Bigg Boss Telugu 6 finale live: ‘బిగ్ బాస్’ సీజన్-6 ఫినాలే లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్’ సీజన్-6 విన్నర్ రేవంత్, రూ.40 లక్షలతో శ్రీహాన్ రన్నర్!
ఈ రోజే ‘బిగ్ బాస్’ సీజన్ -6 ఫినాలే. ఇప్పటికే విడుదలైన ప్రోమోలో సీనియర్ నటి రాధా, మాస్ మహారాజ్ రవితేజ, హీరో నిఖిల్ సందడి చేశారు.
LIVE

Background
‘బిగ్ బాస్’ సీజన్-6 విన్నర్ రేవంత్, రూ.40 లక్షలతో శ్రీహాన్ రన్నర్!
హోస్ట్ నాగార్జున ఆఫర్ చేసిన రూ.40 లక్షలు తీసుకుని రన్నర్‌గా నిలిచాడు శ్రీహాన్. దీంతో ‘బిగ్ బాస్’ సీజన్-6 విన్నర్‌గా రేవంత్ ట్రోపీ అందుకున్నాడు.
నాగార్జున మరో బంపర్ ఆఫర్, రూ.40 లక్షలతో బయటకొచ్చేసిన శ్రీహాన్
నాగార్జున మరో బంపర్ ఆఫర్, రూ.40 లక్షలతో బయటకొచ్చేసిన శ్రీహాన్. దీంతో చివరికి రేవంత్ విజేతగా నిలిచి ట్రోపిని అందుకున్నాడు.
రవితేజ ఆఫర్ వద్దన్న టాప్-3 కంటెస్టెంట్స్, కీర్తి ఔట్ - టాప్ 2లో శ్రీహాన్, రేవంత్
రవితేజ సిల్వర్ సూట్‌కేస్‌తో హౌస్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత ప్రైజ్ మనీలో 20 శాతం మీకేనని టెంప్ట్ చేశారు. కానీ, ఎవరూ దాన్ని తీసుకోడానికి సిద్ధం కాలేదు. ఆ తర్వాత 30 శాతానికి పెంచారు. కానీ, దాన్ని కూడా వద్దన్నారు. చివరికి రవితేజ్ రెడ్ సూట్ కేస్ ఇచ్చి కీర్తిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చేశారు. ప్రస్తుతం శ్రీహాన్, రేవంత్ టాప్-2లో ఉన్నారు.
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి సిల్వర్ సూట్‌కేస్‌తో రవితేజ, టెంప్ట్ అయ్యేది ఎవరు?
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి సిల్వర్ సూట్‌కేస్‌తో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎవరు సూట్‌కేసుతో వెళ్తారనేది సస్పెన్స్.
‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఆదిరెడ్డి ఎలిమినేట్
‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత రవితేజ సిల్వర్ సూట్‌కేస్‌తో హౌస్‌లోకి వెళ్లారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

