Allu Arjun: అల్లు అర్జున్‌కు ‘మా’ లేఖ, 'అదొక్కటే బాధగా ఉంది' అంటున్న మంచు విష్ణు
తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుండి కూడా అల్లు అర్జున్‌కు లేఖ అందింది. ఆ లేఖను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బన్నీ.
ఇటీవల 69వ నేషనల్ అవార్డ్స్ ప్రకటన జరిగింది. నేషనల్ అవార్డ్స్ అనేవి ప్రారంభించి ఇప్పటికీ 69 సంవత్సరాలు అయినా ఇప్పటివరకు ఒక తెలుగు హీరోను కూడా ఆ అవార్డ్ వరించలేదు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన నేషనల్ అవార్డ్ జ్యూరీ.. తనకు ఆ అవార్డ్‌ను ప్రకటించింది. నేషనల్ అవార్డ్స్ ప్రకటన జరిగినప్పటి నుండి దాని చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ అయినా.. అల్లు అర్జున్‌కు అందే ప్రశంసలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు నేరుగా వచ్చి అల్లు అర్జున్‌ను ప్రశంసించడంతో పాటు.. పలువురు లేఖలు కూడా పంపించారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుండి కూడా అల్లు అర్జున్‌కు లేఖ అందింది. ఆ లేఖను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బన్నీ.
అల్లు అర్జున్ అంటే హార్డ్ వర్క్..
‘పుష్పలో మీ అద్భతమైన పర్ఫార్మెన్స్‌కు నేషనల్ అవార్డ్ లాంటి అరుదైన, అదునాతనమైన అవార్డును అందుకున్నందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీకు కంగ్రాట్స్ తెలియజేస్తోంది. మీ డెడికేషన్, హార్డ్ వర్క్, ఆ పాత్రలో మీరు ఒదిగిపోయిన విధానం మీకు ఇంత గుర్తింపును తెచ్చిపెట్టింది. మీరు సాధించిన విజయాలకు మేము చాలా గర్వపడుతున్నాం. మీ విజయం అనేది కేవలం మీ ఫ్యాన్స్‌కు, సన్నిహితులకు మాత్రమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు కూడా గర్వకారణంగా మారింది. నేషనల్ అవార్డ్ సాధించిన మొదటి తెలుగు యాక్టర్ అవ్వడం మీ ఎనలేని టాలెంట్‌కు, కమిట్మెంట్‌కు ఉదాహరణగా నిలుస్తోంది. మీ ఈ విజయం ఇండస్ట్రీలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలవడమే కాకుండా ఇతర తెలుగు నటులు కూడా జాతీయ స్టేజ్‌పై అలాంటి గుర్తింపును పొందాలని ప్రోత్సహిస్తుంది.’ అంటూ అల్లు అర్జున్ హార్డ్ వర్క్ గురించి ఉత్తరంలో ప్రశంసించింది మా.
భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి..
‘మీ అద్భుతమైన నటనతో ఆడియన్స్‌ను అలరించడంతో పాటు భవిష్యత్తు తరంలో రానున్న నటులకు కూడా నటన అంటే ఎలా ఉండాలో చూపించి, ప్రోత్సహించారు. మీరు మీ లిమిట్స్‌ను దాటుకుంటూ చూపించిన డెడికేషన్, వివిధ రకాల పాత్రలను ఎంచుకున్న పద్ధతి ఎందరో మనసులను దోచుకోవడంతో పాటు జాతీయ వ్యాప్తంగా తెలుగు సినిమాకు ఎంత ప్రతిభ ఉందో కనబరిచారు.’ అంటూ అల్లు అర్జున్‌ను ప్రశంసల్లో ముంచేసి, తను అందరికీ స్ఫూర్తి అని తెలిపింది మా. ఈ లెటర్‌లోనే మంచు విష్ణు కూడా అల్లు అర్జున్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
అదొక్కటే బాధ..
‘మిమ్మల్ని పర్సనల్‌గా కలిసి కంగ్రాట్స్ చెప్పాలని ఉన్నా.. ప్రస్తుతం నేను విదేశాల్లో ఉన్నాను. 17కు నేను రిటర్న్ అవుతున్నాను. మిమ్మల్ని నేరుగా కలిసి, మనస్ఫూర్తిగా విషెస్ చెప్పడం కోసం ఎదురుచూస్తున్నాను. మరొక్కసారి మీ సక్సెస్‌కు అభినందనలు. రానున్న సంవత్సరాల్లో ఇండియన్ సినిమాలో మీరు ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. అందరికీ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాము’ అంటూ విష్ణు.. ఈ లేఖలో తెలిపారు. ఇలాంటి లెటర్‌ను పంపినందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు, ప్రెసిడెంట్ మంచు విష్ణుకు థాంక్యూ చెప్పారు అల్లు అర్జున్. తను ఇచ్చిన ప్రశంస తన మనసును టచ్ చేసిందన్నారు. కలిసినప్పుడు మరిన్ని విశేషాలను పంచుకోవడానికి ఎదురుచూస్తుంటాను అని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు బన్నీ.
I thank the Movie Artist Association & the President @iVishnuManchu garu for this beautiful letter . Touched by the warm compliment. Looking fwd to share the rest in person . Warm Regards . pic.twitter.com/xYkS9gCvoG
— Allu Arjun (@alluarjun) September 9, 2023
Also Read: మొదటి వారం కబుర్లతో కంటెస్టెంట్స్ రెడీ, 'ఆ మాటలో తప్పేముంది' అంటూ దామినిపై నాగ్ ఫైర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial