Bigg Boss 7 Nominations: ‘బిగ్ బాస్’ ఇంట్లో నామినేషన్స్ రచ్చ - దామినిని వెక్కిరించిన యావర్
బిగ్ బాస్ హౌజ్ లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇంట్లో ఎవరు తమకి నచ్చలేదో చెప్తూ తమ తమ కారణాలు చెప్తూ నామినేట్ చేశారు.
సండే ఫన్ డే గా చేసిన బిగ్ బాస్.. సోమవారం వచ్చిందంటే మాత్రం ఇంట్లో నామినేషన్స్ పేరుతో మంట పెట్టేస్తాడు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ బయటకి వెళ్లిపోగా, రెండో వారంలో షకీలాని పంపించేశారు. ఇక మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టేశాడు బిగ్ బాస్. గత సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా ఎవరు ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి మొహాన ఫోమ్ కొట్టాలని చెప్పారు. అయితే ఆదివారం నాగార్జున చెప్పిన మాటలు యావర్ పెద్దగా చెవికి ఎక్కించుకున్నట్టుగా కనిపించలేదు. ఎప్పటిలాగే ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా అరుస్తూ కనిపించాడు. ఓ రకంగా కాస్త ఓవర్ యాక్షన్ చేశాడనే చెప్పాలి. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.
బిగ్ బాస్ ఎవరిని పిలిస్తే వాళ్ళు ఎవరిని నామినేట్ చేయాలని అనుకుంటే వాళ్ళ ముఖం మీద ఫోమ్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ప్రియాంక గౌతమ్ ని నామినేట్ చేసినట్టుగా కనిపించింది. అయితే ఒక పాయింట్ తోనే మళ్ళీ మళ్ళీ నామినేట్ చేయడం కరెక్ట్ కాదని గౌతమ్ చెప్పుకొచ్చాడు. ఇక దామిని, ప్రిన్స్ యావర్ మధ్య హీటెక్కించే విధంగా వాదన జరిగింది. బిహేవియర్ ఏదైతే ఉందో అది తనకి పర్సనల్ గా నచ్చలేదని దామిని చెప్పింది. మీ మాటలు వెనక్కి తీసుకోండని యావర్ చెప్పగానే తీసుకొనని దామిని తెగేసి చెప్పింది. దీంతో యావర్ గట్టి గట్టిగా అరిచాడు. ‘ఐయామ్ కుకింగ్ ఐయామ్ కుకింగ్’ అంటూ దామినిని వెక్కిరించేలా మాట్లాడాడు. వారం పాటు తను వంట చేయనని దామిని సీరియస్ అయ్యింది. తను చెప్పేది వినకుండా అరుస్తూనే ఉన్నాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి దామిని ఆటలో కంటే ఎక్కువగా కిచెన్ లోనే కనిపిస్తుంది. తొలి వారం కూడా ఇదే విషయం మీద తనని నామినేట్ చేశారు.
శోభాశెట్టి రతికని నామినేట్ చేసింది. తను సెల్ఫీష్ గా ఆలోచిస్తున్నట్టు అనిపించిందని చెప్పుకొచ్చింది. అమర్ శుభశ్రీ ఇంటి పనులు చేయడం లేదనే కారణం చెప్పి నామినేట్ చేశాడు. చీపురు పట్టుకుని ఎప్పుడైనా హాలు కానీ కిచెన్ కానీ ఊడ్చడం చేశావా అంటూ ప్రశ్నించాడు. తను చేస్తున్నానని మొదట చెప్పిన శుభశ్రీ తర్వాత మీరు చేస్తున్నారు కదా అనేసింది. రతిక మళ్ళీ గౌతమ్ కృష్ణని నామినేట్ చేసింది. కానీ గౌతమ్ మాత్రం తను చెప్పేది వినిపించుకోకుండా ఆమె మీద అరిచాడు. గత వారం గౌతమ్ రతికని నామినేట్ చేస్తూ అరిచాడు. మరి ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఉన్నారనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లగానే షకీలా ‘బిగ్ బాస్’ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తనతోపాటు హౌస్‌లో ఉన్నసభ్యుల మనస్తత్వాల గురించి చెప్పారు. ‘‘మీరు ఆశ్రమానికి వెళ్లానని అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లానని అనుకుంటున్నారా?’’ అంటూ గీతూ అడిగిన ప్రశ్నకు షకీలా సీరియస్ అయ్యింది. ‘‘శివాజీ బ్యాచా? సీరియల్ బ్యాచా’’ అన్న ప్రశ్నకు కూడా సీరియస్ అయ్యింది. ‘‘షకీలా హౌజ్‌లో రియల్‌గా ఉన్నారా? ఫేక్‌గా ఉన్నారా’’ అని అడగగా.. తానేం ప్లాన్ చేయలేదని చెప్పింది. ‘‘అసలు బిగ్ బాస్ హౌజ్‌కు ఎందుకు వచ్చారు’’ అంటే.. ‘‘వారు పిలిచారు, నేను వచ్చాను’’ అంటూ సూటిగా సమాధానమిచ్చింది. గోల్ అంటూ ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది.
Also Read: యావర్ వెధవ, నేను చస్తే వాళ్లంతా రావాలి - ప్రశాంత్, రతికపైనా షకీలా షాకింగ్ కామెంట్స్