అన్వేషించండి

వాళ్ల వల్లే నేను మునిగిపోయేలా ఉన్నానన్న అమర్ దీప్ - నేను ఉన్నా, లేకున్నా వాడ్ని ఫైనల్స్​లో చూడాలన్న శివాజీ!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అప్పుడే 55 రోజులు గడిచిపోయాయి. ఈసారి సీజన్ ఉల్టా పుల్టా అంటూ చాలా రసవత్తరంగా సాగుతోంది. 8 వారం కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ మేట్స్ డిఫరెంట్ గేమ్స్ ఆడగా చివరికి గౌతమ్ ఎనిమిదో వారం కెప్టెన్ గా నిలిచాడు.  ఇక తాజాగా జరిగిన శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ కి గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు. ఈవారం సరిగ్గా గేమ్ ఆడని వాళ్లను హౌస్ లో సక్రమంగా లేని వాళ్ళ తప్పులు చెబుతూ వాళ్ళ ఫోటోలు ఉన్న జెండా కర్రలను విరిచేసారు నాగార్జున. ఆ తర్వాత ఎపిసోడ్ చివర్లో ప్రియాంక, గౌతమ్ ఇద్దరూ ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. ఇక ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది.

బిగ్ బాస్ లో సండే అంటే ఫన్ డే అనే విషయం తెలిసింది కదా. తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా ఫన్ తో పాటు ఓ గేమ్ కూడా ఆడించారు నాగార్జున. ప్రోమో ని పరిశీలిస్తే.. 'సరదాగా ఓ చిన్న ఆట ఆడదాం, నేను ఇద్దరి పేర్లు చెబుతాను. ఆ ఇద్దరిని బోట్ లో పెట్టాలి' అని నాగార్జున చెప్పడంతో గౌతమ్ ఈ గేమ్ ని మొదలు పెడుతూ అర్జున్, ప్రియాంక ఫోటోలను బోటుపై పెడతాడు. నీ బోర్డ్ మునిగిపోయే పరిస్థితి అలాంటప్పుడు ఎవరిని తోసేస్తావు, ఎవర్ని బోట్లో ఉంచుతావు? అని నాగార్జున అడిగితే.." అది చాలా హార్డ్ సార్. అర్జున్ కంటే ప్రియాంకతో బాండింగ్ ఎక్కువ" అని గౌతమ్  అంటాడు. అర్జున్ వచ్చేసి.."అమర్ దీప్ గౌతమ్ ఫోటో పెట్టి, అమర్ ఫోటో తీసి ఇకనుంచి ఎవరి హెల్ప్ లేకుండా ఏదైనా వాడంతట వాడే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను" అని చెబుతాడు.

ఆ తర్వాత అమర్.." ప్రియాంక శోభ ఫోటోలు పెట్టి, నేను మునిగిపోయేలా ఉన్నాను సార్" అని నాగార్జునతో అంటాడు. దాంతో హౌస్ మెంట్స్ అంతా నవ్వేస్తారు. అనంతరం యావర్.." శివాజీ, రతిక ఫోటోలు పెట్టి ఏదో ఆలోచిస్తుంటే అంతగా ఏం ఆలోచిస్తున్నావని అర్జున్ అనగానే, నేను ఆలోచించేది షో తర్వాత జరిగే గురించి" అని చెప్పడంతో అందరూ నవ్వేశారు. యావర్ రతిక ఫోటోని తీసి శివాజీ ఫోటోని బోర్డులో ఉంచుతాడు. తేజ వచ్చి..' యావర్, శోభల ఫోటోలను బోట్ పై పెడతాడు. అప్పుడు నాగార్జున వీళ్ళపై నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పు' అని అనడంతో తేజ శోభ ఫోటోని తీసేస్తాడు. అప్పుడు నాగార్జున నీకు ఉందిలే తర్వాత అని సెటైర్ వేస్తారు.

ఆ తర్వాత భోలే వంతు వచ్చినప్పుడు నాగార్జున, నామినేషన్స్ లో ఉన్న ప్రశాంత్ ను బయటికి తీసుకురా? అని చెప్పడంతో భోలే బదులిస్తూ.." ఏ పేరు లేకుండా ఒక రైతుబిడ్డగా వచ్చి మంచి బీజం అనేది ఏర్పరచుకున్నాడు సార్" అని అంటాడు. ఆ తర్వాత శివాజీ యావర్ ఫోటో ని తీసుకొని, "నేను ఈ హౌస్ లో ఉన్నా లేకపోయినా వీడ్ని ఫైనల్స్ లో చూడాలని నేను అనుకుంటున్నా" అని నాగార్జునతో చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. కాగా ఈ వారం సందీప్ మాస్టర్ హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. మిగతా కంటెస్టెంట్స్ తో పోలిస్తే సందీప్ మాస్టర్ కి తక్కువ శాతం ఓట్లు నమోదు అయినట్లు సమాచారం.

Also Read : కృతి శెట్టి కాదు, రవితేజ సినిమాలో హీరోయిన్​గా 'ఓజి' బ్యూటీ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Mahakumbh 2025 : మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
Kandula Durgesh: ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
Aus Open Champ Sinner: సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
Crime News: నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
Embed widget