Pallavi Prashanth: ‘బిగ్ బాస్’ పల్లవి ప్రశాంత్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ - ‘మళ్లొచ్చినా’ అంటూ ఆడేసుకుంటున్న మీమర్స్
బిగ్ బాస్‌పై వీడియోలు చేసి.. అందులోకి ఎంటర్ అయిన వారు కొందరు ఉన్నారు. అలా ఈ సీజన్‌లో ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ కూడా ఒకడు.
ప్రతీసారి ‘బిగ్ బాస్’లోకి వచ్చే చాలామంది కంటెస్టెంట్స్ గురించి ప్రేక్షకులకు కనీసం ఐడియా ఉంటుంది. కానీ ఈసారి ఒకరిద్దరు సీనియర్ నటులు తప్పా ఎక్కువమంది కంటెస్టెంట్స్ గురించి ప్రేక్షకులకు కనీసం ఐడియా లేదు. అందుకే చాలామందిపై అప్పుడే ట్రోల్స్ మొదలయిపోయాయి. ముఖ్యంగా ‘బిగ్ బాస్’ సీజన్ 7లో అందరికంటే ఎక్కువగా ఫోకస్ అవుతున్న కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. ఒక రైతు నుండి యూట్యూబర్‌గా మారి, తన వైరల్ వీడియోలతో ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్.. ఎప్పటినుండో ‘బిగ్ బాస్’లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు. ఫైనల్‌గా తన కలను నిజం చేసుకున్నాడు. కానీ అదే రేంజ్‌లో ట్రోల్స్‌కు కూడా గురవుతున్నాడు.
మళ్లొచ్చినా అన్నా..
‘బిగ్ బాస్’పై వీడియోలు చేసి.. అందులోకి ఎంటర్ అయిన వారు కొందరు ఉన్నారు. అలా ఈ సీజన్‌లో ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ కూడా ఒకడు. ‘బిగ్ బాస్’ మీద ఒక వీడియో చేసి, అది వైరల్ అయిన తర్వాత తను కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనాలి అనే కోరిక మొదలయ్యింది. అందుకే తనను సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఫాలో అయ్యేవారిని ఎప్పటికప్పుడు తనను ఫేమస్ చేయమని, ‘బిగ్ బాస్’కు వెళ్లేలాగా సపోర్ట్ చేయమని కోరకుంటూ ఉండేవాడు. ‘మళ్లీ వచ్చిన’ అంటూ పల్లవి ప్రశాంత్ అనే మాట.. ప్రస్తుతం ట్రోలర్స్ చేతిలో అస్త్రంగా మారింది. అదే డైలాగుతో సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
Vayammoo 😵 #PallaviPrasanth#BiggBossTelugu7 #BiggBoss7Telugu pic.twitter.com/I8lrvKeGNV
— PAVAN SAI (@PAVANSAI99949) September 3, 2023
అన్న, అన్న అంటూ వీడియోలు..
యూట్యూబ్‌లో వీడియోలు చేసే సమయంలో ‘అన్న, అన్న, రైతు బిడ్డను అన్న. మళ్ల వచ్చినా అన్న’ అంటూ తన వీడియోను ప్రారంభించేవాడు పల్లవి ప్రశాంత్. ఆ డైలాగ్ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా ఉన్న శివాజీ, షకీలా లాంటి సీనియర్ల మధ్య పల్లవి ప్రశాంత్ కూడా ఒక కంటెస్టెంట్ అవ్వడం గ్రేట్ అని మరికొందరు ప్రేక్షకులు తనను ప్రశంసిస్తున్నారు. మరోవైపు ‘బిగ్ బాస్’ అంటే విపరీతమై ఇష్టంతో అందులో కంటెస్టెంట్‌గా రావడం కోసం ‘బిగ్ బాస్’ టీమ్‌కు పల్లవి ప్రశాంత్ డబ్బులు చెల్లించాడని కొందరు ప్రేక్షకులు అనుమానిస్తున్నారు.
#BiggBossTelugu7 #PallaviPrasanth
— Mahesh Anna❤️ (@Aakash226018955) September 4, 2023
Nerpisthadu velandii 😂😂 pic.twitter.com/lCtmbJpsdL
ఆనందంతో సోషల్ మీడియాలో పోస్ట్..
‘బిగ్ బాస్’ సీజన్ 7లో అందరికంటే కాస్త భిన్నమైన కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. ఆ సందర్భంగా ‘నా స్వప్నం సాకారమైన వేళ.... నా ఆశయం నెరవేరిన వేళ.... ఎన్నో ఏండ్లుగ ఏదురుచూసిన... ‘బిగ్ బాస్’ లోకి పోవాలని... నాగార్జున సర్ తో మాట్లాడాలని... కలవాలని... ఆయన్ని తాకాలని... ఇన్నాళ్లకు నా కల ఫలించింది. ఆయన్ని కలిసిన క్షణం మరువలేనిది. నా కల ఫలించిందంటే కారణం నన్ను అభిమానించిన మీ అందరు. మీ అందరికీ నా పాదాభివందనం.’ అని తన సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. తన ప్రవర్తన, మాటతీరు ఇతరుల కంటే డిఫరెంట్‌గా ఉన్నా కూడా ‘బిగ్ బాస్’ హౌజ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం కోసం పల్లవి ప్రశాంత్ ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంతో రతికతో క్లోజ్‌గా ఉండడం కూడా పల్లవి ప్రశాంత్‌పై ప్రేక్షకుల ఫోకస్ పడేలా చేస్తోంది.
View this post on Instagram
Also Read: ‘‘బిగ్ బాస్’’ సీజన్ 7లో మహిళలదే డామినేషన్, అప్పుడే డ్రామా క్వీన్స్ అంటూ బిరుదు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Entra babu e #PallaviPrasanth gadu .. drama chesthunadu #Rathika tho 😡😡🤮🙌#BiggBossTelugu7 #RathikaRose pic.twitter.com/OqXTjBu3BQ
— Thaggedhe Le (@Ulta_Pulta_) September 4, 2023