అన్వేషించండి

Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో ఈసారి నాగార్జున ఎక్కువగా తేజను టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. దానికి స్మైల్ ప్లీజ్ టాస్క్‌లో తేజ ప్రవర్తనే కారణం అని తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. చూసే ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేది వీకెండ్ ఎపిసోడ్ కోసమే. వారమంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పులను, ఒప్పులను లెక్కేసి మరీ వారికి బుద్ధిచెప్పడానికి నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. బయట ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉంటుందో.. నాగార్జున అచ్చం అలాగే మాట్లాడతారని ఫ్యాన్స్ ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఇక ఈ వారం కూడా నాగార్జున.. కంటెస్టెంట్స్ చేసిన తప్పులను నోట్ చేసుకొని వారికి క్లాసులు తీసుకోవడానికి సిద్ధమయినట్టుగా తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ‘స్మైల్ ప్లీజ్’ టాస్క్‌లో టేస్టీ తేజ చేసిన తప్పుపైనే నాగ్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు.

సంచాలకులే ఫెయిల్..
పవర్ అస్త్రా కోసం ‘స్మైల్ ప్లీజ్’ అనే టాస్క్‌ను కంటెస్టెంట్స్‌కు ఇచ్చారు బిగ్ బాస్. ఆ టాస్కులో గౌతమ్‌ను ఆపే ప్రక్రియలో టేస్టీ తేజ.. తన చేతిలో ఉన్న బెల్ట్‌ను గౌతమ్ మెడకు బిగించాడు. దీని వల్ల గౌతమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం కంటెస్టెంట్స్‌కు మాత్రమే కాదు. ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కూడా దీనిని ఖండించారు. వీకెండ్ ఎపిసోడ్ ప్రోమోలో ముందుగా సంచాలకులుగా వ్యవహరించిన సందీప్, శివాజీల ఆటతీరు తప్పుబట్టారు నాగార్జున. ముందుగా సందీప్‌ను ‘‘నువ్వేమైనా అంధుడివా?’’ అని అడిగారు. ఆ తర్వాత శివాజీని ‘‘కెమెరాలో నుండి ఏం జరుగుతుందో నీకు కూడా కనిపించలేదా’’ అని అడిగి తెలుసుకున్నారు.
నాగార్జున అడిగిన ప్రశ్నకు ‘‘నేను అరిచాను’’ అని సమాధానమిచ్చాడు శివాజీ. కానీ గౌతమ్ తేజకు బెల్ట్ వేసినప్పుడు తను అరిచాడని, తేజ గౌతమ్‌కు వేసినప్పుడు ఏమీ అనలేదని వీడియో ప్రూఫ్‌తో సహా చూపించారు నాగార్జున. వీడియో చూపించిన తర్వాత ‘‘ఇక్కడ ఏమైంది నీ గొంతు’’ అని ప్రశ్నించాడు. కావాలని చెప్పలేదని శివాజీ సమాధానమివ్వగా అది నేను డిసైడ్ చేస్తానని నాగార్జున తన నోరుమూయించారు. ఆ తర్వాత ‘‘నువ్వు చూస్తున్నావుగా ఏం మాట్లాడలేదేంటి’’ అని సందీప్‌ను ప్రశ్నించారు నాగ్. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియని సందీప్.. సారీ అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయినా కూడా ‘‘సంచాలకుడిగా నువ్వు పూర్తిగా విఫలం అయ్యావు’’ అంటూ నాగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. 

అరిస్తే ఎంకరేజ్‌మెంట్..
సంచాలకులుగా శివాజీ, సందీప్ చేసిన తప్పుల గురించి చెప్పిన తర్వాత నాగార్జున.. తేజతో మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. ముందుగా ఏం జరుగుతుందో చూశావా అని తేజను అడిగారు. ‘‘చుట్టుపక్కల ఆడపిల్లలు అరుస్తున్నారు కదా’’ అని చెప్పగా ఎంకరేజ్‌మెంట్ అనుకున్నా అంటూ సమాధానమిచ్చాడు తేజ. దానికి నాగార్జునకు ఏం మాట్లాడాలో తెలియక.. శోభా శెట్టిని అడిగి క్లారిటీ తీసుకున్నారు. ఎంకరేజ్ చేశారా అని శోభాను అడగగా.. ‘‘లేదు సార్. వాడు అరిస్తే ఎంకరేజ్‌మెంట్ అనుకుంటాడనే తేజ కొట్టొద్దు అన్న పదం ఉపయోగించాం’’ అని క్లియర్‌గా చెప్పింది. ‘‘తప్పు తెలుసుకొని ఆపాను’’ అని తేజ చెప్పగా.. ‘‘నువ్వు లైన్‌లో నుండి బయటికి వచ్చాడు అనుకొని ఆపావు’’ అని నాగర్జున గట్టిగా చెప్పారు. ఇక కొట్టడం అనవసరం అనుకున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు తేజ. ఈ మాటకు నాగార్జునకు మరింత కోపం వచ్చింది. దీంతో పొరపాటు జరిగిందని, ఏ శిక్ష వేసిన సిద్ధమని సైలెంట్‌గా నిలబడ్డాడు తేజ.

శిక్ష ఏంటంటే..
ఏ శిక్ష వేసిన సరే అని తేజ చెప్పగా.. ఏం చేస్తే బాగుంటుందని కంటెస్టెంట్స్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు నాగార్జున. ముందుగా శుభశ్రీ జైలు అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రియాంక జైలు అంటే చాలా చిన్న విషయమని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఇక సందీప్ ‘‘తనను డైరెక్ట్‌గా ఇంటికి పంపించేయడం బెటర్ అని అనుకుంటున్నాను’’ అనగా.. ఇది విన్న కంటెస్టెంట్స్ ఆశ్చర్యపోయారు.

Also Read: రిషి-వసుకి పెళ్లిచేసి కన్నుమూసిన జగతి, గుప్పెడంతమనసు నెక్స్ట్ లెవల్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget