Bigg Boss Telugu 8 : టార్గెట్ చేసిన సొంత క్లాన్... యాటిట్యూడ్ స్టార్స్ కు సమాధానం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకున్న మణికంఠ
నత్తలా సాగకు ఒక్కటి వదలకు టాస్క్ లో సంచాలక్ నాగ మణికంఠ తీసుకున్న నిర్ణయం ఆయనను సొంత క్లాన్ కు దూరం చేసింది. మరి సొంత టీం ఆయనను పక్కన పెట్టేలా నాగ మణికంఠ ఏం చేశాడో తెలుసుకుందాం పదండి.
బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం 16 వ ఎపిసోడ్ ముగిసింది. ఈ ఎపిసోడ్లో హౌస్ మేట్స్ మధ్య ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ తో జరగడంతో పాటు నాగ మణికంఠను సొంత క్లాన్ సభ్యులే టార్గెట్ చేశారు. మరి ఇలా సొంత టీంకే నాగ మణికంఠ ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
నత్తలా సాగకు ఒక్కటి వదలకు..
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రెండు క్లాన్స్ శక్తి, కాంతారాలకు రేషన్ గెలుచుకోవడానికి ఒక టాస్క్ ను పెట్టారు. దాని పేరు నత్తలా సాగకు ఒక్కటి వదలకు. ఈ టాస్క్ లో భాగంగా రెండు క్లాన్స్ నుంచి ఇద్దరు ఇద్దరు చొప్పున సభ్యులు పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ చేతులను వెనక్కి కట్టి, అచ్చం నత్తలా పాకుతూ క్యాబేజీని తలతో దొర్లించుకుంటూ వెళ్ళాలి. ఒక టీంలో ఉన్న ఇద్దరు సభ్యులు ఒకరి తర్వాత ఒకరు వెంట వెంటనే వీలైనంత తొందరగా ఈ టాస్క్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా రెండు టీంలో నుంచి సభ్యులు టాస్క్ లో పాల్గొనగా, ఫాస్ట్ గా ఎవరు క్యాబేజీలను కంప్లీట్ చేస్తారో వాళ్లే విన్నర్స్. శక్తి టీం నుంచి ఈ టాస్క్ లో సోనియా, నిఖిల్ పాల్గొన్నారు. ఇక కాంతారా టీం నుంచి ఆదిత్య ఓం, ప్రేరణ పాల్గొన్నారు.
మణికంఠను ఇబ్బందుల్లో పడేసిన సంచాలక్ పోస్ట్
అయితే ఈ టాస్క్ కు నాగ మణికంఠను సంచాలక్ గా నియమించారు బిగ్ బాస్. టాస్క్ లో మొత్తం 15 క్యాబేజీలు ఉండగా, ఎవరు త్వరగా క్యాబేజీలను టార్గెట్ కి చేరుస్తారో ఆ టింకే ఎక్కువ క్యాబేజీలు వస్తాయి. టాస్క్ లో స్టార్ట్ అవ్వగానే శక్తి టీం నుంచి నిఖిల్, సోనియా చాలా ఫాస్ట్ గా టార్గెట్ ని కంప్లీట్ చేయడంతో వాళ్లకే ఎక్కువ క్యాబేజీలు పోయాయి. దీంతో సంచాలక్ గా ఉన్న నాగ మణికంఠ శక్తి టీంను విన్నర్స్ గా ప్రకటించాడు. ఈ నిర్ణయం వల్ల సొంత టీం నుంచి వ్యతిరేకత ను ఎదుర్కోవాల్సి వచ్చింది నాగ మణికంఠ. క్లాన్ చీఫ్ అయిన అభయ్ తో సహా యాటిట్యూడ్స్ స్టార్స్ యష్మి గౌడ, ప్రేరణ కూడా నాగ మణికంఠ చెప్పేది అస్సలు వినలేదు. అయితే మణికంఠ మాత్రం తనకు న్యాయం అనిపించిందే చేశానని, సొంత క్లాన్ వారం మొత్తం ఉపవాసం ఉండడం తనకేమైనా సరదానా ? అని ప్రశ్నించాడు. వెంటనే ప్రేరణ "అవునేమో" అంటూ తలతిక్క సమాధానం చెప్పింది. దీంతో హర్ట్ అయిన మణికంఠ వెంటనే "నన్ను టార్గెట్ చేయాలంటే చేసుకోండి" అనుకుంటూ వాష్ రూమ్ లోకి వెళ్లి తన గోడును బిగ్ బాస్ ముందు వెళ్లబోసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత అక్కడికి వచ్చిన ప్రేరణ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసింది. "అదంతా టాస్క్ లో భాగంగా జరిగిందిలే" అంటూ సర్ది చెప్పబోయింది. కానీ సొంత టీం నుంచి ఒక్కరు కూడా నాగ మణికంఠతో మాట్లాడే ప్రయత్నం చేయకపోవడంతో ఆయన హౌస్ లో ఒంటరి అయిపోయాడు.
Read Also: కొత్త లవ్ స్టోరీ, చిన్నోడికి యష్మి గౌడ - సీతతో నిఖిల్ పులిహోర... సోనియాతో ఇద్దరూ కటీఫ్ ?