అన్వేషించండి

Bigg Boss Telugu 8: ‘బిగ్ బాస్’ సీజన్ 8.. అఫీషియల్ డేట్ వచ్చేసింది - ఎప్పుడు, ఎన్ని గంటల నుంచి మొదలంటే..

BB 8 telugu date: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 8 డేట్ వచ్చేసింది. కంటెస్టెంట్స్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. ఈ షో ఎప్పుడు.. ఎన్ని గంటల నుంచి ప్రారంభం కానుందంటే...

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 8.. ఎట్టకేలకు టెలికాస్ట్‌కు సిద్ధమవుతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. ఇప్పటికే ఈ షో 7 సీజన్లు పూర్తిచేసుకుంది. వీటిలో 5 సీజన్లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. చాలాసార్లు హోస్ట్‌ను మారుస్తారంటూ వార్తలు వచ్చినా.. నాగ్ కొనసాగుతూనే ఉన్నారు. తాజా సీజన్‌కు కూడా నాగార్జనే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 

అయితే, ఈసారి ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటారనే విషయంపై క్లారిటీ లేదు. 14 లేదా 18 మంది వరకు ఈ షోలో పాల్గొంటారని తెలిసింది. ఇప్పటికే కొందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అలాగే, ‘బిగ్ బాస్’ సీజన్ 8కు సంబంధించి రెండు ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. గత సీజన్స్ కంటే భిన్నంగా ఈ ప్రోమోలు ఉన్నాయి. సీజన్ 8పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. ‘బిగ్ బాస్’ సీజన్ 8 టెలికాస్ట్ డేట్‌ను కూడా ప్రకటించారు. 

Also Read: వేణు స్వామికి బిగ్ బాస్ డోర్లు పూర్తిగా క్లోజ్ - ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?

ఎప్పుడు ప్రారంభం కానుందంటే...

‘బిగ్ బాస్’ సీజన్ 8 అభిమానులు ఇంకో 10 రోజులు వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే.. సెప్టెంబర్ 1 నుంచి ఈ షో ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటల నుంచి ‘బిగ్ బాస్’ షో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా ఈ వారంలోనే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

రాజ్ తరుణ్ ఎంట్రీ?

ఈ షోలో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పాల్గొంటాడనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అతడిపై కేసులు నడుస్తున్న నేపథ్యంలో ‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఫ్లాప్‌లతో అటూ కెరీర్‌లోనూ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు రాజ్ తరుణ్. ఈ సమయంలో అతడికి ‘బిగ్ బాస్’ ఒక్కటే ఓదార్పునిస్తుందని అంతా భావిస్తున్నారు. అలాగే, తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి కూడా ఇదే సరైన వేదిక అనే భావన వ్యక్తమవుతోంది. 

ఇంకా ఎవరెవరంటే...

పలు కామెడీ షోలతో ఆకట్టుకున్న సద్దాం కూడా ఈ సారి ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్తాడని తెలుస్తోంది. అలాగే సీరియల్ నటుడు అమర్ దీప్ భార్య తేజస్వినీ గౌడ, యాంకర్ రీతూ చౌదరి, ఆమె ఫ్రెండ్ యాంకర్ విష్ణు ప్రియ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ప్రముఖ కమెడియన్ అలీ సోదరుడు ఖయ్యుం కూడా ఎంట్రీ ఇస్తున్నాడని టాక్. సీరియల్ నటి యష్మీ గౌడ, టాలీవుడ్ సీనియర్ నటి సనా, అమృత ప్రణయ్, కుమారి ఆంటీ, సీరియల్ నటుడు నిఖిల్, ‘పటాస్’ యాదమ రాజు, యూట్యూబర్ బంచిక్ బబ్లు, బర్రెలక్క, యాంకర్ విద్యలకు కూడా ఛాన్స్ వచ్చిందని సమాచారం. ఈ లిస్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది సెప్టెంబర్ 1వ తేదీనే తెలుస్తుంది.

Also Read: బిగ్​బాస్ బ్యూటీ హాట్ ఫోటోషూట్.. You are like Chocolate 🍫 అంటూ తినేస్తున్న నయని పావని

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బందివినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Karimnagar: కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
Crime News: ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Embed widget