అన్వేషించండి

Bigg Boss Telugu Season 7: గౌతమ్‌ చొక్కా విప్పించిన నాగార్జున - మనుషులతో ఆడొద్దంటూ రతికాకు వార్నింగ్

‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7లో శనివారం నాగ్.. ‘కింగ్స్ మీటర్’ ద్వారా కంటెస్టెంట్లపై తనకు ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. మరి, ఎవరు ఎలా ఉన్నారో చూడండి.

‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 (Bigg Boss Telugu Season 7) ఎపిసోడ్ 15.. శనివారం ప్రసారమైంది. ప్రస్తుతం హోస్‌లో ఒక వైపు గౌతమ్, శుభశ్రీ.. మరోవైపు రతిక, ప్రిన్స్ యావర్‌ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోంది. ఇదంతా నాగార్జున ప్రత్యక్షంగా చూశారు. గత రెండు రోజులుగా రతిక, యావర్‌లు కొత్త లవ్ డ్రామా మొదలుపెట్టారు. దీంతో హౌస్‌మేట్స్ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ త్వరలో అంటూ.. వారిని ఆటపట్టించారు. మరోవైపు ప్రశాంత్.. ప్రిన్స్‌ను ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. 

కింగ్స్ మీటర్‌లో ఎవరు పరిస్థితి ఏమిటీ?

గత వారం ఆడియన్స్ ఇచ్చిన మార్క్స్‌ను నాగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈసారి నాగార్జునే స్వయంగా కంటెస్టెంట్‌లపై తనకు ఉన్న ఓపినియన్‌ను ‘కింగ్స్ మీటర్’ ద్వారా వెల్లడించారు. పదే పదే శివాజీ ఇంటి నుంచి వెళ్లిపోతానంటున్న వీడియోను నాగార్జున చూపించారు. మీటర్‌లోని రెడ్, యెల్లో, గ్రీన్.. సూచనల్లో.. శివాజీకి యెల్లో మార్క్ ఇచ్చారు. అమర్‌దీప్‌కు నాగ్ గ్రీన్ ఇచ్చారు. ఆటలో ఇంప్రూవ్ అయ్యారని చెప్పారు. ఆవేశంతో మాట్లాడొద్దని హెచ్చరించారు. షకీలాకు గ్రీన్‌కు దగ్గరగా యెల్లో ఇచ్చారు. చెప్పాలంటే శివాజీ కంటే ఎక్కువ మార్కులను షకీలా కొట్టేసినట్లే. సందీప్‌కు నాగ్ గ్రీన్ మార్క్ ఇచ్చారు. ప్రియాంకకు రెడ్ మార్క్ ఇచ్చారు. మెల్లిగా మీ ఫోకస్ గేమ్ నుంచి బయటకు వెళ్లింది. ‘‘తగ్గలేదని నాకు అనిపిస్తోంది’’ అని ప్రియాంక చెప్పింది. 

మొక్కని చూడలేనివాడు రైతు బిడ్డ?

పల్లవి ప్రశాంత్‌కు గ్రీన్ ఇచ్చిన నాగ్.. రైతు బిడ్డగా ఫెయిల్ అయ్యావంటూ రెడ్ ఇచ్చారు. ‘‘నువ్వు రైతు బిడ్డవని గర్వంగా చెప్పకున్నా. కానీ నువ్వు చేసినది ఏమిటి?’’ అని అడిగారు. ‘‘ఒక మొక్కను చూసుకోలేనివాడు రైతు బిడ్డ??’’ అని అడిగాడు. ‘‘నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. హెల్తీగా ఉండే మొక్కను పంపుతున్నా. నువ్వు రైతు బిడ్డవని రుజువు చేసుకో. మొక్కగానీ మాడిపోయిందో. నామినేషన్స్‌లో అందరూ చెప్పింది నిజమని నమ్ముతా’’ అని నాగ్ అన్నారు. 

ప్రిన్స్, గౌతమ్ చొక్కాలు విప్పించిన నాగార్జున

ఆ తర్వాత ప్రిన్స్ యావర్‌కు కూడా గ్రీన్ ఇచ్చారు నాగ్. బాగా ఆడిన తర్వాత పోటీదారుడివి కాకపోతే బాధ ఉంటుంది. ఆవేశపడుతూ అరవొద్దు అని చెప్పారు నాగ్. ‘‘ఆటలో రాజకీయాలు సహజం. అన్యాయానికి అరిస్తే లాభం ఉండదు’’ అని సూచించారు. ‘‘బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు ఒక్కటే కాదు.. కంటెస్టెంట్లను కూడా మెప్పించాలి.. అప్పుడే దేనికైనా అర్హులు’’ అని యావర్‌కు చెప్పారు. ప్రిన్స్ స్టెరాయిడ్స్ తీసుకున్నాడంటూ గౌతమ్ చేసిన వ్యాఖ్యలపై నాగ్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా షర్ట్ విప్పించి బాడీ చూపించాలని అన్నారు. ఆ తర్వాత యావర్‌కు క్షమాపణలు చెప్పించారు. గౌతమ్‌కు రెడ్ మార్క్ ఇచ్చారు. శుభశ్రీకి రెడ్ మార్క్ ఇచ్చారు నాగార్జున. దామినికి రెడ్ కంటే బాగా కిందకు పెట్టారు. ఆటతీరు బాగోలేదని తెలిపారు నాగ్. శోభాశెట్టికి కూడా రెడ్ ఇచ్చారు నాగార్జున. 

ఆట ఆడు, మనుషులతో ఆడొద్దు: రతికకు నాగ్ వార్నింగ్

శుభశ్రీకి రెడ్ మార్క్ ఇచ్చారు నాగార్జున. దామినికి రెడ్ కంటే బాగా కిందకు పెట్టారు. ఆటతీరు బాగోలేదని తెలిపారు నాగ్. శోభాశెట్టికి కూడా రెడ్ ఇచ్చారు నాగార్జున. రతికకు రెడ్‌కు దగ్గరగా గ్రీన్ ఇచ్చారు. ఒక టీమ్‌లో ఆడుతున్నప్పుడు టీమ్ గేమ్ ఆడాలి. ఇది చెస్ గేమ్ కాదు. టీమ్ గేమ్ ఉన్నప్పుడే గెలుస్తావ్. బఫూన్ అన్నావంటే.. టీమ్ వాళ్లంతా జోకర్సా? అని ప్రశ్నించారు నాగ్. ఆట ఆడు.. మనుషులతో ఆడొద్దు అని హెచ్చరించారు. టేస్టీ తేజాకు రెడ్ ఇచ్చారు నాగ్. హౌస్‌లో ఎక్కువగా నిద్రలోనే ఉంటున్నావ్ అంటూ వీడియో చూపించారు నాగార్జున.

ఈ వారం సేవ్ అయినది వీరే

శివాజీ పవర్ అస్త్ర సాధించిన నేపథ్యంలో ఆయన ఈ వారం నామినేషన్స్ నుంచి ఉపశమనం పొందారు. అమర్‌దీప్ కూడా ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. మరో నాలుగు వారాలు ఇమ్యునిటీ పొందారు. ప్రశాంత్, షకిలా, టేస్టీ తేజ, గౌతమ్, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, రతిక‌లు మాత్రం ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఆదివారం.. హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతారనేది తెలియనుంది. 

Also Read: బిగ్ బాస్ 7లోకి కొత్త ముఖాలు - వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సిద్ధమైపోతున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Embed widget