అన్వేషించండి

Bigg Boss Telugu Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ‘రెడ్ క్యాప్’తో నిఖిల్ ఎంట్రీ - అరే, విన్నర్ అనుకుంటే ఎలిమినేట్ అయ్యాడే!

హీరో నిఖిల్ ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెడ్ క్యాప్ పెట్టి టాప్-5లో ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చాడు.

‘బిగ్ బాస్’ హౌస్‌లోని మీరో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ‘కార్తికేయ-2’తో మంచి సక్సెస్ అందుకున్న నిఖిల్.. ‘18 పేజెస్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జునకు నిఖిల్ ఆ మూవీ విశేషాలను తెలిపాడు. అనంతరం నాగార్జున నిఖిల్‌కు ఒక టాస్క్ ఇచ్చారు. రెడ్ క్యాప్‌తో ఇంట్లోకి వెళ్లమని చెప్పారు. ఆ తర్వాత రెండ్ క్యాప్‌ను తలపై పెట్టి టాప్-5లో ఒకరిని ఎలిమినేట్ చేసి.. హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో నిఖిల్ హౌస్‌లోకి వెళ్లి.. హౌస్‌మేట్స్‌తో ఓ ఆట ఆడుకున్నాడు. క్యాప్ పట్టుకుని వారి చుట్టూ తిరుగుతూ.. టెన్షన్ పెట్టాడు. చివరికి రోహిత్‌కు రెడ్ క్యా్ప్ పెట్టి తనతోపాటు బయటకు తీసుకెళ్లిపోయాడు. రోహిత్ ఎలిమినేషన్‌తో అతడి తల్లిదండ్రులు, భార్య మెరినా ఎమోషనల్ అయ్యారు. మంచి వాడిలా ఇంటి నుంచి బయటకు వచ్చావని నాగార్జున.. రోహిత్‌ను కొనియాడారు. అయితే, రోహిత్ మంచితనం, వ్యక్తిత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతడు విజేతగా నిలిచే ఛాన్సు ఉందని కూడా అనుకున్నారు. కానీ, అతడే 5వ కంటెస్టెంట్‌గా హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ‘బిగ్ బాస్’లో టాప్-4 కంటెస్టెంట్లు ఉన్నారు. 

ఇంతకు ముందు బిగ్ బాస్ ఫినాలే సందర్భంగా హౌస్ జర్నీని వేశారు నాగార్జున. అది చూసి అందరూ ఎమోషన్ అయ్యారు.కొందరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీరు చెంపల మీద నుంచి జారినా వారు కంట్రోల్ లో ఉన్నారు. కానీ గీతూ మాత్రం వెక్కి వెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమెను ఫైమా ఓదార్చసాగింది. అంతేకాదు టాప్ 5 కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడుతున్నంత సేపు ముఖం మాడ్చుకునే ఉంటుంది గీతూ. మిగతా అందరూ ఎలిమినేట్ వాళ్లే. కానీ వారు చాలా సాధారణంగా ప్రవర్తించారు. ఈమె మాత్రం తానే విన్నర్ అవ్వాల్సింది,మిస్ అయిపోయినట్టు తెగ ఫీలైపోతుంది. తన ప్రవర్తనలోనే లోపం ఉందని ఆమె ఇప్పటికీ తెలుసుకోలేకపోతుంది. 

‘బిగ్ బాస్’ సీజన్-6లో పాల్గొన్న కంటెస్టెంట్లు వీరే

1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్  (సింగర్)

రేవంత్ విన్నర్?

బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా రేవంత్ నిలిచినట్టు సమాచారం. ఇక శ్రీహాన్ రన్నరప్ గా మిగిలాడని, ఆదిరెడ్డి మూడో స్థానంలో ఉన్నాడని తెలుస్తోంది. ఇక విన్నర్ మెటీరియల్ అనుకున్న రోహిత్ అయిదో స్థానానికే పరిమితం అయ్యాడని, కీర్తి నాలుగోస్థానంలో ఉందని తెలుస్తోంది. రేవంత్ విన్నర్ అని మొదట్నుంచి వినిపిస్తూనే ఉంది. ఇంకా విన్నర్ ని ప్రకటించక ముందే నా కొడుకుని విన్నర్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ రేవంత్ తల్లి ఇప్పటికే కామెంట్ చేసింది. ఇలాంటి కొడుకే తనకు పుట్టాలని ఎప్పటికీ దేవుడిని కోరుకుంటానని కూడా చెప్పింది. అంతేకాదు రేవంత్ ఇంటి దగ్గర సంబరాలకు కూడా అంతా రెడీ చేసేశారు. రేవంత్ కూడా ఎప్పట్నించో తానే విన్నర్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాదు బిగ్ బాస్ కు వెళ్లడానికి ముందే విన్నర్ అయి తిరిగొస్తా అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడ. ఇప్పుడు అదే నిజమైనట్టు తెలుస్తోంది. 

ఫినాలే వేదికపై నాగార్జున ఇద్దరి కంటెస్టెంట్‌ల చేతులు పట్టుకుని నిల్చుని చివరకు విజేత చేతిని పైకెత్తుతాడు. అలా వేదికపై నిల్చుంది రేవంత్, శ్రీహాన్ అని తెలుస్తోంది. వీరిద్దరిలో రేవంత్ విన్నర్ అయినట్టు సమాచారం. ఇక శ్రీహాన్ రన్నర్‌గా మిగిలిపోయినట్టు తెలుస్తోంది. ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయి ముందే బయటికి వచ్చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget