Bigg Boss Shivaji: వాళ్లకు సాయం చేయొద్దన్న శివాజీ - నాకు అన్యాయం జరిగితే ఒప్పుకోనన్న తేజ!
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చివరి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎనిమిదవ వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా జరుగుతోంది. ఈసారి బిగ్ బాస్ బీబీ మారథాన్ లో భాగంగా కంటెస్టెంట్స్ కి కొన్ని టాస్కులు ఇచ్చారు. ఈ టాస్కుల్లో ఎవరు విన్ అవుతారో వాళ్లు కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తారు. గేమ్ లో ఓడిపోయిన వాళ్లు కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకుంటారు. బుధవారం మొదలైన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ప్రియాంక మొదటి కెప్టెన్సీ కంటెండర్ గా నిలువగా, పల్లవి ప్రశాంత్ రెండవ కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు. ఇక గురువారం ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి 'స్టోర్ ఇన్ ఫోర్ ఇట్' అనే టాస్క్ ఇచ్చారు.
ఇందులో నలుగురు సభ్యులు పాల్గొన్నారు. షవర్ నుంచి వచ్చిన నీటిని తమ హెల్మెట్ పై ఉన్న స్పాంజిని తడిపి దానిలోని నీటిని కంటైనర్ లో నింపాల్సి ఉంటుందని, ఎవరి కంటైనర్ లో ఎక్కువ నీరు ఉంటుందో వాళ్లే కెప్టెన్సీ కంటైనర్ గా నిలుస్తారని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్క్ లో సందీప్ మాస్టర్, అశ్విని, అర్జున్, భోలే పాల్గొన్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో చాలా సింపుల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. చివరి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి 'వేర్ ఇట్ టు విన్ ఇట్' అనే టాస్క్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమో ని గమనిస్తే.. 'వేర్ ఇట్ టు విన్ ఇట్ గేమ్ గెలవడానికి వీలైనన్ని ఎక్కువ బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది.
ఇంటి సభ్యుల నుంచి ఏ ముగ్గురు ఈ గేమ్ ఆడతారో చర్చించి బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పాల్సి ఉంటుంది' అని అన్నప్పుడు శోభా అర్జున్ తో "వాళ్ళిద్దరిని నేను అడగలేను. ఎందుకంటే నిన్న వాళ్ళు ప్లే చేయలేదు" అని చెప్తుంది. ఆ తర్వాత అదేంటో చెప్పండి అని అర్జున్ అంటే శోభ లోపలికి వెళ్తూ "చెప్పనివ్వకుండా చెప్పేస్తే నన్నేం చేయమంటావ్" అని అంటుంది. డిస్కషన్ అయిపోయిన తర్వాత అర్జున్ బిగ్ బాస్ తో 'యావర్, తేజ, శోభ ఈ గేమ్ ఆడుతున్నారని' చెబుతాడు. బజర్ మోగగానే శోభ, యావర్, తేజ ముగ్గురు వాష్ ఏరియా కి వెళ్లి బట్టలు వేసుకోవడం ప్రారంభిస్తారు. తేజ కి అమర్ దీప్, శోభాకి ప్రియాంక ఈ టాస్క్ లో సాయం చేసినట్లు ప్రోమోలో చూపించారు.
చివరగా 'శివాజీ తేజతో కౌంట్ మొదలుపెట్టండి' అని బిగ్ బాస్ చెప్పగానే శివాజీ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాడు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత గౌతమ్.. "నేను లెక్క పెడితే 72 వచ్చాయని" శివాజీ తో అంటాడు. అప్పుడు తేజ "నాకు అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను" అని శివాజీ తో చెప్తాడు. ఇక చివర్లో బిగ్ బాస్ ఈ గేమ్ ఫలితాన్ని ప్రకటించండి అంటూ శివాజీతో చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రోమోని బట్టి చూస్తే ఈ గేమ్ లో తేజ అందరికంటే ఎక్కువ బట్టలు వేసుకొని విన్ అయినట్లు తెలుస్తోంది. ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో విన్ అయిన ప్రశాంత్, ప్రియాంక ఇద్దరిలో.. పల్లవి ప్రశాంతి ఇప్పటికే కెప్టెన్ అవ్వగా ప్రియాంక ఇంకా కెప్టెన్ కాలేదు. ఇక మిగతా టాస్కుల్లో ఎవరు గెలిచారు. ఈవారం హౌస్ లోకి కెప్టెన్ గా ఎవరు నిలిచారు? అనేది తెలియాలంటే గురువారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read : సూర్య సినిమాలో దుల్కర్, నజ్రియా కూడా - సుధా కొంగరతో కొత్త సినిమా గురూ!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial