అన్వేషించండి
Advertisement
Bigg Boss Telugu OTT Participants: బిగ్ బాస్ హౌస్ లో వర్మ హీరోయిన్, రచ్చ మాములుగా ఉండదేమో!
ఇప్పటివరకు హౌస్ లోకి ఎనిమిది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా.. తొమ్మిదో కంటెస్టెంట్ గా నటి శ్రీరాపాక ఎంట్రీ ఇచ్చింది.
Bigg Boss Non Stop Telugu Contestants: తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడాదికి ఒకసారి ఈ షోని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టారు. ఈరోజు నుంచే షోని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. నాన్ స్టాప్ గా హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. ఈరోజు స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. షో ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. ఇల్లు మొత్తాన్ని చూపించారు.
ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. వారియర్స్ అంటే పాత కంటెస్టెంట్స్ అని.. కొత్తవాళ్లను ఛాలెంజర్స్ అని చెప్పారు నాగ్. ఇప్పటివరకు హౌస్ లోకి ఎనిమిది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా.. తొమ్మిదో కంటెస్టెంట్ గా నటి శ్రీరాపాక ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిగానే కాకుండా.. ఫ్యాషన్ డిజైనర్ గా కూడా పని చేస్తుంది. స్పోర్ట్స్ లో కూడా ఆమెకి మంచి ప్రావీణ్యం ఉంది.
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'నగ్నం' అనే సినిమాతో ఈమె నటిగా ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె తన అందాలు ఓ రేంజ్ లో ఆరబోసింది. ఇప్పుడు హౌస్ లో కూడా అలానే ఉంటుందేమో!
స్టేజ్ పై ఉన్న నాగార్జునతో మాట్లాడిన ఆమె.. తనకు ఎమోషన్స్ ఎక్కువ అని, హౌస్ లోకి వెళ్లాక ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. హౌస్ లోకి వెళ్తూ.. తన నుంచి ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పింది.
Our next Challenger is #ShreeRapaka! What "Challenge" will she bring to the #BiggBoss house?!#BiggBossNonStop #disneyplushotstar @DisneyPlusHS @iamnagarjuna @EndemolShineIND pic.twitter.com/fjjv60MlPL
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022
ఇక పదో కంటెస్టెంట్ గా అనిల్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు. మోడలింగ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్.. నటుడిగా రాణించాలని అనుకుంటున్నారు. దీనికోసం బిగ్ బాస్ షో తనకు మంచి ప్లాట్ ఫామ్ అని చెప్పారు.
Our next challenger, #AnilRathod, makes a fiery entrance into the #BiggBoss house!! 🔥🔥🔥#BiggBossNonStop #disneyplushotstar @DisneyPlusHS @iamnagarjuna @EndemolShineIND pic.twitter.com/1H6kQbZJc5
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
గాసిప్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion