News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss Telugu: కుక్కలా తిరిగా అంటున్నావ్, ఇక్కడ ఏం చేశావ్? రైతు బిడ్డకు ఊహించని షాకిచ్చిన రతిక

రతికకు అక్కడ ఆమెకు స్పేస్ లేదు. కానీ, తీసుకుని మరీ పల్లుకు షాకిచ్చింది. ఆమె అలా అడుగుతుందని.. పాపం అతడు ఊహింలేకపోయాడు.

FOLLOW US: 
Share:

హోస్ట్ నాగార్జున చెప్పినట్లుగానే ఈ సారి సీజన్ ఉల్టా ఫుల్టాగా సాగుతోంది. ‘బిగ్ బాస్’ కూడా ఆ తరహాలోనే ఊహించని టాస్కులు ఇస్తున్నాడు. అయితే, కంటెస్టెంట్లు కూడా ఒక్కోసారి ఊహించని విధంగా షాకులిస్తున్నారు. దీంతో సీజన్-6 కంటే.. సీజన్-7 కాస్త బెటర్‌గానే అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సోమవారం (సెప్టెంబర్ 11) నామినేషన్స్ ఎపిసోడ్ చాలా వాడీవేడిగా సాగింది. శివాజీ-ప్రియాంక, పల్లవి ప్రశాంత్ - అమర్ దీప్, టేస్టీ తేజ - రతిక మధ్య సాగిన మాటల యుద్ధం బిగ్ బాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ఇక అమర్‌దీప్ అయితే ఉగ్రరూపం చూపించాడు. కానీ, పల్లవి ప్రశాంత్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. తన సెంటిమెంట్ డైలాగులను చెబుతూనే ఉన్నాయి. అయితే, వారి యుద్ధం మధ్యలోకి ఊహించని వ్యక్తి వచ్చింది. చల్లగా తన సైడ్ సైనికుడికే షాకిచ్చింది. తాను మరెవ్వరో కాదు.. రతిక.

డీజే టిల్లుకు రాధిక దొరికినట్లు.. ప్రశాంత్‌కు రతిక దొరికిందంటూ అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చేస్తున్నాయ్. అంత పెద్ద పోలిక ఎందుకని అనుకుంటున్నారా? అయితే, ఈ రోజు నామినేషన్ల రచ్చలో ఏం జరిగిందో తెలుసుకోవల్సిందే. అయితే, సోషల్ మీడియాలో చెబుతున్నట్లు రతిక.. రాధిక టైప్ కాదు. అతడిని మోసం చేయలేదు. నలుగురి ముందు నిలదీసింది అంతే. తనకు అక్కడ స్పేస్ లేకున్నా.. స్పేస్ తీసుకుని మరీ పల్లవికి షాకిచ్చింది. ఆమె అలా ప్రశ్నిస్తుందని అక్కడి కంటెస్టెంట్‌లకే కాదు.. కనీసం ‘బిగ్ బాస్’ కూడా ఊహించి ఉండడు. ఇంతకీ ఏం జరిగిందంటే...

నామినేషన్స్‌లో భాగంగా ‘బిగ్ బాస్’ రైతు బిడ్డ (ఇదే గొడవకు కారణం) పల్లవి ప్రశాంత్‌ను బురద టబ్‌లో నిలుచోబెట్టాడు. ఆయన్ని నామినేట్ చేయాలనుకొనేవారు ముందుకు రావాలని బిగ్ బాస్ కోరాడు. దీంతో గౌతమ్, అమర్ దీప్, ప్రియాంక, షకీలా, దామిని, టేస్టీ తేజలు నామినేట్ చేయడానికి ముందుకొచ్చారు. నామినేషన్స్‌లో కాసేపు ప్రియాంక, పల్లవి ప్రశాంత్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత గౌతమ్ కూడా.. తన వాదన వినిపించాడు. ఇక యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నువ్వు సంపాదించుకోగలవు. అలాంటప్పుడు రైతు బిడ్డ అంటూ సింపతీకి ప్రయత్నించకూడదు. నువ్వు తలచుకుంటే లక్షలు సంపాదించగలవు. మా కంటే ఎక్కువ సంపాదించగలవు. ఒక యాడ్ చేస్తే లక్ష వరకు వస్తుంది.. అని అన్నాడు.

దీంతో ప్రశాంత్ ‘‘నువ్వు ఇప్పిస్తావా ఆ లక్ష. నాకు గానీ ఒక లక్ష ఇస్తే.. దాన్ని నేను తీసుకోను. ఒక పేద రైతుకు ఇస్తాను’’ అని తెలిపాడు. ఆ తర్వాత నామినేషన్‌కు వచ్చిన అమర్ దీప్ మాట్లాడుతూ.. ఈ దేశంలో రైతులు మాత్రమే కాదని, బిటెక్ చదివిన వారి నుంచి ఆటోలు, లారీలు నడిపేవారి వరకు ప్రతి ఒక్కరూ పేదరికంతో కష్టాలు అనుభవిస్తున్నారని, వారి గురించి ఎందుకు మాట్లాడవంటూ విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత కాస్త వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. రైతు బిడ్డను అంటూ.. కెమేరాల ముందు చెప్పుకోకుండా.. మాతో కూడా మాట్లాడమని అమర్ చెప్పాడు. 

అనంతరం పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘‘నేను బిగ్ బాస్ సీజన్-6లోకి వచ్చేందుకు.. స్టూడియో చుట్టూ కుక్కలా తిరిగాను’’ అని చెప్పాడు. ఇంతలో రతిక స్పందిస్తూ.. ‘‘కుక్కలా తిరిగిన నీకు ఇక్కడ అవకాశం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావ్??’’ అని అడిగింది. అంతే, పల్లవి ప్రశాంత్ నోట నుంచి మాట రాలేదు. తనతో ఎప్పుడూ క్లోజ్‌గా ఉండే తన పిల్ల.. రతిక అలా అడుగుతుందని ఊహించలేదు ప్రశాంత్. అయితే, రతిక ఇంకా ఏవో అడగాలనే అనుకుంది. అమర్ ఇంకా మాట్లాడాలి ఉండు అంటూ ఆమెను ఆపాడు. ఆ తర్వాత అమర్ మాట్లాడుతూ.. నువ్వు రైతు సెంటిమెంట్ ప్లే చేస్తుంటే, మాకు నిన్న కార్నర్ చేస్తున్నా అనే ఫీలింగ్ కలుగుతోందని అని అమర్ తన ఫ్రస్ట్రేషన్ వెల్లగక్కాడు. అయితే, అమర్ అన్ని మాటలన్నా పర్వాలేదు. కానీ, ఎప్పుడూ నీడలా వెంట ఉండే రతికనే ఆ మాట అనడమే.. ‘బిగ్ బాస్’ ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్. 

Also Read: నేను మేనేజ్ చేస్తే వేరేలా ఉంటుంది: శివాజీకే వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక, ఆ తర్వాత ఏమోషనల్

Published at : 11 Sep 2023 11:37 PM (IST) Tags: Bigg Boss Nominations Bigg Boss season 7 bigg boss season 7 telugu Rathika Pallavi Prasanth

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్