News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7: కంటెస్టెంట్లకు ఊహించని షాకిచ్చిన నాగ్, క్యాష్‌తో వెళ్లిపోవచ్చంటూ బంపర్ ఆఫర్

ప్రతీ సీజన్‌లో ఫైనల్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ దగ్గరకు వచ్చే సూట్ కేస్.. బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం మొదటి ఎపిసోడ్‌లోనే వచ్చేసింది.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సందడి మొదలయ్యింది. ఈరోజు రాత్రి ప్రీమియర్ కానున్న లాంచ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. అసలు కంటెస్టెంట్స్ ఎవరో వారి మొహాలు కనిపించకుండా ఈ ప్రోమోను చాలా స్మార్ట్‌గా కట్ చేసి విడుదల చేశారు. ఇక ప్రతీ బిగ్ బాస్ సీజన్ లాంచ్ ఎపిసోడ్‌లాగానే ఈసారి కూడా పలువురు సెలబ్రిటీలు సందడి చేయడానికి వచ్చేశారు. ఇక ముందు నుంచి చెప్తున్నట్టుగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కొన్ని ఉల్టా పుల్టా వ్యవహారాలు జరగనున్నట్టు కూడా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ప్రతీ సీజన్‌లో ఫైనల్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ దగ్గరకు వచ్చే సూట్ కేస్.. ఈసారి మొదటి ఎపిసోడ్‌లోనే వచ్చేసింది. ఆ సూట్‌కేస్‌లోని డబ్బు తీసుకొని కంటెస్టెంట్స్ వెళ్లిపోయే అవకాశాన్ని.. మొదటిరోజే ఆ అయిదుగురు కంటెస్టెంట్స్‌కు అందించారు నాగార్జున.

ఫైనల్ ఎపిసోడ్‌లో జరగాల్సింది ఫస్ట్ ఎపిసోడ్‌లోనే..

టాస్కులు ఎంత బాగా ఆడినా.. బిగ్ బాస్ హౌజ్‌లో అందరితో ఎంత బాగా కలిసిపోయినా.. అసలు ప్రేక్షకులు అనేవారిని ఎవరిని ఆదరిస్తారో.. ఎవరిని విన్నర్‌గా చూడాలని అనుకుంటారో అంచనా వేయడం చాలా కష్టం. అది బిగ్ బాస్ హౌజ్‌లో బయట ప్రపంచానికి సంబంధం లేకుండా కంటెస్టెంట్స్ అంచనా వేయడం మరింత కష్టం. అందుకే చివరి వరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మాత్రమే అందరూ ప్రయత్నిస్తారు. అలా ఎక్కువగా కష్టపడిన వారు టాప్ 5కు వస్తారు. టాప్ 5కు వచ్చిన తర్వాత కూడా ఆ కంటెస్టెంట్స్‌కు రకరకాల టాస్కులు పెడతాడు బిగ్ బాస్. అందులో ఒకటి సూట్‌కేస్ గేమ్. ఒకవేళ అందులో ఏ ఒక్క కంటెస్టెంట్‌కు అయినా తాము గెలవలేము అన్న ఆలోచన ఉంటే సూట్‌కేస్‌లోని డబ్బులు తీసుకొని తప్పుకోవచ్చు అని చెప్తారు. మామూలుగా ఇది ప్రతీ బిగ్ బాస్ సీజన్ ఫైనల్‌లో జరిగేదే. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం వెరైటీగా ఫస్ట్ ఎపిసోడ్‌లోనే జరుగుతోంది.

సూట్‌కేస్ కోసం కంటెస్టెంట్స్ మధ్య గొడవ

బిగ్ బాస్ సీజన్ 7లో హౌజ్‌లో ముందుగా ఎంటరైన మొదటి అయిదుగురు కంటెస్టెంట్స్‌కు నాగార్జున ఒక ఆఫర్ ఇచ్చారు. ఒక సూట్‌కేసును హౌజ్‌ లోపిలికి పంపించి ఆ అయిదు కంటెస్టెంట్స్‌లో ఎవరైతే ఇప్పుడే షో నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నారో.. వారు ఆ సూట్‌కేస్ తీసుకొని వెళ్లిపోవచ్చని అన్నారు. అయితే ఆ సూట్‌కేస్ కోసం ఇద్దరు కంటెస్టెంట్స్ గొడవపడుతున్నట్టు కూడా ప్రోమోలో చూపించారు. మరి నిజంగానే ఆ సూట్‌కేస్ తీసుకొని ఒక కంటెస్టెంట్ వెళ్లిపోతాడా లేక వారి మీద వారికి ఉన్న నమ్మకంతో షోలోనే కొనసాగాలని నిర్ణయించుకుంటారా తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం విడుదల అయ్యేవరకు వేచిచూడాల్సిందే. అయితే, ఆ సూట్‌ కేసులో రూ.35 లక్షలు వరకు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఆ సూట్ కేసు పట్టుకుని ఎవరూ బయటకు వెళ్లలేదు.

బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్ ప్రోమో చూస్తుంటే ఈసారి ఎక్కువగా యంగ్ సెలబ్రిటీలే కంటెస్టెంట్స్‌గా వచ్చినట్టు తెలుస్తోంది. షోలో వచ్చిన మహిళా కంటెస్టెంట్స్‌ను ప్రేమ గురించి, హార్ట్ బ్రేక్ గురించి అడుగుతూ నాగార్జున చాలా సరదాగా మాట్లాడారు. ఇక అందులో ఒక అమ్మాయి.. నాకు మన్మథుడులాంటి వాడు కావాలి అంటూ నాగ్‌తో కబుర్లు చెప్పింది. ఈ ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి వచ్చారు. నవీన్ పోలిశెట్టి అల్లరిని ఎంత భరించాలో ఏంటో అని నాగార్జున అనడంతో ప్రేక్షకులంతా నవ్వుకున్నారు. రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Also Read: భారీ బడ్జెట్, బాలీవుడ్ డైరెక్టర్ - లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘కాంతార’ హీరో

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 03 Sep 2023 04:36 PM (IST) Tags: Bigg Boss Nagarjuna Bigg Boss Telugu 7 Bigg Boss Telugu Season 7 Bigg Boss 7 Telugu Bigg Boss Telugu 2023 BB 7 Telugu bigg boss 7 first episode promo

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

Bigg Boss Season 7 Day 23 Updates: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్

Bigg Boss Season 7 Day 23 Updates: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

Bigg Boss Promo: బ్యాంక్ గా మారిన బిగ్ బాస్ హౌస్- నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ!

Bigg Boss Promo: బ్యాంక్ గా మారిన బిగ్ బాస్ హౌస్- నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ!

Bigg Boss Season 7 Day 22 Updates: చెల్లి, అక్కా అని పిలుస్తా, నీ పేరు ఎత్తితే చెప్పుతో కొట్టు - రతికతో పల్లవి ప్రశాంత్ లొల్లి

Bigg Boss Season 7 Day 22 Updates: చెల్లి, అక్కా అని పిలుస్తా, నీ పేరు ఎత్తితే చెప్పుతో కొట్టు - రతికతో పల్లవి ప్రశాంత్ లొల్లి

టాప్ స్టోరీస్

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు ! గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు !  గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

TS Cabinet Agenda :  ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన