అన్వేషించండి

Bigg Boss 7: సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ సీజన్ 7 - అధికారికంగా ప్రకటించిన మేకర్స్!

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 7’ సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుందని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.

తెలుగు ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ‘బిగ్‌బాస్ 7’ ప్రారంభం అయ్యే తేదీని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం కానుంది. గత సీజన్ల మాదిరిగానే అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు.

ప్రోమో ఇలా..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కొత్త ప్రోమోను రమేశ్, రాధ అనే ఇద్దరు ప్రేమికులతో ప్రారంభించారు నిర్వాహకులు. వీరిలో రమేశ్.. కొండపై నుంచి జారి పడిపోబోతుంటే.. రాధ కొండపై నుంచి చున్నీ ఇచ్చి పట్టుకోమని అంటుంది. మామూలుగా సినిమాల్లో ఇలాంటి సీన్ వచ్చినప్పుడు రమేశ్.. కచ్చితంగా బతికి బయటపడతాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో మాత్రం అలా జరగదు.

రమేశ్ ఇక బతికేస్తాడు అనుకొనే సమయానికి రాధకు తుమ్ము వస్తుంది. అంతే మన రమేశ్ లోయలో పడి చనిపోతాడు. ఇలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కూడా ఎవరి ఊహకు అందకుండా ఉంటుందని నిర్వాహకులు ఈ ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పారు. అంతే కాకుండా ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ ఆటలు చెల్లవని, బిగ్ బాస్ ఆడించే ఆటలు మాత్రమే చెల్లుతాయని హోస్ట్ నాగార్జున స్పష్టం చేశారు. ఈ బిగ్ బాస్ సీజన్... ముందు సీజన్స్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది అని నాగార్జున కచ్చితంగా చెప్పారు. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 3వ తేదీన అని ప్రోమోలో స్పష్టం చేశారు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున గత నాలుగు సీజన్ల నుంచి బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్‌టీఆర్‌కు హోస్ట్ స్థానాన్ని ఇచ్చి ఈ షోపై హైప్‌ను విపరీతంగా పెంచేశారు. అంతే కాకుండా జూనియర్ ఎన్‌టీఆర్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా బిగ్ బాస్ చూడడం ప్రారంభించారు.

ఆ తర్వాత రెండో సీజన్‌లో నాని హోస్ట్‌గా ఎంటర్ అయ్యాడు. అయితే నాని హోస్టింగ్‌కు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో, అదే రేంజ్‌లో నెగిటివిటీ కూడా ఎదురు అయింది. అందుకే తరువాతి సీజన్‌కు హోస్టింగ్ చేయడానికి నేచురల్ స్టార్ నాని ఒప్పుకోలేదు. ఆ తర్వాత బరిలోకి దిగారు కింగ్ నాగార్జున. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి ఇప్పటివరకు నాగార్జున స్థానాన్ని ఎవరూ తీసుకోలేకపోయారు. ప్రతీ సీజన్ స్టార్టింగ్‌లో నాగ్ స్థానంలో మరో హీరో బిగ్ బాస్ హోస్ట్‌గా కనిపించనున్నాడు అంటూ పుకార్లు వస్తాయి. అయితే అవేవి నిజం కాదని చివర్లో తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విషయంలో కూడా అదే జరిగింది.

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Nov 25th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: జంటల సందడి.. రొమాంటిక్ సాంగ్స్.. సపోర్ట్! స్నేహం కట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: జంటల సందడి.. రొమాంటిక్ సాంగ్స్.. సపోర్ట్! స్నేహం కట్!
Bigg Boss Season 10 Today November 24th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆర్కేని గెలిపించిన ఇమ్ము! శివకి సీజన్ 9 విన్నర్ సపోర్ట్! త్రిగుణ్‌, ముకేశ్‌లతో గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆర్కేని గెలిపించిన ఇమ్ము! శివకి సీజన్ 9 విన్నర్ సపోర్ట్! త్రిగుణ్‌, ముకేశ్‌లతో గొడవ!
Bigg Boss Season 10 Today Nov 24th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: 9 విన్నర్ కల్యాణ్‌ పడాలతో త్రిగుణ్‌ గొడవ! గెస్ట్‌ దివ్య మీద నోరు జారిన ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: 9 విన్నర్ కల్యాణ్‌ పడాలతో త్రిగుణ్‌ గొడవ! గెస్ట్‌ దివ్య మీద నోరు జారిన ముకేశ్!
Bigg Boss Season 10 Today November 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget