Bigg Boss Telugu 7 Latest Promo : మరోసారి సిల్లీ నామినేషన్స్ చేసిన తేజ.. ప్రశాంత్, అమర్దీప్ మధ్య ఆరని చిచ్చు
బిగ్ బాస్ సీజన్ సెవెన్ తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా జరిగింది. ముఖ్యంగా ప్రోమోలో అందరూ అమరదీప్ ని టార్గెట్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ తొమ్మిదవ వారంలోకి అడుగు పెట్టింది. సోమవారం ఎపిసోడ్ కు సంబంధించి నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌజ్‌మేట్స్ మధ్య మళ్లీ వార్ మొదలైంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలో ఈవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాల్సిన వ్యక్తులను డ్రాగన్ స్నేక్ ముందు నిలబెట్టాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ అమర్ దీప్, తేజలను నామినేట్ చేయగా, ప్రియాంక రతిక, భోలే లను నామినేట్ చేసింది. అనంతరం అర్జున్ ఈసారి శోభా శెట్టి నామినేట్ చేశాడు. ఇక తాజాగా మరో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో అందరూ అమర్ దీప్‌ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
ఒకసారి ప్రోమోని పరిశీలిస్తే.. టేస్టీ తేజ అర్జున్‌ని నామినేట్ చేస్తూ.. "నువ్వు వచ్చిన మూడు వారాల్లో ఏ ఒక్క రోజూ నామినేషన్లో లేవని సిల్లీ రీజన్ చెప్పడంతో హౌజ్‌మేట్స్ అందరూ నవ్వేస్తారు. ఈ నిజం తప్పా వేరే రీజన్ లేదని" టేస్టీ తేజ చెప్తే దానికి అర్జన్.." వీడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడని చెప్పడంతో ఏ ఊరిలో సేఫ్ గేమ్ అయ్యాయి" అంటూ తేజ బదులిస్తాడు. ఆ తర్వాత శివాజీ" టేస్టీ తేజను నామినేట్ చేస్తూ.." నువ్వు ఆరోజు సందీప్ ని నామినేట్ చేయకపోయి ఉంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడేమో అనిపించింది" అనే రీజన్ చెప్తాడు." నామినేషన్ చేసినంత మాత్రాన ఎలిమినేషన్ కాదు అని మీరు కూడా అన్నారు కదా" అని తేజ శివాజీతో అంటాడు.
ఇక రతికా వంతు రాగానే శోభాని ఫౌల్ గేమ్ ఆడావు అనే రీజన్ తో నామినేట్ చేస్తుంది. దాంతో శోభ అమర్ ని "రతికా నీకు హెల్ప్ చేసిందా? లేదా క్లారిటీ ఇవ్వు అని అడిగితే లాస్ట్ లో చెప్పింది. కానీ నేను తీసుకోలేదని" అమర్ అంటాడు. దాంతో రతిక, 'నేను నీకు హెల్ప్ చేశానని నువ్వు అంటున్నావా?' అని అడిగితే దానికి అమర్.. అవును అనే సమాధానం ఇస్తాడు. అనంతరం తేజ, "ఫస్ట్ టూ వీక్స్ లో ఏ రితిక అయితే ఉందో మళ్లీ అదే రతికని చూడాలని నామినేట్ చేస్తున్నా" అని తేజ రీజన్ చెప్పడంతో రతిక తేజ పై సీరియస్ అవుతూ.." బయట రతిక ఏం చేస్తుందని సపరేట్ టీవీ పెట్టుకుని చూస్తావా" అంటూ చెబుతుంది.
ఆ తర్వాత భోలే వంతు వచ్చింది." నువ్వు నన్ను టార్గెట్ చేసినట్టు నాకు అనిపించింది. నేను మాట్లాడుతుంటే కుర్చీని కోపంతో తన్నావు" అని అమర్ దీప్ ని నామినేట్ చేస్తాడు. "వాడిని గేమ్ నుంచి తీసేయమని నువ్వెందుకు పాయింట్ రైస్ చేయలేదు" అని శోభా శెట్టి ప్రియాంక ని అడిగితే, దానికి ప్రియాంక.." నువ్వు ఏం పాయింట్ మాట్లాడుతున్నావ్. నాకు నవ్వొస్తుంది" అంటూ బదులిస్తుంది. 'మీరు గ్రూప్ గానే డిసైడ్ అయ్యారు ఆడాలని అని రతిక ప్రియాంకతో అంటే అరే ఇది సింగిల్ గేమ్ రతికా' అంటూ ప్రియాంక రతికపై ఫైర్ అవుతుంది. అనంతరం భోలే, అమర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
" నేను ఎవరి దగ్గర తప్పు ఒప్పుకున్నాను చెప్పు ఇప్పుడు. నేను చెప్పిస్తా" అని అమర్ భోలేతో చెప్పగా.." నీ నామినేషన్ నా మీద ఎంత అగ్రేసివ్ గా ఉందో తెలుసా?" అని భోళే అంటే..' నీకున్నంత రివెంజ్ టాస్కులు మాకైతే లేవయ్యా" అని అమర్ అంటాడు. "కోపం వచ్చిందని నువ్వు ఏది పడితే అది మాట్లాడతావా" అని ప్రియాంక అమర్ తో చెబితే దానికి అమర్.." అవును మాట్లాడటం తప్పా అని అంటాడు. బూతు మాట్లాడడం తప్పని చెబుతున్నాను, అని ప్రియాంక చెప్పగానే.. అది బూతు కాదు" అని అమర్ బదులు ఇస్తాడు. అది నీ దృష్టిలో అని మళ్ళీ ప్రియాంక జవాబు ఇస్తుంది. "ఒకటి దొరుకితే చాలు దాన్ని పట్టుకుని ఎగిరేయడానికి, ఎగిరేయండి.. ఏదో పెద్ద వచ్చి నన్ను ఇక్కడ ఉద్ధరించినట్టు" అంటూ అమర్ చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది.
Also Read : నా దగ్గర 6 లవ్ స్టోరీస్ ఉన్నాయి - నిబ్బా నిబ్బి స్టోరీస్ అని మీరు చెప్పకముందే నేనే చెప్తున్నా!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial