Telugu Bigg Boss 7 : నీకు హెడ్ వెయిట్ పెరిగింది, శివాజీపై నాగ్ కామెంట్స్ - రతిక కాదు, ఆ మేల్ కంటెస్టెంట్ ఔట్?
Telugu Bigg Boss 7 today updates : ‘బిగ్ బాస్’లో శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున శివాజీని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అమర్ దీప్ నామినేషన్స్ సక్రమంగా జరిగాయా లేదా అని ప్రశ్నించారు. Rathika Rose ఈ వారం సేఫ్?
‘బిగ్ బాస్’ సీజన్ - 7 ( Bigg Boss Telugu 7)లో శనివారం నాగార్జున హౌస్‌మేట్స్‌కు క్లాస్ పీకారు. నామినేషన్స్‌లో అమర్ దీప్‌ను సేవ్ చేయడంపై నాగ్ అందరినీ అడిగారు. అలాగే ఈ వారం కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేసుకుంటారని అడిగారు. హౌస్‌మేట్స్ అంతా శోభా, ప్రియాంక.. అశ్వినీ, రతికలను డామినేట్ చేశారని, అమర్‌కు ఫేవర్‌గా నామినేషన్స్ చేశారని తెలిపారు. ఈ వారం కెప్టెన్‌గా శివాజీని ఎంపిక చేసుకున్నారు.
బరువు తగ్గావు.. హెడ్ వెయిట్ పెరిగింది
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వచ్చిన శివాజీ కొడుకు గురించి నాగార్జున మాట్లాడారు. ‘‘నీ కొడుకు కూడా నీలాగే ఉన్నాడు. నువ్వు కూడా బరువు తగ్గి హ్యాండ్‌సమ్‌గా తయారయ్యావు. కానీ, బరువు తగ్గింది. హెడ్ వెయిట్ పెరిగింది’’ అన్నారు. దీంతో శివాజీ నాగ్ మాటలకు షాక్ అయ్యాడు. ‘‘నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను. నాలో ఏ మార్పు లేదు. ప్రజలు ఉంచితే ఉంటాను. లేకపోతే వెళ్లిపోతాను’’ అని అన్నాడు.
కెప్టెన్‌గా ఎంపికైన శివాజీ - గౌతమ్ ఓటు ఆయనకే
ఈ వారం అర్జున్, శివాజీల్లో ఎవరు కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నారని ఓటింగ్ నిర్వహించారు నాగ్. ఈ సందర్భంగా ప్రియాంక, భోలే, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్, యావర్, శోభా శెట్టి, రతిక రోజ్‌లు శివాజీ కెప్టెన్ కావడానికే మొగ్గు చూపారు. చిత్రం ఏమిటంటే.. గౌతమ్ కూడా శివాజీ కెప్టెన్ కావాలంటూ కిరీటంలో రింగ్ వేశాడు. శివాజీ ఒకసారి తనని కెప్టెన్ చేశాడని, తాను కూడా ఆయన కెప్టెన్ కావాలని కోరుకుంటున్నానని, ఇక ఎన్నో వారాలు లేవని, ఆయన్ని కెప్టెన్‌గా చూడాలని కోరుకుంటున్నానని తెలిపాడు. దీనికి ముందు రోజే కెప్టెన్సీ టాస్క్ విషయంలో గౌతమ్, శివాజీ పోట్లాడుకోవడం విశేషం.
శివాజీకి స్పెషల్ క్లాస్..
హౌస్‌లో ఉన్న 9 మంది సభ్యులు శివాజీ కెప్టెన్ కావాలని ఓటేశారు. అంతా శివాజీ కెప్టెన్‌గా ఎలా చేస్తారో చూడాలని ఉందంటూ ఓటేశారని నాగార్జున చెప్పారు. ఈ సందర్భంగా శోభాతో శివాజీకి కిరీటం పెట్టించారు. ఆ తర్వాత అర్జున్.. శోభా నుంచి కెప్టెన్ బ్యాడ్జ్ తీసుకుని శివాజీకి పెట్టాడు. ఆ తర్వాత నామినేషన్స్ రోజు శివాజీ.. చేసిన వ్యాఖ్యల వీడియోను ప్రదర్శించారు నాగార్జున. రాజమాతలు మీ మోతలు పగులుతాయ్ అనే కామెంట్‌పై నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాను సరదాగా అన్న మాటలని కవర్ చేసుకొనే ప్రయత్నం చేశాడు శివాజీ. అయితే, మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నాగార్జున తెలిపారు. నాగార్జున షో స్టార్టింగ్‌లో శివాజీకి హెడ్ వెయిట్ పెరిగింది అనడానికి కారణం ఇదే కావచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ ప్రేక్షకుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
చివరిగా హౌస్‌లో పాస్, ఫెయిల్ ఎవరో చెప్పాలని నాగార్జున అడిగారు. ఈ సందర్భంగా శోభా శెట్టి.. అమర్ పాస్, రతిక ఫెయిల్ అని, శివాజీ.. యావర్ పాస్ అని, రతిక ఫెయిల్ అని తెలిపాడు. ప్రియాంక.. శోభా శెట్టి పాస్, రతిక ఫెయిల్ అని తెలిపింది. అర్జున్.. భోలే పాస్ అని, అమర్ దీప్ ఫెయిల్ అని చెప్పారు. యావర్ - శివాజీ పాస్, శోభా శెట్టి ఫెయిల్ అని, పల్లవి ప్రశాంత్ - శివాజీ పాస్, రతిక ఫెయిల్ అని, భోలే షావలి - పల్లవి ప్రశాంత్ పాస్ అని, రతిక ఫెయిల్ అని, అశ్వినీ - పల్లవి ప్రశాంత్ పాస్ అని, రతిక ఫెయిల్ అని తెలిపారు. గౌతమ్ - అర్జున్ పాస్ అని, రతిక ఫెయిల్ అని పేర్కొన్నాడు. రతిక.. శివాజీ పాస్ అని, శోభా శెట్టి ఫెయిల్ అని తెలిపింది. అమర్ దీప్.. అర్జున్ పాస్ అని, రతిక ఫెయిల్ అన్నాడు.
భోలే షావలి ఔట్?
ఈ వారం హౌస్ నుంచి Bhole Shavali ఎలిమినేట్ కానున్నట్లు తెలిసింది. Rathika Rose సేవ్ కానున్నట్లు సమాచారం. అయితే, ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లోనే దీనిపై స్పష్టత వస్తుంది.
Also Read: శివాజీకే కెప్టెన్సీ - డేంజర్ జోన్‌లో రతిక, భోలే షావలి - యావర్ సేఫ్, కానీ..