అన్వేషించండి

Bigg Boss Telugu Season 6: బిగ్ బాస్ ఫినాలే - కంటెస్టెంట్స్‌కు రవితేజ టెమ్టింగ్ ఆఫర్, నిఖిల్ చేతిలో విజేత నిర్ణయం?

‘బిగ్ బాస్’ సీజన్-6 ముగింపుకు వచ్చింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రోమోలో సీనియర్ నటి రాధాతోపాటు హీరోలు రవితేజ, నిఖిల్, హీరోయిన్ శ్రీలీల సందడి చేశారు.

‘బిగ్ బాస్’ సీజన్-6 ఫినాలేకు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. బిగ్ బాస్ ఇంట్లో ‘ధమాకా’ టీమ్ నుంచి మాస్ మహరాజ్ రవితేజ, శ్రీలీలా గెస్టులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగార్జున.. శ్రీహాన్‌ను చూపిస్తూ అతడు ఫ్లర్టింగ్‌లో కింగ్ అని చెప్పారు. దీంతో రవితేజ ‘‘డూ ఏజ్ మచ్ ఏజ్ పాజిబుల్’’ అని అన్నారు. దీంతో నాగ్.. ‘‘ఆ స్కూల్‌‌లో రవితేజ మాస్టర్’’ అని పంచ్ వేశారు. దీంతో రవితేజ ‘‘మీరు తక్కువ బాగా.. మీకు ఏమీ తెలియదు పాపం’’ అని అంటూ నవ్వించారు. అలాగే, ఆదిరెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. నువ్వు కాకుండా 21 మంది కంటెస్టెంట్లలో గొప్ప డ్యాన్సర్ ఎవరని అడిగారు. ఇందుకు ఆది ఫైమా పేరు చెప్పాడు. దీంతో స్టేజి మీదకు వచ్చిన ఫైమాకు చేతి మీద ముద్దు పెట్టబోయారు నాగార్జున. దీంతో ఫైమా ‘‘నిద్ర పట్టడం లేదు సార్, మీరు ముద్దు పెడుతుంటే’’ అని నవ్వించేసింది. 

ఆ తర్వాత రవితేజను సూట్ కేసు పట్టుకుని.. కంటెస్టెంట్లకు ఆఫర్ ఇవ్వాలని హోస్ట్ అక్కినేని నాగార్జున సూచించారు. దీంతో రవితేజ హౌస్‌లోకి సిల్వర్ సూట్‌కేస్‌తో ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లోకి వెళ్లిన రవితేజ ‘‘మేటర్ ఏమిటంటే మీకు ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చాను. అది తీసేసుకుంటే వెళ్లిపోవచ్చు’’ అని రవితేజ అన్నారు. ఆ తర్వాత నిఖిల్ ఒక రెడ్ టోపీతో హౌస్‌లోకి ఎంటర్ అయ్యాడు. ‘‘బిగ్ బాస్ సీజన్-6 విన్నర్ ఎవరు?’’ అని నాగ్ అనడమే కాకుండా.. కౌంట్ డౌన్ చేశారు. అయితే, అవి రెండు వేర్వేరుగా కావచ్చని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నిఖిల్ ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత కేవలం టాప్-5లో ఒకరిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చినట్లు తెలిసింది. 

Also Read: ‘బిగ్ బాస్’ సీజన్-6 ఫినాలే లైవ్ అప్‌డేట్స్: హౌస్‌లో మొదలైన సందడి - రాధా, రవితేజ, నిఖిల్ రచ్చ మామూలుగా లేదు

ప్రత్యేక ఆకర్షణగా రాధా

‘బిగ్ బాస్’ ఫినాలేలో సీనియర్ నటి రాధా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఆమె వేదికపై భలే యాక్టీవ్‌‌గా కనిపించారు. వేదిక మీదకు స్టెప్పులు వేసుకుంటూ వచ్చిన ఆమెను చూస్తూ.. ‘‘రావడం కూడా స్టెప్స్‌తోనే వస్తున్నారా’’ అని అన్నారు. రాధా స్పందిస్తూ.. ‘‘స్టెప్స్ లేకుండా నడవలేను. నాలుగో తరగతి నుంచే నేను డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను’’ అని అన్నారు. ఆ తర్వాత బాలాదిత్య.. మీకు నేను పెద్ద ఫ్యాన్‌ను అని రాధాతో అన్నాడు. దీంతో నాగ్.. ‘‘మొన్న తమన్నా వచ్చినప్పుడు కూడా’’ అదే అన్నాడని పంచ్ వేశారు. అనంతరం బాలాదిత్యతో కలిసి రాధా స్టెప్పులు వేశాడు. 

రవితేజకు ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్‌ ఇచ్చింది నాగార్జునే

నాగ్ శ్రీలీలాతో మాట్లాడుతూ.. ‘‘రవితేజ నాకు ఎప్పటి నుంచి తెలుసో నీకు తెలుసా?’’ అని అన్నారు. రవి తేజ స్పందిస్తూ.. ‘‘నా ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ మీద సంతకం పెట్టింది ఈయన. అది నేను దాచుకుందాం అనుకున్నాను. అవసరమై వాడేశాను’’ అని రవితేజ తెలిపారు. ఆ తర్వాత నీకు ఫస్ట్ చెక్కే కాదు.. ఒక బ్రీఫ్ కేసు కూడా ఇస్తున్నా. దాన్ని పట్టుకుని ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్లకు ఆఫర్ ఇవ్వాలని నాగ్ పేర్కొన్నారు. మరి, రవితేజ ఆఫర్‌కు కంటెస్టెంట్లు టెమ్ట్ అయ్యారో లేదో చూడాలి.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Embed widget