Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్
ఒక్కొక్కసారి బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు చేసేవాళ్లకే కాదు.. చూసేవాళ్లకు కూడా వింతగా అనిపిస్తాయి. నాలుగో పవర్ అస్త్రా కోసం అలాంటి ఒక డిఫరెంట్ టాస్కును ఎదుర్కున్నారు కంటెస్టెంట్స్.
ఔను, నిజం.. బిగ్ బాస్‌కు వచ్చిన ఐడియా ఇది. పవర్ అస్త్ర సాధించి హౌస్‌మేట్ కావాలంటే.. కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకుని.. ఆ నీటితో గ్లాసు నింపాలట. వినడానికే చిత్రంగా ఉన్నా.. ఈ టాస్క్‌ను ‘బిగ్ బాస్’ అమలు చేసి మరీ చూపించాడు. ఇక కంటెస్టెంట్లు తక్కువ తిన్నారా? తమకు తోచిన ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఎప్పుడూ కన్నీళ్లు రెడీగా ఉంచుకొనే పల్లవి ప్రశాంత్.. బిందెడు కన్నీళ్లు కార్చడానికి సిద్ధమయ్యాడు. మరి, తన కన్నీళ్లతో గ్లాసు నింపగలిగాడా లేదా అనేది గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్ చూడాల్సిందే.
బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో వారంలో నాలుగో పవర్ అస్త్రా కోసం పోటీ మొదలయ్యింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్‌ను బ్యాంక్ చేసి, అందులో కంటెస్టెంట్స్ అంతా బ్యాంకర్స్ దగ్గర నుండి వారికి కుదిరినంత కాయిన్స్‌ను సంపాదించుకున్నారు. ఇదంతా పక్కన పెడితే.. కాయిన్స్ శబ్దం వచ్చిన ప్రతీసారి కంటెస్టెంట్స్ అంతా పరిగెత్తుకుంటూ వెళ్లి బిగ్ బాస్ ఏటీఎమ్ దగ్గర ఉన్న బజర్‌ను నొక్కాలి. ఆ క్రమంలో ఎవరు ముందు బజర్ నొక్కితే.. వారికే ఆ టాస్క్ ఆడే ఛాన్స్ ఉంటుంది. అందులో భాగంగా సెప్టెంబర్ 28న ప్రసారమయిన ఎపిసోడ్‌లో స్మైల్ ప్లీజ్ అనే టాస్క్ పూర్తయ్యింది. అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ అందులో విన్నర్స్‌గా నిలిచారు కూడా. అయితే నవ్వే టాస్క్ తర్వాత వెంటనే ఏడుపు టాస్క్ వచ్చింది.
నేచురల్‌గా ఏడవాలి..
బిగ్ బాస్ కాయిన్స్ శబ్దం చేయగానే.. యావర్ ముందుగా బజర్‌ను క్లిక్ చేయగలిగాడు. దీంతో పల్లవి ప్రశాంత్‌ను తన టీమ్‌గా ఎంచుకున్నాడు. వారితో తలపడడానికి గౌతమ్, అమర్‌దీప్‌ల పేరు చెప్పాడు. గౌతమ్, అమర్ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ప్రశాంత్, యావర్ గెలిస్తే.. ఆ కాయిన్స్ అన్నీ వీరి సొంతమయ్యే అవకాశం ఉందనే ఆలోచనతో యావర్.. వారిని ఎంపిక చేశాడు. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ అంతా ఏడుస్తూ.. వారి కన్నీళ్లతో ఒక గ్లాసును నింపాలి. దీంతో టాస్క్ మొదలవ్వగానే అమర్‌దీప్, గౌతమ్.. వారి కళ్లలో కన్నీళ్లు రావడం కోసం ఉల్లిపాయిలు, నిమ్మకాయలు పిండుకోవడం మొదలుపెట్టారు. కానీ అలా చేసే అవకాశం వారికి లేదని, నేచురల్‌గా కళ్లలో నుండి నీళ్లు రావాలని బిగ్ బాస్ కండీషన్ పెట్టాడు. అమర్‌దీప్ అసలు కళ్లు మూయకుండా నీళ్లు తెప్పించుకునే ప్రయత్నం చేశాడు. గౌతమ్ మాత్రం తనను ఎవరైనా గట్టిగా తిట్టమని, అలా అయితే తను ఎమోషనల్ ఫీల్ అయ్యి ఏడుస్తాననే ప్లాన్ వేశాడు.
కింద పడి మరీ..
అమర్‌దీప్, గౌతమ్‌లకు పోటాపోటీగా ప్రశాంత్, యావర్ కూడా ఏడ్చారు. ప్రశాంత్ అయితే కింద పడిపోయి మరీ ఏడవడం మొదలుపెట్టారు. అది కూడా శోభా శెట్టి సైతం ఎమోషనల్ అయ్యింది. రతిక అయితే ప్రశాంత్ ఏడుపు చూసి ఏంటిది అన్న ఎక్స్‌ప్రెషన్ పెట్టింది. అయినా పల్లవి ప్రశాంత్‌కు ఏడవడం పెద్ద విషయం కాదని, అతడి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తే.. తనకు ఏడవడం అనేది ఎంత అలవాటో తెలుస్తుందని బిగ్ బాస్ ప్రేక్షకులు అనుకున్నారు. ఈ ఏడుపు టాస్క్ అంతా సెప్టెంబర్ 28న ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో స్టార్ మా, హాట్‌స్టార్ ప్రేక్షకులు చూడవచ్చు.
Also Read: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial