మూవీల్లో నటించడానికి ఛాన్సులు వస్తున్నాయని అన్నాడు. ఏకంగా 15 సినిమా ఆఫర్లు వచ్చాయని తెలిపాడు. అంతే కాకుండా బిగ్ బాస్‌లో 6 వారాలు ఉండి సంపాదించిన దానికంటే బయటికి వచ్చిన 9 వారాల్లో అంతకంటే డబుల్ సంపాదించానని బయటపెట్టాడు.
తన ఎలిమినేషన్ నుంచి ఇంకా పూజా బయటికి రాలేదని చెప్పింది. శుభశ్రీ కూడా తనకు చాలా మూవీ ఆఫర్లు వచ్చాయని, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’లో ఒక మంచి పాత్ర పోషిస్తున్నాని తెలిపింది. అంతే కాకుండా ప్రేక్షకులంతా కలిసి తనకు మనోభావాలు పాప అని ట్యాగ్ ఇచ్చారని చెప్పింది. నయని పావని కూడా తను ఫైనల్ వరకు ఉండకపోయినా.. ఒక్కవారంలోనే ఎలిమినేట్ అయిపోయినా.. ప్రేక్షకులు తనకు అంతే ప్రేమను ఇచ్చారని సంతోషంగా చెప్పుకొచ్చింది.
ఇంట్లో ఉన్నప్పుడు నాగార్జునతో పెద్దగా మాట్లాడని అశ్విని.. బయటికి వచ్చిన తర్వాత ఇంకొక జన్మ అంటూ ఉంటే నాగార్జునని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో నాగ్‌తో పాటు కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నారు. సందీప్ కూడా బయటికి వచ్చిన తర్వాత పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సైన్ చేశానని, తాజాగా విడుదలయిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘యానిమల్’లో కూడా ఒక పాట కొరియోగ్రఫ్ చేశానని చెప్పాడు. నాగార్జునతో పనిచేయడం తన కోరిక అని చెప్పగానే.. త్వరలోనే తప్పకుండా ఆ కోరిక తీరుతుందని సందీప్‌కు మాటిచ్చారు నాగ్.
Also Read: రవితేజ కోసం ట్రోఫీ త్యాగం - అమర్‌దీప్‌ను చూసి మాస్ మహారాజ్ భావోద్వేగం