అన్వేషించండి
Advertisement
Bigg Boss OTT Telugu: ఆర్జే చైతు ఎలిమినేషన్, షాక్ లో హౌస్ మేట్స్
ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఎలిమినేషన్ కోసం మొత్తం పన్నెండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఎలిమినేషన్ కోసం మొత్తం పన్నెండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారెవరంటే.. మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. ముందుగా హౌస్ మేట్స్ ఒక్కొక్కరితో మాట్లాడారు. ఈ క్రమంలో మోస్ట్ ఇరిటేటింగ్ హౌస్ మేట్ గా ఎక్కువ ఓట్లు ఆర్జే చైతుకి రావడంతో.. అతడి ఊతపదం 'సూపర్'ని హౌస్ లో వాడకూడదని శిక్ష విధించారు.
ముందుగా నామినేషన్స్ లో ఉన్న బిందు, అరియానాలను సేవ్ చేశారు. ఆ తరువాత మిత్రా, శివలు సేవ్ అయినట్లు అనౌన్స్ చేశారు. మరో టాస్క్ లో హమీద, నటరాజ్ మాస్టర్ సేవ్ అయినట్లు చెప్పారు. నెక్స్ట్ టాస్క్ లో తేజస్వి, అఖిల్ ని సేవ్ చేశారు. కలర్స్ టాస్క్ లో మహేష్ విట్టాను సేవ్ చేశారు. ఫైనల్ గా ఆర్జే చైతు, స్రవంతిలు డేంజర్ జోన్ లోకి చేరారు. వారిద్దరికీ ఓ టాస్క్ ఇచ్చి ఆర్జే చైతు ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ అంతా షాకయ్యారు.
మిత్రా అయితే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది. టాప్ 5లో ఉంటానని చెప్పేవాడని.. ఇప్పుడు సడెన్ ఎలిమినేషన్ ఏంటంటూ మాట్లాడింది. అరియనా కూడా బాధ పడింది. ఏది ఉన్నా.. చైతుతోనే చెప్పుకునేదాన్ని అంటూ ఎమోషనల్ అయింది. చైతు కూడా తన ఎలిమినేషన్ ని ఊహించలేదు. దీంతో కాసేపు షాక్ లో ఉండిపోయాడు. ఆ తరువాత స్టేజ్ పైకి వెళ్లిన చైతు ఎమోషనల్ అయిపోయాడు.
Also Read: షాకింగ్ ఎలిమినేషన్, బయటకు వెళ్లేదెవరంటే?
RJ Chaitu..... Eliminated.
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 20, 2022
Your thoughts.#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop@DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna
Let's show some ❤️❤️❤️ for our 'Chatterbox' RJ Chaitu.#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop@DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna pic.twitter.com/Y8k7cjgyOP
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 20, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
తెలంగాణ
నెల్లూరు
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion