అన్వేషించండి

Bigg Boss Season 7 Promo : మెగాస్టార్​ సిగ్నేచర్ స్టెప్​ గుర్తుపట్టలేకపోయిన డాక్టర్ బాబు

Bigg Boss Season 7 Promo : సన్ ఢే ఫన్ ఢే అంటూ బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది. జిగర్ తండా టీమ్ కూడా ప్రమోషన్స్ చేసేందుకు బిగ్ బాస్ షోకి వచ్చి సందడి చేసింది.

Bigg Boss Season 7 Promo : బిగ్​బాస్​ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. శనివారం జరిగిన ఎపిసోడ్​లో నాగార్జున కంటెస్టెంట్​లను ఓ రేంజ్​లో వేసుకున్నారు. వారం మొత్తం టాస్క్​ల్లో జరిగిన విషయాలపై.. కంటెస్టెంట్​లు చేసిన తప్పులపై గట్టిగా విరుచుకుపడ్డారు. జపాన్ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా కార్తీ బిగ్​బాస్​కు వచ్చి సందడి చేశారు. సినిమాలో మీరు నాలో డార్క్​ సైడ్​ చూస్తారు అని చెప్పగా.. నాగార్జున ఈ హౌజ్​లో అందరికీ కూడా డార్క్​ సైడ్​ ఉందంటూ ఫన్ చేశారు. ఒక్కొక్క కంటెస్టెంట్​లోని గుడ్, డార్క్​ సైడ్స్​ గురించి నాగ్​.. కార్తీకి తెలిపారు. అనంతరం గౌతమ్​కి, శివాజీకి మధ్య ఉన్న గొడవలపై హౌజ్​ అందరి ముందు క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఆదివారం ప్రోమోను రిలీజ్ చేశారు. సండే ఫన్​డే అన్నట్లుగానే ప్రోమో సాగింది. మూవీ ప్రమోషన్స్​లో భాగంగా జిగర్తాండ టీమ్ వచ్చింది. రాఘవ లారెన్స్ ముందుగా స్టేజ్​ మీదకి నాగార్జునతో వచ్చారు. లారెన్స్ డైరక్షన్​లో మాస్​, డాన్​ సినిమాలు చేశారు నాగార్జున. ఈ చనువుతో స్టేజ్​ మీదకి వచ్చేప్పుడు మాస్​ సినిమాలోని సాంగ్​తో లారెన్స్ ఎంట్రీ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్​ నుంచి తన కెరీర్​ ప్రారంభమైందని.. ఇప్పుడు హీరోగా మీ ముందు నొల్చొన్నాను అంటూ నాగార్జునతో తెలిపారు. ఎటువంటి సినిమాలు తీస్తున్నావ్​ నువ్వు.. ఒకటి కాదు రెండు కాదు.. కొత్త కాన్సెప్ట్స్​తో ఆడియన్స్ ముందుకు వస్తున్నావు అంటూ నాగార్జున కితాబు ఇచ్చారు.

అనంతరం ఎస్​.జె సూర్య కూడా స్టేజ్​ మీదకు వచ్చారు. దీనిలో భాగంగా నాగ్ హౌజ్​ మేట్స్​తో 'Dance Hook Step' అంటూ హుక్​ స్టెప్ గెస్ చేయాలి అనే టాస్క్ ఇచ్చారు. ముందుగా ప్రశాంత్, అమర్​దీప్​ స్టెప్​ గెస్ చేసేందుకు వచ్చారు. ​ప్రశాంత్ గంట కొట్టి ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మ స్టెప్ గెస్ చేసి​ వేశాడు. మీరు డాన్స్ బాగానే వేశారు కానీ.. వీణను పై నుంచి కిందకు కాదు.. కింద నుంచి పైకి వేయాలంటూ.. లారెన్స్ ఫన్నీగా కామెంట్ చేశారు. ఆ స్టెప్ మీరు వేస్తే చూడాలని ఉందని సూర్య కోరగా.. రాఘవ డ్యాన్స్ వేశారు. 

గౌతమ్​ కృష్ణ, అమర్​ దీప్​ ఆడేందుకు వచ్చారు. హిట్లర్​ మూవీలోని నడక కలిసిన నవరాత్రి సాంగ్​ ప్లే చేయగా.. గౌతమ్​ బెల్​ కొట్టి.. స్టెప్ గెస్​ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో హౌజ్​మేట్స్​ అందరూ గొల్లున నవ్వారు. అనంతరం నాగార్జున అమర్​ను డ్యాన్స్ గెస్​ చేయమని చెప్పగా.. అమర్​ కరెక్ట్ స్టెప్ వేశాడు. లారెన్స్ అమర్​ డ్యాన్స్​ను మెచ్చుకున్నాడు. నాగర్జున తేజను ఉద్దేశిస్తూ.. మాస్టర్​ మీకో గొప్ప డాన్సర్​ను పరిచయం చేస్తాను అన్నాడు.

ఈ స్టెప్​ చాలా ఉపయోగపడుతుంది. తన హుక్ స్టెప్. మ్యూజిక్​ ప్లీజ్​ అనగానే ఆంధ్రావాలలోని నై రే నై రే సాంగ్​ వేశారు. దానికి తన హుక్​ స్టెప్ వేస్తూ తేజ అందరినీ ఎంటరటైన్ చేశాడు. ఆయన కాన్ఫిడెన్స్ నాకు నచ్చిందని సూర్య తెలపగా.. రాఘవ తన నెక్స్ట్ ఫిల్మ్​లో దీనిని వాడుకుంటానని తెలిపగా ఈ ప్రోమోకి ఎండ్​ కార్డ్​ పడింది. ఈ వారం తేజ ఎలిమేనేట్​ అయ్యారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరి ఎవరు ఎలిమినేట్​ అయ్యారో సాయంత్రం ఎపిసోడ్​ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

">

Also Read : చెప్పుడు మాటలు వినకు, గౌతమ్‌కు నాగ్ చురకలు - అశ్వినీ ‘అగ్గిపుల్ల’ స్వామి అని తేల్చేసిన కింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget