Bigg Boss Season 7 Day 6 Updates: బిగ్ బాస్‌లో ముగిసిన పవర్ అస్త్రా టాస్క్ - సందీప్, ప్రియాంకలలో విన్నర్ ఎవరంటే?
ఫైనల్‌గా ఆట సందీప్, ప్రియాంక జైన్‌లో ఒకరు గెలిచి, పవర్ అస్త్రాను సొంతం చేసుకున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి ఒకవారమే కావడంతో.. కంటెస్టెంట్స్ అంతా రఫ్‌గా ఏమీ హ్యాండిల్ చేయలేదు నాగార్జున. వారంరోజుల పాటు జరిగిన సంఘటలను, సందర్భాలను గుర్తుచేసుకుంటూ చాలాసేపు వారితో సరదాగానే మాట్లాడారు. జోకులు వేసుకున్నారు, నవ్వుకున్నారు. ఇక నేడు (సెప్టెంబర్ 9న) జరిగిన ఎపిసోడ్‌లో కనీసం నామినేషన్స్, ఎలిమినేషన్ అన్న మాట కూడా రానివ్వలదు. ముందుగా ఆడియన్స్.. కంటెస్టెంట్స్ అందరికి విడివిడిగా వేసిన మార్కుల గురించి ముచ్చటించిన నాగార్జున.. ఆ తర్వాత పవర్ అస్త్రా టాస్క్ గురించి చర్చించారు. ఫైనల్‌గా ఆట సందీప్, ప్రియాంక జైన్‌లో ఒకరు గెలిచి, పవర్ అస్త్రాను సొంతం చేసుకున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 మొదటి రోజే హౌజ్‌లోకి ఎంటర్ అయిన 14 మంది ఇంకా హౌజ్‌మేట్స్ అని పిలుచుకునే అర్హతను సాధించలేదని, ప్రస్తుతం వారు ఇంకా కంటెస్టెంట్స్ అనే నాగార్జున క్లారిటీ ఇచ్చారు. వారు హౌజ్‌మేట్స్‌లాగా మారాలంటే పవర్ అస్త్రా సాధించుకోవాలని చెప్పారు. అలా హౌజ్‌లోకి వెళ్లిన మొదటి వారంలోనే ఒక పవర్ అస్త్రాను సాధించుకునే అవకాశం కంటెస్టెంట్స్ ముందుకు వచ్చింది. ‘ఫేస్ ది బీస్ట్’ అనే టాస్క్‌లో ఇద్దరు బాడీ బిల్డర్స్‌తో తలపడి ఇద్దరు కంటెస్టెంట్స్ పవర్ అస్త్రా రేసులో నిలబడ్డారు. వారే ఆట సందీప్, ప్రియాంక జైన్. ఆ తర్వాత ఇతర కంటెస్టెంట్స్ కూడా పవర్ అస్త్రా రేసులో నిలబడడం కోసం బిగ్ బాస్.. తనను ఇంప్రెన్ చేయమని టాస్క్ ఇచ్చాడు.
కంటెస్టెంట్స్‌కు క్లారిటీ..
బిగ్ బాస్‌ను ఇంప్రెన్ చేయాలని చెప్పిన టాస్క్‌లో రతిక, శివాజీ గెలిచారు. కానీ వారు ఏం చేసి గెలిచారో కంటెస్టెంట్స్‌కు ఇంకా క్లారిటీ లేదు. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి అందరికీ క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేయమని చెప్పగానే.. కాఫీ అనే వంకతో ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అందరినీ శివాజీ తనవైపు తిప్పుకొని ఎంటర్‌టైన్ చేశాడు కాబట్టి తనకు బిగ్ బాస్ ఇంప్రెస్ అయ్యారని నాగ్ తెలిపారు. ఇక రతికను యాక్టివిటీ రూమ్‌లోకి పిలిచి ‘ఉడత ఉడత ఊచ్’ అనే పాటను రెండున్నర గంటల పాటు ప్లే చేసి, ఆ తర్వాత ఆ పాటలో ఉడత అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో అడిగితే.. దానికి రతిక 1056 అని కరెక్ట్ సమాధానం చెప్పిందని, అందుకే రతిక కూడా పవర్ అస్త్రా టాస్క్‌కు సెలక్ట్ అయ్యిందని నాగార్జున.. అందరికీ క్లారిటీ ఇచ్చారు. రతిక మేధస్సును ప్రశంసించారు. అసలు పవర్ అస్త్రా టాస్క్‌కు శివాజీ, రతిక ఎందుకు సెలక్ట్ అయ్యారో అని అసూయ పడిన కంటెస్టెంట్స్‌కు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది.
బుట్టలో బంతులు..
ప్రస్తుతం పవర్ అస్త్రా రేసులో ఉన్న ఆట సందీప్, ప్రియాంకను బట్టలు మార్చుకోమని చెప్పి ఫైనల్ టాస్క్‌ను పెట్టారు నాగార్జున. ఒక బెంచ్ మీద నడుస్తూ తమ ఎదురుగా ఉన్న బుట్టలో బాల్స్‌ను వేయమని, 7 నిమిషాల్లో ఎవరు ఎక్కువ బంతులు వేస్తే.. వారే విన్నర్ అని నాగ్ తెలిపారు. 7 నిమిషాల్లో ప్రియాంక.. 34 బంతులు వేయగా.. సందీప్ 43 బంతులు వేసి విన్నర్‌గా నిలిచాడు. ప్రియాంక చేతుల మీదుగా పవర్ అస్త్రాను అందుకొని బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి హౌజ్‌మేట్ అయ్యాడు. ఈ పవర్ అస్త్రా అనేది సందీప్ గేమ్ ప్లాన్‌ను ఎన్నో విధాలుగా మారుస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Also Read: అల్లు అర్జున్‌కు ‘మా’ లేఖ, 'అదొక్కటే బాధగా ఉంది' అంటున్న మంచు విష్ణు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial