అన్వేషించండి

Bigg Boss Season 7 Day 4 Updates: జైలుకైనా వెళ్తా, బిగ్ బాస్ హౌజ్ నుండి మాత్రం వెళ్లిపోతా: శివాజీ

బిగ్ బాస్ తనను ఇంప్రెస్ చేయాలని కంటెస్టెంట్స్‌కు టాస్క్ ఇవ్వకముందే కాఫీ పౌడర్ రాలేదని కంటెస్టెంట్స్ మధ్య హాట్ డిస్కషన్ జరిగింది.

బిగ్ బాస్ సీజన్ 7లో రోజురోజుకీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ పెంచడం కోసం బిగ్ బాస్ డోస్ పెంచుతూనే ఉన్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో రెండోరోజు ‘ఫేస్ ది బీస్ట్’ అనే టాస్క్ పెట్టి.. కంటెస్టెంట్స్‌ను కుస్తీపడేలా చేసి, ఆడియన్స్‌ను నవ్వించారు. కానీ ఆ టాస్క్ వెనుక ఇమ్యూనిటీ అనే సీరియస్ కారణాన్ని కూడా పెట్టారు. అయిదు వారాల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండడం కోసం బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు ఈ టాస్క్ ఇచ్చారు. అందులో ఆట సందీప్, ప్రియాంక జైన్.. తరువాతి లెవెల్‌కు వెళ్లడానికి క్వాలిఫై అయ్యారు. అయితే వీరితో పాటు మరో కంటెస్టెంట్ కూడా పోటీపడే అవకాశం ఉందని, ఆ అవకాశం దక్కించుకోవాలంటే రోజంతా బిగ్ బాస్‌ను కంటెస్టెంట్స్ ఇంప్రెస్ చేయాలని, ఎవరు ఎక్కువ ఇంప్రెస్ చేస్తే వారినే ఫైనల్ చేస్తానని బిగ్ బాస్ చెప్పారు. దీంట్లో కంటెస్టెంట్స్ మధ్య మరో సరదా పోటీ మొదలయ్యింది.

కాఫీ కోసం లొల్లి..
బిగ్ బాస్ తనను ఇంప్రెస్ చేయాలని కంటెస్టెంట్స్‌కు టాస్క్ ఇవ్వకముందే కాఫీ పౌడర్ రాలేదని కంటెస్టెంట్స్ మధ్య హాట్ డిస్కషన్ జరిగింది. అయితే తనకు బీపీ సమస్య ఉందని, కాఫీ తాగి టాబ్లెట్ వేసుకోవాలని శివాజీ సీరియస్ అవ్వడం మొదలుపెట్టారు. బిగ్ బాస్.. తనను ఏదో ఒక విధంగా ఇంప్రెస్ చేయాలి, దాని ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలి అని చెప్పినందుకు శివాజీ మరింత రెచ్చిపోయాడు. బకెట్‌ను తన్నుతూ, గిన్నెలు విసిరేస్తూ తన కోపమంతా బిగ్ బాస్ హౌజ్‌లోని ప్రాపర్టీపై చూపించడం మొదలుపెట్టాడు. కంటెస్టెంట్స్ అంతా తనను ఎంత కంట్రోల్ చేయాలని చూసినా.. శివాజీ అసలు కంట్రోల్ అవ్వడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ‘నేను ఎంత చేయగలనో చూస్తావుగా’ అంటూ బిగ్ బాస్‌కే ఛాలెంజ్ చేశాడు. 

బొక్కలో బిగ్ బాస్..
బిగ్ బాస్ గేట్ తీసిన తరువాతి నిమిషం వెళ్లిపోతానని, బొక్కలో బిగ్ బాస్ అని బూతులు తిట్టడం మొదలుపెట్టారు. ఇంకాసేపట్లో కాఫీ పౌడర్ పంపించకపోతే వెళ్లిపోతానని సీరియస్‌గా చెప్పాడు. శివాజీ.. ఇదంతా కావాలనే చేస్తున్నాడని కంటెస్టెంట్స్ ఎవరూ కనిపెట్టలేకపోయారు. అతడు ఎన్ని బూతులు మాట్లాడినా బిగ్ బాస్ మాత్రం ఏమీ స్పందించలేదు. కానీ ఒక్కసారిగా బీపీ మెషీన్‌ను హౌజ్‌లోకి పంపించి ‘హౌజ్‌లో ఒక డాక్టర్ ఉన్నాడు, శివాజీ బీపీ ఎంత ఉందో చెక్ చేసి తనకు చెప్పండి’ అంటూ గౌతమ్ కృష్ణను ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో శివాజీ కోపం మరింత పెరిగిపోయింది. జైలుకైనా వెళతా కానీ బిగ్ బాస్‌లో ఉండను అని గేట్లు తెరవమంటూ అరిచాడు. బీపీ చూడడానికి వచ్చిన గౌతమ్‌పై కోపడ్డాడు. తేజ కూడా తనకు సర్దిచెప్పడానికి చూసినా.. శివాజీ వినలేదు.

పిలిచి మరీ కాఫీ ఇచ్చాడు..
శివాజీ చేసిందంతా చూసిన బిగ్ బాస్.. తనను యాక్టివిటీ ఏరియాలోకి పిలిచాడు. అప్పుడు కూడా నేను అసలు వెళ్లను అంటూ మారాం చేశాడు శివాజీ. కానీ కంటెస్టెంట్స్ అంతా బలవంతం చేయడంతో వెళ్లాడు. అక్కడ తనకోసం ఒక కాఫీ ఎదురుచూస్తూ ఉంది. టాస్క్ కోసం తను అంతలా ప్రిపేర్ అయ్యి ఉంటే కాఫీ ఇచ్చి కూల్ చేయడం కరెక్ట్ కాదు అంటూనే ఆ కాఫీ తీసుకొని బయటికి వచ్చేశాడు శివాజీ. తను కూల్ అవ్వడంతో హౌజ్‌మేట్స్ కూడా ఊపిరిపీల్చుకున్నారు. కానీ తన తోటికంటెస్టెంట్స్‌కు కూడా డౌట్ రాకుండా శివాజీ బాగా యాక్ట్ చేశాడంటూ కొందరు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

Also Read: షారూఖ్ ఖాన్ మేనేజర్ పూజా సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget