అన్వేషించండి

BIGG BOSS 9 Contestants: టాప్ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ... - బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ వీళ్లేనా!

BIGG BOSS Season 9: బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్‌ జాబితాపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీవీ సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వరకూ కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

BIGG BOSS Season 9 Contestants List: ఫేమస్ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 9 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కింగ్ నాగార్జున ఆరోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా... కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. దాదాపు 100 రోజులు సాగే ఈ గేమ్ షోలో టీవీ సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వరకూ పాల్గొంటుంటారు. తాజాగా సామాన్యులకు సైతం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

కంటెస్టెంట్స్ వీళ్లేనా...

ఫేమస్ టీవీ షోస్ కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్, జాతిరత్నాలుతో ఫేమస్ అయిన వారిని 'బిగ్ బాస్ 9' కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తమ టాలెంట్‌తో ఫేమస్ అయిన ఫోక్ సింగర్స్, టీవీ యాక్టర్స్‌కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి, జబర్దస్త్ ఐశ్వర్య, సీరియల్ యాక్టర్స్ సాయికిరణ్, దేబ్జానీ, కావ్యశ్రీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

అలాగే, అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేం రమ్య, సుమంత్ అశ్విన్, కల్పికా గణేష్, జ్యోతి రాయ్, ఆరే రాజ్, శ్రావణి వర్మ, తేజస్విని గౌడ, దీపికా, వర్ష, పరమేశ్వర్ హివ్రాలే, తెలంగాణకు చెందిన ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గా దత్తా, ఫేమస్ ఫోక్ సింగర్ లక్ష్మిలు కూడా కంటెస్టెంట్ల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాపై నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సామాన్యులు సైతం...

గతంలో బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసిన వారికి కూడా ఈసారి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే, సామాన్యులకు కూడా ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు. అప్లై చేసుకున్న సామాన్యుల్లో కొంతమందిని స్క్రూట్నీ చేసి వారితో ఓ షో పెట్టి అందులో 3 నుంచి ఐదుగురి ఎంపిక చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో షోపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. కంటెస్టెంట్స్ ఎంపికపై కింగ్ నాగార్జున స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

గతంలో చాలామంది ఫేమస్ సెలబ్రిటీలకు అవకాశం ఇవ్వలేదంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. దీంతో సెలబ్రిటీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని నాగార్జున సూచించారట. ఈ షోలో పాల్గొనేందుకు చాలామంది చిన్న యాక్టర్స్, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చూస్తుండగా... ఈసారి ఫైనల్ లిస్ట్‌ను నాగార్జునే ఓకే చేస్తారనే టాక్ వినిపిస్తోంది. గత సీజన్లలో జరిగిన ట్రోలింగ్స్, విమర్శలు రాకుండా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Also Read: హరి హర వీరమల్లు ఫస్ట్ రివ్యూ... పవన్ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకోవచ్చా? సెన్సార్ & ఇన్‌సైడ్ టాక్ ఎలా ఉందంటే?

న్యూ రూల్స్... సరికొత్త గేమ్స్

బిగ్ బాస్‌లో గతంలో కంటే ఈసారి డిఫరెంట్‌గా గేమ్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో పార్టిసిపెంట్స్‌తో పాటు ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నారు. సీక్రెట్ రూమ్, రీఎంట్రీ కాన్సెప్ట్స్ పూర్తిగా క్యాన్సిల్ చేయనున్నారట. పార్టిసిపెంట్స్‌కు శారీరక శ్రమ కంటే మానసిక స్థైర్యం, వ్యక్తిత్వ వికాసం అందేలా గేమ్స్ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇంటెన్స్, డ్రామా, మైండ్ గేమ్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 7న కొత్త సీజన్ ప్రారంభం కానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu 10 Agnipariksha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Embed widget