Hari Hara Veera Mallu Movie: హరిహర వీరమల్లు మూవీ సూపర్ హిట్ కావాలి- అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్
Ambati Rambabu about Hari Hara Veera mallu Movie | పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Pawan Kalyan starrer Hari Hara Veera Mallu Movie Release | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇదివరకే ప్రీరిలీజ్ ఈవెంట్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలతో హరిహర వీరమల్లు థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా జులై 24న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే తాను ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా సినిమాలు చేస్తున్నానని.. పార్టీని నడపాలన్నా, తనకు వ్యక్తిగతంగానూ ఎంతో కొంత డబ్బు కావాలి కనుక సినిమాలు చేస్తున్నానని పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ప్రస్తావించారు. నిన్నటివరకూ హరిహర వీరమల్లు బాయ్‌కాట్ ట్రెండ్ నడవడంతో పవన్ మరింత ఎమోషనల్ అయ్యారు.
హరిహర వీరమల్లుపై అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్
గురువారం నాడు విడుదల కానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమాపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ గారి "హరిహర వీర మల్లు" సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను !’ అని అంబటి రాంబాబు తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పైగా ఈ పోస్టును పవన్ కళ్యాణ్, నాగబాబుకు ట్యాగింగ్ సైతం చేశారు.
పవన్ కళ్యాణ్ గారి
— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2025
"హరిహర వీర మల్లు"
సూపర్ డూపర్ హిట్టై
కనక వర్షం కురవాలని
కోరుకుంటున్నాను !@PawanKalyan @NagaBabuOffl
బ్రో సినిమా టైంలో వివాదం..
సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ అంబటి రాంబాబుగా పరిస్థితి ఉండేది. ఆ సినిమాలో నటుడు పృధ్వీ చేసిన క్యారక్టర్ తనను ఉద్దేశించేలా చెప్పకనే చెప్పారని అప్పటి మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. దాంతో అసహనానికి లోనైన అంబటి సైతం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద సినిమాలు చేస్తానని కొన్ని టైటిల్స్ ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిరోజూ మీడియాకు ముందుకు వచ్చి బ్రో కలెక్షన్స్ అంటూ లెక్కలు చెప్పే స్థాయికి వివాదం రాజుకుంది.
#BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM#DisasterHHVM #DisasterHHVM#DisasterHHVM#DisasterHHVM#DisasterHHVM#DisasterHHVM#DisasterHHVM https://t.co/elH7RqHDS5
— BHANU PRAKASH (@BPsonofGOPI) July 23, 2025
అంబటి రాంబాబు పోస్ట్ వైరల్
తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త మూవీ హరిహర వీరమల్లు గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న తరుణంలో అంబటి రాంబాబు చేసిన పోస్ట్ ట్రెండ్ అవుతోంది. అంబటి చేసిన పోస్టుకు సైతం నెగటివ్ గానే కామెంట్లు వస్తున్నాయి. ఇదివరకే వైసీపీ శ్రేణులు #BoycottHHVM అని పిలుపునివ్వడంతో గత మూడు రోజులనుంచి బాయ్ కాట్ హరిహర వీరమల్లు ట్రెండ్ చేస్తున్నారు. సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అంటూ జగన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని జనసేన నేతలు, పవన్ కళ్యాణ్, మెగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ తొలిసారి కథానాయికగా చేసింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏ దయాకర్ రావు సినిమా నిర్మించారు. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.






















